భక్తి & ఆధ్యాత్మికం

Sabarimala Yatra: అయ్యప్ప దీక్ష ఎందుకు చెయ్యాలి?

పల్లెల్లో , పట్టణాల్లో అయ్యప్ప స్వాముల సందడి నెలకొంది. చెడు వ్యసనాలకు దూరంగా నిత్యం దైవ నామస్మరణ చేస్తూ క్రమశిక్షణతో భక్తులు ఆధ్యా త్మిక చింతనతో అయ్యప్పను స్మరిస్తున్నారు. లక్షల్లో భక్తులు అయ్యప్ప దీక్షను తీసుకొని 41 రోజుల పాటు కఠిన నియమాలు పాటించి ఇరుముడి కట్టుకొని శబరియాత్రకు బయలుదేరి వెళ్తారు. గురుస్వా మి ద్వారా మెడలో అయ్యప్పమాలను ధరించిన వ్యక్తులు, దీక్షా నియమాలు పాటిస్తే కలిగే ఆరోగ్యం , ఐశ్వర్యం కలుగుతాయి.

  • మానసిక ఒత్తిడిని తీసి, ఆధ్యాత్మిక భావనతో మానసిక ప్రశాంతతను పొందడానికి యువత ఎక్కువగా మాల ధరించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గురుస్వా మి ద్వారా మెడలో అయ్యప్పబిళ్ల ఉన్న తులసి, రుద్రాక్ష మాలలు శరీరానికి తగలడం వల్ల వ్యా ధులు దరి చేరవంటారు. దీక్షలో బ్రహ్మచర్య వ్రతానికి ప్రాధాన్యం ఉంటుంది.
  • దీక్ష పూర్తి చేసిన భక్తులు అయ్యప్ప స్వా మిని దర్శిం చుకోవడానికి ఇరుముడి కట్టుకొని యాత్రకు బయలుదేరి శబరి సన్నిధానంలో ఉన్న పద్దునెద్దు ట్టం బడి(18 మెట్లు) ఎక్కి అయ్యప్ప స్వా మిని దర్శనం చేసుకుంటారు.
  • అయ్యప్ప దీక్షా నియమావళిలో నిత్యం తీసుకునే సాత్విక ఆహారం మంచి ఆరోగ్యా నికి దోహదపడుతుంది.
  • స్వా ములు ఒక పూట భోజనం, రెండో పూట అల్పా హారం నియమబద్ధం గా తీసుకోవడం వల్ల శరీరం తేలికవుతుంది.
  • చెప్పులు లేకుండా నడవడం వల్ల రక్తప్రక్త సరణ బాగా జరుగుతుంది. నిత్యం జరిగే భజన కార్యక్రమాలలో రెండు అరచేతులతో చప్పట్లు కొట్టడంట్ట వల్ల చేతుల్లోని నరాల్లో రక్తప్రక్త సరణ బాగా జరిగి తెలియని ఆనందాన్ని పొందుతారు.

  1. అయ్యప్ప దీక్షాపరులుకు ఎటువంటి ఇబ్బం ది లేకుండా పట్టణాలతో పాటు, గ్రామాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీక్షలో ఉన్నవారికి బిక్ష పెడితే అయ్యప్పస్వా మికి పెట్టినట్లేనని గురుస్వాములు చెబుతుండటంతో దాతలు పెద్దఎత్తున ముందుకొస్తున్నారు.
  2. వెళ్లలేని వారికి ఉపశమనం: కేరళలోని శబరిమలలో కొలువైన అయ్యప్పస్వా మిని దర్శిం చుకోలేని వారికి ఆంధ్రలో ప్రముఖ దేవాలయాలు అందుబాటులో ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని మండపేట మండలంలోని ద్వారపూడిలో అయ్యప్ప దేవాలయం ఉంది. దీనినే ఆంధ్ర శబరిమల అని పిలుస్తుం టారు. ఈ ప్రాంతం విజయవాడ నుంచి 169 కి.మీ దూరంలో ఉంటుంది
  3. చిరుతిండ్లు, మాంసాహారానికిదూరం దీక్షా సమయంలో మాలాధారణ చేసిన భక్తులు మాంసాహారం, రోడ్డు పక్కన చిరుతిండ్లు వంటి వాటిని తినరు..
  4. పొగ, మద్యపానం, ఇతర దుర్వ్య సనాలకు దూరంగా ఉండటం వల్ల అనారోగ్యం వారి దరిచేరదు. తరచూ
    కర్పూరహారతి ఇవ్వడం వల్ల సూక్ష్మ క్రిములు దరిదాపుల్లోకి రావు.
  5. శారీరక ఉత్సా హం: దీక్షా సమయంలో తెల్లవాల్ల రుజామున 4 గంటలకు నిద్రలేచి చన్నీటి స్నా నం చేయడం, నుదుట విభూది, చందనం, కుంకుమ ధరించి దీపారాధన చేసి పూజ శరణుఘోష ముగించుకుంటారు. బ్రహ్మచర్య వ్రతం పాటిస్తూ నేలపై చాప, దిండు లేకుండా నిద్రించడం వల్ల మెడనొప్పి వంటివి దరిచేరవు. నేలపై పడక మొదట్లో ఇబ్బంది కలిగించినా తరువాత ప్రశాంతంగా నిద్ర పడుతుంది.
  6. పూజ, భజనల అనంతరం నిత్యం అయ్యప్ప భక్తులు సహపంక్తి భోజనాలకు ప్రాధాన్యం ఇస్తుం టారు. అందరూ నల్లవస్త్రాలు ధరించి మాసిన గడ్డాలతో ఉండడం సమానత్వ భావాన్ని పెంపొందిస్తాయి. కుల, మత, హోదా, గొప్ప, బీద తారతమ్యాలు మరచి స్వా ములు తిన్న ఎంగిలి విస్తర్లను
  7. ఎత్తడానికి భక్తులు పోటీ పడుతుంటారు. ప్రతి ఒక్కరిలో దైవాన్ని సందర్శించడమే దీని ప్రత్యేకత.
  8. శబరిమలకు చేరేదిలా: అయ్యప్పస్వా మి దర్శనార్థం శబరిమలకి వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీర్టీ ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని కల్పించింది. బృందాలుగా ఏర్పడి వెళ్లే వారి కోసం ప్యాకేజీలు అందిస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button