భక్తి & ఆధ్యాత్మికం

Sabarimala Yatra: శబరిమలయాత్ర ఎందుకు చెయ్యాలి?

అయ్యప్ప మాల అంతరార్థం

మనస్సునూ, శరీరాన్ని భగవంతునికి అంకితం చేయాలి. అందరినీ భగవంతుని రూపాలుగా భావించాలి.
అయ్యప్ప శరణు ఘోషను విడువకూడదు. నిత్యం భజన కార్యక్రమంలో పాల్గొనాలి.
భజన – పడిపూజ – హరివరాసనం
అయ్యప్ప పూజ చివరిలో “హరివరాసనం” లేదా “శ్రీ హరిహరాత్మజాష్టకం ”గానం చేయడం ఒక సంప్రదాయం. శబరిమల ఆలయంలో రాత్రిపూట మందిరం మూసేముందు ఈ స్తోత్రాన్ని పాడుతారు. ఇదే విధానాన్ని ఇతర ఆలయాలలోను, ఉత్సవాలలోను, పూజలలోను పాటిస్తున్నారు. ఈ స్తోత్రాన్ని “కుంబకుడి కులతూర్ అయ్యర్” రచించాడు. 1955లో స్వామి విమోచనానంద ఈ స్తోత్రాన్ని శబరిమలలో పఠించాడు. 1940, 50 దశకాలలో ఇది నిర్మానుష్యమైన కాలంలో వి. ఆర్. గోపాలమీనన్ అనే భక్తుడు సన్నిధానం సమీపంలో నివశిస్తూ ఉండేవాడు. మందిరంలో హరివరాసనాన్ని స్తోత్రం చేస్తూ ఉండేవాడు. ఆ అరణ్యప్రాంతంలో వన్యమృగాలకు భయపడేవాడు కాదు. అప్పట్లో ఈశ్వరన్ నంబూద్రి” అనే అర్చకుడు ఉండేవాడు. తరువాత గోపాలమీనన్ శబరిమల నుండి వెళ్ళిపోయాడు. అతను మరణించాడని తెలిసినపుడు చింతించిన ఈశ్వరన్ నంబూద్రి ఆరోజు ఆలయం మూసివేసే సమయంలో “హరివరాసనం” స్తోత్రం చదివాడు. అప్పటినుండి ఈ సంప్రదాయం కొనసాగుతున్నది. హరవరాసనం చదువుతున్నపుడు గర్భగుడిలో ఒక్కొక్కదీపం కొండెక్కిస్తారు. చివరికి ఒక్క రాత్రిదీపం మాత్రం ఉంచుతారు. ఈ శ్లోకం నిద్రపోయేముందు అయ్యప్పకు జోలవంటిది. శ్లోకం అయిన తరువాత నమస్కారం చేయవద్దని , “స్వా మి శరణు” అని చెప్పుకోవద్దని చెబుతారు. ఈ స్తోత్రంలో 8 శ్లోకాలున్నాయి.
మొదటి శ్లోకం –
హరివరాసనమ్ విశ్వమోహనమ్
హరిదధీశ్వరమ్ ఆరాధ్యపాదుకమ్
అరివిమర్దనమ్ నిత్యనర్తనమ్
హరిహరాత్మజమ్ దేవమాశ్రయే
శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా
శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా

