భక్తి & ఆధ్యాత్మికం

అఖండ విజయాన్ని ప్రసాదించే తంత్ర ప్రయోగం

అఖండ విజయాన్ని ప్రసాదించే తంత్ర ప్రయోగం

మీకు తెలియని ఈ తంత్ర ప్రయోగం, ఇది మీరు కోరుకున్న ఆనందం, డబ్బు, ఉద్యోగం, వ్యాపారం లేదా మరేదైనా కోరిక, ఎంత గొప్ప కోరికనైనా తీర్చే తంత్ర ప్రయోగం. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు సైతం తమ తమ కోరికలు తీర్చుకోవడానికి చేసినటువంటి తంత్ర క్రియ ఇది. ఈ తంత్ర ప్రయోగానికి తిరుగు లేదు. ఎండిపోయినటువంటి చెక్కను కూడా మొలకెత్తించడానికి ఇది ఒక గొప్ప ఉపాయం. నిస్సందేహంగా ఎటువంటి అసాధ్యమైన పనినైనా సుసాధ్యం చేస్తుంది. ఈ తంత్ర ప్రయోగాన్ని 41 రోజులు ఉదయం 22 నిమిషాల పాటు సాయంత్రం 22 నిమిషాల పాటు చేయాలి.

ప్రయోగానికి కావలసిన పదార్థాలు:

  1. ఆవు నెయ్యి. దుకాణంలో కొనే బదులు సొంతంగా పాలు, వెన్న, నెయ్యి తయారు చేసుకోండి. మీరు నెయ్యి తయారుచేస్తున్న అన్ని సమయాలలో, ఈ తంత్ర ప్రయోగం ద్వారా మీరు నెరవేర్చాలనుకుంటున్న కోరిక గురించి ఆలోచిస్తుండాలి. ఈ విధంగా 41 రోజులపాటు ప్రతిరోజూ నెయ్యి చేయాలి. రోజూ పాలు కాచి నెయ్యి చేయడం కుదరకపోతే ఆవు వెన్నను కొని ఆ వెన్నతో రోజూ నెయ్యి తయారు చేసుకోండి.
  2. పూవత్తి : స్టోర్ నుండి కొనుగోలు చేయడానికి బదులుగా మీరే ఇంట్లో తయారుచేయండి. బూరుగు పత్తి లేదా దూదిని తీసుకుని చిన్న గుత్తిలా చేయాలి అది మల్లె మొగ్గలా వస్తుంది. అదే పూవత్తి .
  3. ఒక చెక్క పీఠం.
  4. ఇంట్లో తయారు చేసుకున్న బియ్యం పిండి.
  5. ఒక కప్పులో బియ్యం గింజలు.
  6. ఒక వెండి దీపం.
  7. పంచ లోహాలు.
  8. పసుపు రంగు పట్టు వస్త్రం.
  9. చిన్న తేనె సీసా.

పవిత్రమైన రోజున(ఒక శుభ తిధి ఉన్న రోజు) ఈ ప్రయోగాన్ని ప్రారంభించండి. ఉత్తరాభిముఖంగా కూర్చుని, నక్షత్ర ముగ్గు లేదా అష్టదళ పద్మాన్ని బియ్యపు పిండితో పీఠంపై వేసి , దానిపై పసుపు రంగు పట్టు వస్త్రమును పరవాలి. ఆ పట్టువస్త్రం మధ్యలో నెయ్యితో వెండి దీపం వెలిగించి, దీపం చుట్టూ 27 కుప్పలు, ఒక్కో కుప్పలో 27 బియ్యపు గింజలు వేయాలి. ఆ తర్వాత దీపం చుట్టూ 5 పంచ లోహాలు ఉంచండి.

నెయ్యి చేయడానికి, వెన్నను తీయగా మిగిలిన పెరుగులో కొన్ని చుక్కల తేనె కలపండి. ఒకవేళ మీరే వెన్నతో నెయ్యి చేస్తే, కొంత వెన్నని విడిగా తీసుకుని, ఆ వెన్నలో కొన్ని చుక్కల తేనె కలపండి. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యాక, దీపం ముందు కళ్లు మూసుకుని కూర్చుని, మొదటి రోజు మనసులో 22 నిమిషాల పాటు కోరిక చెప్పండి. ఆ తర్వాత 22 నిమిషాల పాటు “ఓం శ్రీం హ్రీం క్లీం, ఓం హ్రీం శ్రీం క్లీం, ఓం లక్ష్మీయై స్వాహా” అనే మంత్రాన్ని జపించండి. మొదటి రోజునే మాత్రమే మీ కోరిక చెప్పాలి. మరుసటి రోజు నుంచి ఉదయం, సాయంత్రం మంత్రం జపిస్తే చాలు.

ప్రతిరోజు ఉదయం 22 నిమిషాలు, సాయంత్రం 22 నిమిషాలు మంత్రాన్ని జపించాలి. జప మాల అవసరం లేదు. ఇన్ని మంత్రాలు జపించాలనే నియమం లేదు. ప్రతిసారీ 22 నిమిషాలు మంత్రాన్ని జపించండి.

ఈరోజు నైవేద్యంగా పెట్టే 27 కుప్పల అన్నం మరుసటి రోజు పారే నీటిలో(నదిలో ) వేయాలి , లేకుంటే అవుకు పెట్టాలి. బియ్యాన్ని నీటిలో వదిలేటపుడు కానీ, ఆవుకి తినిపించేటప్పుడూ కాని మనసులో మీ కొరిక చెప్పకుని ఆ పని చేయాలి. దగ్గరలో పారే నీరు/నది లేదా ఆవు లేకుంటే, అన్నం కుప్పలన్నీ కలిపి ఉంచి 41 రోజులు పూర్తయిన చివరి రోజున నీటిలో వేయాలి, లేకుంటే ఆవుకి పెట్టాలి. మహిళలు ఆ 5 రోజులు ఆగి, ఆపై ప్రయోగాన్ని కొనసాగించవచ్చు.

ఈ ప్రయోగాన్ని దీక్షలా పవిత్రంగా నిర్వహించాలి. మధు,మాంసాహారాలకి దూరంగా ఉండాలి. మితంగా మాట్లాడండి. మితంగా తినండి. మంత్ర జపం ప్రతిరోజూ సరిగ్గా ఒకే సమయానికి చేయాలి. ఒక రోజు 6 గంటలకు, మరొక రోజు 7 గంటలకు చేయకుండా ఒకే సమయాన్ని అనుసరించండి. ఈ తంత్ర ప్రయోగం ద్వారా ఒక కోరికను కోరుకోవాలి. పైన పేర్కొన్న వస్తువులు కాకుండా, పీఠంపై ఇతర వస్తువులను లేదా దేవతల పటాలను ఉంచకూడదు. ఈ తంత్ర ప్రయోగం నిస్సందేహంగా ఏదైనా అసాధ్యమైన పనిని సుసాధ్యం చేస్తుందని చాలా నమ్మకంగా చెప్పబడింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button