కాళ్ళ పగుళ్లు తగ్గించే అద్భుతమైన చిట్కాలు
To get rid of cracked legs: కాళ్ళు అందంగా ఉండాలని అందరికీ ఉన్నా, అది కొందరికే సాధ్యపడుతుంది. కాళ్ళు నున్నగా, అందంగా రావడానికి, ఎన్నో రకాల పూతలను పూస్తుంటారు. శరీరంలో అన్నిటికంటే పాదాలు చివరగా ఉండడం వలన రక్తప్రసరణ సరిగ్గా జరగక, ఆ పాదాల చర్మం గట్టిగా అవుతుంది. లావుగా ఉన్నవారికి, రక్త ప్రసరణ సరిగ్గా లేనివారికి ఈ సమస్య ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా పాదాలను సరిగ్గా తోముకోనందువలన పగుళ్లు వస్తాయి. పగుళ్ల మధ్య మట్టి పేరుకుపోయి, ఆ భాగంలో కొత్త చర్మం పుట్టక, ఉన్న చర్మం మందపడి పగిలిపోతూ ఉంటుంది. ఈ చిట్కాలను అనుసరించి మీ కాళ్ళను మృదువుగా, అందంగా చేసుకోవచ్చు
Best Tips to Reduce Cracked Heels in Legs: కాళ్ళ పగుళ్లు తగ్గించే అద్భుతమైన చిట్కాలు
- కాళ్ళ పగుళ్ళు తగ్గాలంటే పాదాలను శుభ్రంగా కడిగి రాత్రి నిద్రపోయే ముందు ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె గాని పాదాలకు పెట్టుకోవాలి. పెట్టుకొని రాత్రంతా ఉంచుకోవాలి. ఇలా వారం రోజులు చేయటం వలన కాళ్ళపగుళ్ళు తగ్గుతాయి.
- వేడి నీళ్ళు తీసుకుని అందులో కళ్ళు ఉప్పు, షాంపూ, నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేయాలి. అందులో పాదాలు పెట్టి 20 నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత బ్రష్ తో పాదాలను రుద్దాలి. ఇలా చేయడం వలన కాళ్ల పగుళ్లు తగ్గుతాయి.
- కుంకుడు కాయ గింజలు నానబెట్టి ఆ గింజలను కాళ్ళ పైన పెట్టి బాగా రుద్దాలి. ఇలా చేయడం వలన కాళ్ల పగుళ్లు తగ్గుతాయి. కొబ్బరినూనె, వేపనూనె పెట్టి బాగా మసాజ్ చేయాలి.
- ఒక స్పూన్ చక్కెర, ఒక స్పూన్ బియ్యప్పిండి తీసుకొని అందులో ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె వేసి కొంచెం టమాటా రసం కలపాలి. ఆ తర్వాత దానిని పాదాలకు పూసుకోవాలి. ఇలా చేస్తే కాళ్ళ పగుళ్లు పోయి అందంగా మారుతాయి.
- ఉప్పులో కొద్దిగా నిమ్మరసం వేసి పాదాలకు పెట్టుకొని, ఆరిన తరువాత కడిగేయాలి.
- కొబ్బరి నూనె పాదాలకు రాసి వేడినీళ్లలో ఉంచాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే కాళ్ళ పగుళ్ళు తగ్గుతాయి.
- బియ్యప్పిండిలో తేనె, వెనిగర్ కలిపి, ఈ మిశ్రమాన్ని కాళ్ళ పగుళ్ళకు పెట్టి గోరువెచ్చటి వాటర్ లో ఉంచాలి. ఇలా చేయడం వలన కూడా కాళ్ళపగుళ్ళు తగ్గుతాయి.
- వేపాకు తీసుకొని పేస్ట్ లా చేసుకోవాలి. అలా చేసుకున్న పేస్టు లోకి పసుపు కలిపి పాదాలకు పెట్టుకోవాలి. దానిని 40 నిమిషాలు ఉంచుకుని తరువాత వేడి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే కాళ్ళ పగుళ్ళు తగ్గుతాయి.
- వేడి నీటిలో నిమ్మకాయ పిండి అందులో పాదాలను ఉంచాలి. ఇరవై నిమిషాల తర్వాత పొడిగుడ్డతో తుడిచి వేయాలి ఇలా చేయడం వలన కాళ్ల పగుళ్లు తగ్గుతాయి.
ముఖ్య గమనిక : ఈ వివరాలు ఆరోగ్య నిపుణులు మరియు పరిశోధనల నుండి అందించబడ్డాయి. మేము అందించే ఈ సమాచారం ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా చిన్న సమస్య వచ్చిన వైద్యుని నుండి సలహా తీసుకోవడం ఉత్తమం.