శబరిమలయాత్ర

దీక్ష స్వీకరించి నియమాలతో మండలం గడిపిన భక్తులు శబరిమల యాత్ర చేస్తారు. ఈ దీక్ష స్వామి సన్నిధాన సందర్శనంతో ముగుస్తుంది. శబరిమల కేరళలోని పత్తినంత్తి తిట్ట జిల్లాలో పశ్చిమ కనుమల్లో సహ్యాద్రి పర్వత శ్రేణుల ప్రాంతం క్రిందకు వస్తుంది. గుడి సముద్ర మట్టం నుంచి సుమారు 3000 అడుగుల ఎత్తులో దట్టమైట్టన అడవులు మరియు 18 కొండల మద్య కేంద్రీకృతమై ఉంటుంది. ఇక్కడికి యాత్రలు నవంబర్ నెలలో ప్రారంభమై జనవరి నెలలో ముగుస్తాయి. మండల పూజ (నవంబర్ 17), మకరవిళక్కు (జనవరి 14) ఈ యాత్రలో ప్రధాన ఘట్టాలు. జనవరి 14 వ రోజును ఆలయంలో మకర జ్యోతి దర్శనమిస్తుంది. మిగతా అన్ని రోజుల్లోనూ గుడిని మూసే ఉంచుతారు. కానీ ప్రతీ మళయాళ నెలలో ఐదు రోజుల పాటు తెరచియుంచుతారు.

ఎరుమేలి

శబరిమల యాత్ర “ఎరుమేలి”తో మొదలవుతుంది. ఎరుమేలిలో “వావరు స్వా మి”ని భక్తులు దర్శించుకొంటారు. (అయ్యప్ప పులిపాలకోసం అడవికి వెళ్ళి నపుడు అతనిని అడ్డగిండ్డ చిన ఒక దొం గ అనంతరం స్వామి సన్నిహిత భక్తునిగా మారాడు. అతడే వావరు స్వా మి. “నన్ను దర్శిం చుకోవాలని వచ్చిన భక్తులు ముందుగా నిన్నుదర్శించుకొంటారు” అని అయ్యప్ప వావరుకు వరమిచ్చాడట. ఈ వావరు స్వా మి ఒక ముస్లిం కులస్తుడు. ఈ వావరు ఇక్కడ కొలువున్నది కూడా ఒక మసీదులోనే) దర్శనానంతరం భక్తులు వావరుస్వా మి చుట్టూ రకరకాల వేషధారణతో “పేటై తులాల” అనే నాట్యం చేస్తారు. (మహిషితో యుద్ధం చేసేటపుడు అయ్యప్ప చేసిన తాండవం పేరు “పేటై తులాల”). ఈ ఎరుమేలి వద్ద ఉన్న “ధర్మశాస్త” ఆలయంలో అయ్యప్ప స్వా మి ధనుర్బాణధారియై ఉంటాడు. ఇక్కడ వినాయకుడు కూడా కొలువై ఉంటాడు. ఈయనను “కన్నె మూల గణపతి” అని అంటారు. ఇక్కడ భక్తులు కొబ్బరికాయ కొడతారు.

పాదయాత్ర

ఇక్కడినుండి భక్తుల పాదయాత్ర మొదలవుతుంది. పాదయాత్రకు రెండు మార్గాలున్నాయి. “పెద్ద పాదం” అనేది కొండలమధ్య దట్టమైట్ట న అరణ్యంలో ఉన్న కాలిబాట. ఇది ఎనభై కిలోమీటర్ల దారి. దారిలో పెరుర్తోడు, కాలైకట్టి అనే స్థలాలున్నాయి. (మహిషితో అయ్యప్పస్వా మి యుద్ధం చేస్తుండగా కాలైకట్టి వద్ద నుండి శివకేశవులు యుద్ధాన్ని చూశారట). ఇక్కడికి కొద్ది దూరంలోనే అళదానది (మహిషి కార్చిన కన్నీరు నదీరూపమైందట) ఉంది. ఈ నదిలో స్నానం చేసి భక్తులు నదినుండి ఒక రాయిని తీసుకు వెళతారు. ఆ రాతిని “కళిద ముకుంద” (మహిషి కళేబరాన్ని పూడ్చిన చోటు) వద్ద పడవేస్తారు. తరువాత యాత్ర ముందుకు సాగి పెరియానపట్టమ్ట్ట , చెరియానపట్టమ్ట్ట అనే స్థలాల గుండా పంబ నది చేరుకొంటుంది. అక్కడే “పంబ” అనే గ్రామం కూడా ఉంది. ఇక్కడినుండి స్వా మి సన్నిధానానికి ఏడు కిలోమీటర్ల దూరం. చిన్నపాదం మార్గంలో బస్సులు కూడా తిరుగుతాయి. బస్సులపై పంబానది వరకు చేరుకోవచ్చు. చివరి ఏడు కిలోమీటర్లు మాత్రం కాలినడకన వెళ్ళాలి

