భక్తి & ఆధ్యాత్మికం

సౌందర్య లహరి – 1 శ్లోకం / Soundarya Lahari – 1 hymn Reciting benefits

శ్లోII 1. శివశ్శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం 
న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి I 
అత స్త్వామారాధ్యాం హరి హర విరించాదిభిరపి 
ప్రణంతుం స్తోతుం వా కధ మక్రుతపుణ్యః ప్రభవతిII 

తాత్పర్యం : అమ్మా నీ శక్తితో కూడినప్పుడే పరమ శివుడు అధినాయకుడు అగుచున్నాడు, అట్లు కాని నాడు ఆ దేవ దేవుడు సమర్ధుడు కాదు. అందువలననే హరి హర బ్రహ్మాదులచే పొగడబడుచున్న నిన్ను పూజించుటకు గానీ పొగడుటకు గానీ పుణ్యము చేయనివాడు ఎట్లు సమర్ధుడు అగును. 

జప విధానం – నైవేద్యం : ఈ శ్లోకమును రోజుకు 1000 సార్లు చొప్పున 12 రోజుల పాటు జపించి, వండిన అన్నమును (హవిస్సు) భగవంతునికి నైవేద్యం గా సమర్పించిన యెడల వారి జీవితంలో వున్న అవరోధాలు అన్ని తొలిగి, తమ యొక్క ప్రతి ప్రయత్నంలో విజయాన్ని సాధిస్తారు. పోయిన ఆనందాన్ని తిరిగి పొందుతారు అని చెప్పబడింది. 

SLOKA 1 :

Shivah shakthya yukto yadi bhavati shaktah prabhavitum

Na chedevam devo na khalu kusalah spanditumapi;

Atas tvam aradhyam Hari-Hara-Virinchadibhirapi

Pranantum stotum vaa katham akrta-punyah prabhavati


Translation Lord Shiva, only becomes able to do creation in this world along with Shakthi without her Even an inch he cannot move and so how can, one who does not do good deeds, or one who does not sing your praise, become adequate to worship you oh, goddess mine, who is worshipped by the trinity.

Chanting procedure and Nivedyam ( offerings to the Lord) : If one chants this verse 1000 times every day for 12 days, and offers cooked raw rice (Havis) as prasadam, one would succeed in all ventures and all obstacles would be removed and restore happiness. 

BENEFICIAL RESULTS: All prosperity, granting of cherished purposes and solution to intricate problems. 

Literal results: The yin and yang factor (feminine and masculine factor) is balanced. Treats hormonal imbalance. Female devotees facing severe marital problems will be able to bring issues under their control/ curb abusive tendencies in husband. If living in a joint family, there will be harmony between female devotee and in laws. This sloka could help females even in work atmosphere, in gatherings etc. Atleast 11 times chanting is a must everyday. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button