Lord Shiva : మహాశివునికి పూజ చేసేప్పుడు ఈ పొరపాట్లను అస్సలు చేయకండి..!!!
Lord Shiva : చాలామంది భక్తి, శ్రద్ధలతో పరమశివుడిని ఆరాధిస్తూ ఉంటారు. పరమశివుడిని పూజించేటప్పుడు ఈ పొరపాట్లని అస్సలు చేయకూడదు. ఈ పొరపాట్లను కనుక శివుడిని పూజించేటప్పుడు చేస్తే కచ్చితంగా శివుడి ఆగ్రహానికి గురవుతారు. మరి శివుడిని పూజించేటప్పుడు ఎలాంటి తప్పులను చేయకూడదనే విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం. సోమవారం శివుడిని పూజించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పొరపాట్లు అస్సలు చేయకూడదు.
లింగ రూపంలో ఉన్న శివుడిని కొలవడం వలన ఆ వ్యక్తి ఉన్నత స్థాయికి వెళ్తారని వేదాలు చెబుతున్నాయి. శివ పూజ చేసేటప్పుడు మాత్రం పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ పూజ చేయాలన్నా మొదట శుభ్రంగా స్నానం చేసి మంచి దుస్తులు ధరించాలి. శుభ్రమైన దుస్తులు ధరించి అప్పుడే పూజ చేయాలి. శివుడి పూజలో కూడా అంతే. శివుడిని పూజించేటప్పుడు ఓం నమశ్శివాయ మంత్రాన్ని స్మరించుకోవాలి. ఈ పంచాక్షరి మంత్రం చాలా శక్తివంతమైనది.
శివుడిని పూజించడానికి ముందు వినాయకుడిని కచ్చితంగా పూజించాలి. ఏ దేవుడిని పూజించాలన్నా మొదట వినాయకుడిని కచ్చితంగా పూజించి, ఆ తర్వాత మాత్రమే ఇతర దేవుళ్ళని పూజించాలి. తులసి ఆకుల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా శివుడికి పెట్టకూడదు. ఇంట్లో శివలింగాన్ని పెట్టినట్లయితే పైనుండి కచ్చితంగా జలధార ఉండాలి. జలధార లేకుండా శివలింగం పెట్టకూడదు. ఇది ప్రతికూల శక్తిని తీసుకొస్తుంది. శివుడు అభిషేక ప్రియుడు. అందుకే జలంతో అయినా సరే కచ్చితంగా పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ అభిషేకం చేయాలి.
అప్పుడు మీ కోరికలు కూడా తీరుతాయి. శివుడికి ఎంతో ఇష్టమైన బిల్వపత్రాన్ని కచ్చితంగా శివ పూజకి ఉపయోగించాలి. బిల్వపత్రాన్ని సోమవారం నాడు, అమావాస్య నాడు, మకర సంక్రాంతి నాడు, పౌర్ణమి నాడు, అష్టమి రోజుల్లో మాత్రం కొయ్యకూడదు. శివుడికి సంపంగి పూలు కూడా పెట్టకూడదు. కుంకుమని కూడా శివుడికి పెట్టకూడదు. శివుడికి వెలగ పండు అంటే చాలా ఇష్టం. కొబ్బరినీళ్ళని శివలింగంపై వెయ్యకూడదు. శంకు పుష్పాలని, తామర పువ్వులని శివుడికి పెట్టకూడదు. పారిజాత పుష్పాలతో పూజ చేయొచ్చు.