సన్నిధానం

భక్తులు పంబానదిలో స్నానం చేసి “ఇరుముడి”ని తలపై పెట్టుకొని అయ్యప్ప శరణు ఘోషతో “నీలిమలై” అనే కొండ మార్గం ద్వారా ప్రయాణిస్తారు. కన్నెస్వా ములు (తొలిసారి దీక్ష తీసుకొన్నవారు) తమతో తెచ్చిన ఒక బాణాన్ని దారిలో “శరమ్ గుత్తి” అనే చోట ఉంచుతారు. ఇక్కడినుండి అయ్యప్ప సన్నిధానంకు ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది. సన్నిధానం వద్ద ఉన్న 18 మెట్లను “పదునెట్టాంబడి” అంటారు. 40 రోజులు దీక్ష తీసుకొని ఇరుముడి ధరించినవారు మాత్రమే ఈ మెట్లు ఎక్కేందుకు అర్హత కలిగి ఉంటారని కధనం. ఒక్కో మెట్టుకు ఒక్కో అధిష్టాన దేవత ఉంటుంది. సన్నిధానానికి, 18 మెట్లకు నమస్కరిస్తూ స్తోత్రాలు పఠిస్తూ మెట్లను ఎక్కుతారు. ఈ ఆలయంలో స్వామి కొలువైన సందర్భంగా 18 వాయిద్యాలను మ్రోగించారట. సన్నిధానంలో “పానవట్టం”పైన అయ్యప్ప కూర్చుని ఉన్న భంగిమలో దర్శనమిస్తాడు. స్వామియే శరణం అయ్యప్ప స్వామి కూర్చున్న తీరు శివలింగాన్ని తలపిస్తుందని. ఒంపు తిరిగిన ఎడమచేయి మోహిని అవతారాన్ని తెలియజేస్తుందని చెబుతారు

హరిహరసుతనే అయ్యప్ప

ఈయనను హరిహరసుతుడని, మణికంఠుడని కూడా పిలుస్తారు. అయ్యప్ప పూజా సాంప్రదాయం అధికంగా దక్షిణ భారతదేశంలో ఉంది. అయ్య విష్ణువు), అప్ప శివుడు) అని పేర్ల సంగమం తో ‘అయ్యప్ప’ నామం పుట్టింది. మహిషి అనే రాక్షసిని చంపి అయ్యప్ప శబరిమల లో వెలిశాడు. కేరళలోని శబరిమల హిందువుల ప్రధాన యాత్రా స్థలాలలో ఒకటి. శబరిమలలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు. బరిమలైలోని ప్రధాన దేవాలయమే కాకుండా అనేక దేవాలయాలున్నాయి. కేరళలోనే “కుళతుపుళ”లో ఇతనిని బాలుని రూపంలో అర్చిస్తారు. “అచ్చన్ కోవిల్”లో పుష్కల, పూర్ణ అనే దేవేరులసమేతుడైన అయ్యప్పను పూజిస్తారు. శబరిమలలోని అయ్యప్ప సన్నిధికి యేటా ఐదుకోట్లమంది భక్తులు దర్శనార్ధులై వెళుతుంటారు.

