ఆరోగ్యం

వాల్‌నట్స్ తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు? – Amazing Benefits Of Eating Walnuts in Telugu

మ‌నకు అందుబాటులో ఉన్న అత్యంత పోష‌క విలువ‌లు క‌లిగిన ప‌దార్థాల్లో వాల్న‌ట్స్ ఒక‌టి. వీటిల్లో అనేక ర‌కాల పోషకాలు ఉంటాయి. మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన దాదాపు అన్ని ర‌కాల పోష‌కాలు వాల్ న‌ట్స్ లో ఉంటాయి. రోజూ వాల్ న‌ట్స్‌ను తీసుకోవ‌డం వల్ల అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.

వాల్నట్స్ ని ఆక్రోట్లు అని కూడా అంటారు. వాల్నట్స్ మన మెదడు లాగానే ఉంటాయి. నట్స్ అన్నిటి కన్న బలమైన ఆహారం ఇది, వాల్నట్స్ లో కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. వాల్నట్స్ లో అదికంగా ఒమేగా 3 ఫాటీ యాసిడ్స్, పోషకాలు, ఖనిజ లవణాలు, విటమిన్ E, విటమిన్ B, విటమిన్ K లు, ఫైబర్, కాల్షియం, పాస్పరస్, మంగనీస్, కాపర్, మెగ్నీషియం, వంటి మినరల్స్ అదికంగా ఉంటాయి.

వాల్నట్స్ అద్భుతమైన ప్రయోజనాలు

  1. గుండె జబ్బులు రాకుండా వాల్నట్స్ చక్కగా పని చేస్తాయి, వాల్నట్స్ లోని Polyphenols గుండె జబ్బులు తగ్గడానికి ఉపయోగపడుతుంది. వాల్నట్స్ లో ఒమేగా 3 ఫాటీ ఆసిడ్స్ అదికంగా ఉండటం వలన గుండె ఆరోగ్యానికి చాల మంచివి. ఈ వాల్నట్స్ చెడు కొలెస్ట్రాల్ (LDL)ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ (HDL)ని పెంచుతుంది. 
  2. శరీరానికి అనారోగ్య గురిచేసే ఫ్రీ రాడికల్స్ మెదడు ఖనజాలాన్ని నశించెలా చేస్తాయి. వాల్నట్స్ తీసుకోవడం వలన ఫ్రీ రాడికల్స్ నశింప చేస్తాయి. మెదడు పనితీరు మెరుగు పరచడానికి వాల్నట్స్ ఉపయోగపడుతాయి. యాంటీఆక్సిడెంట్లు అదికంగా ఉండటం వల్ల వృద్ధాప్య ఛాయలను మాయం చేసి కొల్లాడిన్ ఉత్పత్తిని పెంచి యవ్వనంగా, నూతనంగా ఉండేలా చేస్తాయి.
  3. చర్మ వ్యాదులకు పరిష్కారంగా వాల్నట్స్ ఉపయోగపడుతాయి. చర్మ మరియు కేశ సౌందర్యం మెరుగు పరచడానికి వాల్నట్స్ లోని biotin వంటి పోషకాలు జుట్టు కుదుళ్ళు దృడంగా ఉండి, ప్రకాశవంతంగా కనిపించడానికి ఉపయోగపడుతాయి.
  4. వాల్నట్స్ నుంచి వచ్చే నూనె అనేక రకాల hair products లో వాడుతారు. వాల్నట్స్ నిద్రలేమి సమస్య , మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. అదిక బరువు ఊబకాయం సమస్య ఉన్నవారు వాల్నట్స్ తీసుకోవడం వలన అందులో ఉండే కొవ్వులు ఎక్కువగా ఆకలి వేయకుండా చేసి బరువు తగ్గడానికి ఉపయోగపడుతాయి.
  5. వాల్నట్స్ రోజు తినడం వలన బరువు తగ్గడానికి సహాయపడుతాయి. రాత్రి నానబెట్టుకొని ఉదయం తింటే బరువు తగ్గడానికి మరియు ఆరోగ్యంగా ఉండనికి సహాయపడుతాయి
  6. షుగర్ వ్యాదితో బాధపడేవారు వాల్నట్స్ తీసుకుంటే, ఈ వాల్నట్స్ లోని కొవ్వులు ఆలస్యంగా గ్లూకోస్ గా మారుతాయి. కావున షుగర్ లెవెల్స్ పెరగకుండ నియంత్రిస్తాయి.
  7. అల్జీమర్స్ వ్యాది, మతిమరుపు రాకుండా వాల్నట్స్ చక్కగా ఉపయోగపడుతాయి. గర్బవతులు వాల్నట్స్ తీసుకోవడం వలన కడుపులోని బిడ్డ మరియు తల్లి ఆరోగ్యంగా ఉంటారు. వాల్నట్స్ తీసుకోవడం వలన వ్యాది నిరోధకతను పెంచి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
  8. వాల్నట్స్ వాడటం వలన అనేక రకాల కాన్సర్ వ్యాదులు రాకుండా ఉండటానికి వాల్నట్స్ చక్కగా ఉపయోగపడుతాయి. BP సంబంధిత వ్యాదులు ఉన్నవారు వాల్నట్స్ తీసుకోవడం చాల మంచిది. వాల్నట్స్ తినడం వలన అస్తమ, arthritis మరియు eczema వంటి జబ్బులు రాకుండ ఉంటాయి.

వాల్నట్స్ ని ఎలా వాడలి?

  • తాజా వాల్నట్స్ వాడటం మంచిది.
  • పచ్చి వాల్నట్స్ లో నూనె ఎక్కువగా ఉండటం వలన వేగటుగా ఉంటుంది తినలేము .
  • వాల్నట్స్ ఫ్రూట్ సలాడ్లో మరియు కూరలలో కూడ తీసుకోవచ్చు.
  • వాల్నట్స్ రాత్రి నానబెట్టి ఉదయం లేవగానే పరిగడుపున తినవచ్చు, రాత్రి పడుకునే సమయంలో కూడ తినవచ్చు.
  • రోజుకి 3 వాల్నట్స్ తింటే సరిపోతుంది.
  • వాల్నట్స్ ని అల్పాహారం లాగా సాయంత్రం కూడా తినవచ్చు.

ముఖ్య గమనిక : ఈ వివరాలు ఆరోగ్య నిపుణులు మరియు పరిశోధనల నుండి అందించబడ్డాయి. మేము అందించే ఈ సమాచారం ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా చిన్న సమస్య వచ్చిన వైద్యుని నుండి సలహా తీసుకోవడం ఉత్తమం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button