అయ్యప్ప స్వా మి జనన కారణము

అయ్యప్ప జననము సరిగా ఎవరికీ తెలీదు . ఎన్నో కధలలో కొన్నింటిని మతపెద్దలు ప్రచారములో పెట్టేరు. క్షీరసాగరమధనం అనంతరం దేవతలకు, రాక్షసులకు అమృతం పంచేందుకు విష్ణువు మోహినిగా అవతారం దరించి కార్యం నిర్వహిస్తాడు. తరువాత అదేరూపంలో విహరిస్తున్న మోహినిని చూసి శివుడు ఆమె పట్ల ఆకర్షిం పబడతాడు. భస్మాసురుడు అనే రాఖసుడు శివుని కై తపస్సు చేసి … తానూ ఎవరి తలపై చేసి వేస్తే వారు భస్మము అయిపోయేట్లు వరము పొంది, తాను పొందిన వరకు పనిచేయునది , లేనిది పరీక్ష నిమిత్తము శివుని తలపై నే చేయి వేయుటకు పూనుకొనగా చావు భయముతో శివుడు పారిపోయి గురివింద గింజ లో దాక్కోనెను. శివుని రక్షించే కార్యములో విష్ణువు ‘మోహినీ ‘ రూపము ఎత్తి భస్మా సుర వధ గావించెను. ఏది ఏమైనా … వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మా సము, 30వ రోజు శనివారం, పంచమి తిధి, ఉత్తరాత్త నక్షత్రం వృశ్చికా లగ్నమందు శాస్త(స్తఅయ్యప్ప) జన్మిం చాడు. ఇతడు శైవులకు, వైష్ణవుష్ణలకు ఆరాధ్య దైవం. తండ్రియైన జగత్పతి ఆజ్ఞ ప్రకారము పంపా సరోవర తీరప్రాంతంలో మెడలో మణిమాలతో శిశురూపంలో అవతరించాడు అయ్యప స్వామి . ఇలా హరి హరులకు బిడ్డ పుట్టుటకు కారణముంది . మహిషను సంహరించడానికే …

ఈ మహిష ఎవరు ? పూర్వము త్రిమూర్తుల అంశ తో జన్మిం చిన దత్తాత్రేయుడు .. ఆ త్రిమూర్తుల భార్య లైన – సరస్వతి ,లక్ష్మీ , పార్వతి ల అంశతో జన్మిం చిన ‘లీలావతి’ని పెళ్లి చేసుకుంటాడు. లోకోద్ధారణ ముగిశాక అవతారము చాలిద్దామని దత్తాత్రేయుల వారు అంటే … మరికొంతకాలము ఇక్కడే సుఖిద్దామని భార్య కోరగా , దత్తునకు కోపము వచ్చి” మహిషి ” గా జన్మించమని శపిస్తాడు . శక్తి స్వరుపిని అయిన లీలావతి భర్తను “మహిష” గా పుట్టుడురుగాక అని ప్రతి శాపముతో ఇద్దరు … రంబాసురుడు అనే రాక్షసుడుకి యక్షకి దత్తుడు మహిషాసురుడు గాను , కరంబాసురుడు అనే రాక్షసుడుకి లీలావతి మహిషి గాను జన్మించిరి . మహిసాసుర మర్దినిర్ది తో (దుర్గాదేవి ) మహిసాసురుడు చనిపోగా మహిష తపమాచరించి బ్రహ్మ వద్ద ఎన్నో వరాలు పొంది చివరికి చావు ఉండకూడదని వరము అడుగుతుంది . పుట్టినట్టి వానికి గిట్టకట్ట తప్పదు … అని ఇంకో వరము కోరుకోమంటాడు బ్రహ్మ. హరి హర సుతుని చేతిలో తప్ప మరెవరి చేతిలో చావు లేకుండా వరము కోరినది . హరి హరులు వివాహమాడరు గదా .. వారికి బిడ్డ పుట్టడనే తెలివితో కోరుకున్నదీ వరము . తీరా అయ్యప్ప జన్మతో మహిష మరణిస్తుంది

మహిషి వధ
అడవిలో నారదుడు మహిషిని కలిసి అయ్యప్పను గురించి నిన్ను చంపేందుకు ఒక రాజకుమారుడు వస్తున్నాడు అని హెచ్చరిస్తాడు. మహిషి గేదె రూపంలో అయ్యప్పను చంపడానికి వెళుతుంది. వీరి యిద్దరిద్ద మధ్య జరిగే యుద్ధాన్ని వీక్షించేందుకు సమస్త దేవతలు అదృశ్యరూపంలో వస్తారు. ఈ సమయంలో అయ్యప్ప ఒక కొం డపైకి ఎక్కి తాండవం చూస్తూ మహిషిని ఎదిరించాడు. అయ్యప్ప మహిషిల మద్య జరిగే భీకరయుద్ధం లో చివరిగా మహిషిని నేలపై విసిరికొడతాడు ఆ దెబ్బకి గేదె రూపంలో ఉన్న మహిషి మరణిస్తుంది. దేవతలంతా ఆయనను స్తుతిస్తూ ఆయన ముందుకు వస్తారు. అప్పుడు శ్రీ అయ్యప్ప ఇంద్రునితో దేవేంద్రా! నేను చిరుతపులి పాలు తెచ్చే నెపంపై యిలా వచ్చాను. కాబట్టి మీరందరూ చిరుతలై నాకు తోడ్పడండి అని అడుగుతాడు. ఆయన కోరికపై అందరు చిరుతపులులుగా మారిపోయారు. ఇంద్రుడు స్వయంగా అయ్యప్పకు వాహనమైన చిరుతగా మారిపోయాడు. చిరుతల దండుతో అయ్యప్ప తన రాజ్యం చేరుతాడు.

అయ్యప్ప చరితము

హరి హర పుత్రుడైన అయ్యప్ప పందల రాజ్యా న్ని పాలించే “రాజషేఖరపాన్ద్యు డు “నకు పంపానదీ తీరాన
లభిస్తాడు. సర్పం నీడన పవళిం చి ఉన్న అతనికి ” మణికంఠుడు ” అని పేరు పెట్టి విద్యా బుద్దులు నేర్పిస్తాడు. అయ్యప్ప స్వామి గురుకులంలో చదువుకునే రోజుల్లో వారి గురువు ఎడల అత్యంత భక్తీ శ్రద్దలతో వుండేవాడు. సాక్షాత్తు భగవంతుడైనప్పటికీ గురువు ద్వార సకల విద్యలు నేర్చుకున్నాడు. అయితే గురుదక్షిణగా గురువు కోరికపై అంధుడు, ముగవాడైన ఆయన పుత్రునికి మాట , ద్రుష్టి ప్రసాదించి తన గురుభక్తినిక్తి చాటుకున్నాడు. ప్రజలను భయభ్రాంతులకు లోను చేస్తున్న “వానరుడనే ” బందిపోటు దొంగను ఓడించి అతనికి దివ్యత్వా న్ని బోధించాడు. తండ్రి అప్ప జేప్పబోయిన సింహాసనాన్ని త్యజిస్తాడు మనికంటుడు . ఆయన కోరికమేర తను బాణం వేసిన చోట ఓ ఆలయం నిర్మిం చి ఇచ్చేం దుకు ఒప్పుకుంటాడు తండ్రి. అదే శబరిమల ఆలయము . అందులో మణికంఠుడు అయ్యప్ప స్వామిగా అవతరిచాడు. ఎవరైతే నియమ నిష్టలతో సేవించి “పదునేట్టాంబడి ” నెక్కి దర్శిస్తారో వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు. మాటలు రాని వారికి మాటలు వచ్చే మహిమాన్వితమైన ప్రదేశమిది . చూపులేనివారికి చూపునిచ్చే కన్నుల పండువైన ప్రదేశమిది. భగవంతుని మహిమ కలిగిన శబరిమలైలో గల దివ్య ఔషధాల వనములికా పరిమళ ప్రభావం తో కూడిన ప్రాణవాయువును పీల్చగానే ఎంతటి అనారోగ్యమైనా చక్కబడుతుంది. సంతానము, సౌభాగ్యము, ఆరోగ్యము, ఐశ్వర్యము మొదలైన కోరిన వరాలనిచ్చే స్వామి అయ్యప్ప.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button