ఆహారం

Athipatti Mokka : అనేక ఔష‌ధ గుణాలు క‌లిగిన అత్తిప‌త్తి మొక్క‌.. ఇంట్లో త‌ప్ప‌క ఉండాల్సిందే

Athipatti Mokka: Nutrients, Benefits & Uses

అత్తిపత్తి పేరు మనలో చాలామంది వినే ఉంటారు. దీనినే నిద్రగన్నిక అని కూడా అంటారు. అత్తిపత్తి చెట్టుతో ఎన్నో రోగాలను నయం చేయవచ్చు..కానీ, దీనిని ఏ ఏ రోగాలకు వాడతారు, ఎటువంటి రోగాలకు ఎలా వాడాలి అనే విషయం చాలామందికి తెలియదు.. అత్తిపత్తి చెట్టు మగవారిలో వీర్యహీనతకు,వీర్య స్తంభనకు, కొన్ని రకాల సుఖ రోగాలకు, ఆడవారిలో బహిష్టు సమస్యలకు, యోని,స్తనాల బిగువుకు, రక్త మొలలకు, అతి మూత్ర సమస్యకు, ఇలా అత్తిపత్తి చెట్టు మనకు ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలను కలిగిస్తుంది.

ముట్టుకోగానే ఆకులన్నీ ముడుచుకొని, కొంతసమయం తరువాత వాటంతటవే మళ్ళీ విచ్చుకుంటాయి. వర్షాకాలంలో మన గ్రామాలచుట్టూ నీటితడివున్న ప్రదేశాలలో ఈమొక్క పెరుగుతుంది. ఇందులో ముళ్ళులేని మొక్క, ముళ్ళు వున్నమొక్క అనే రెండురకాలుంటాయి. ముళ్ళున్న అత్తిపత్తి భూమినుండి జానెడుమొదలు మూరెడువరకు ఎత్తుపెరుగుతుంది. ఆకులు తుమ్మాకుల్లాగా చిన్నగా వుంటాయి. కొమ్మలకు ముళ్ళుంటాయి. పూలు ఎరుపుకలిసిన ఊదారంగులో వుంటాయి. ముళ్ళులేని అత్తిపత్తి నేలపై పరుచుకొని వుంటుంది. ఇదికూడా నీరున్న ప్రాంతాలలోనే పెరుగుతుంది. నేలపైన రెండుమూడు గజాల వరకు పాకుతుంది. దీనికి పసుపురంగుపూలు వస్తాయి, సన్నటికాయలుంటాయి. కాయల్లో గింజలు లక్కరంగులో వుంటాయి.

అత్తిపత్తి ని సంస్కృతంలో ల్యుటీ అని, హిందీలో బాణోపేత, చూయిమూయి, షర్మానీ అని, తమిళంలో తొట్టాసినింగి, నిన్నాసినింగి అని, తెలుగులో నిద్రగన్నిక, నీసిగ్గుచితక అని అంటారు.

అత్తిపత్తి కి వాతాన్ని హరించే గుణం ఉంటుంది. ఇది రక్తశుద్ధి చేస్తుంది. రక్తాన్ని, మూత్రాన్ని సాఫీగా జారీచేస్తుంది. ముక్కునుంచి కారే రక్తాన్ని ఆపుతుంది. పాత వ్రణాలను మాన్పుతుంది. మేహరోగాలని, మూలవ్యాధిని, బోద కాలును, కామెర్లను, పొడలను, కుష్టును, విరేచనములను, జ్వరమును, గుండెదడను, శ్వాసకాసలను, తుంటి నొప్పిని, ఉబ్బురోగాన్ని, స్త్రీరోగాలను హరించి వేస్తుంది.

వీర్యహీనతకు బ్రహ్మాస్త్రం లాగా పనిచేస్తుంది..
అత్తిపత్తిగింజలు, చింతగింజల పప్పు, నీరుగొబ్బి గింజలు సమంగా తీసుకొని, మట్టిపాలలో ఒకరాత్రి నానబెట్టి తరువాత గాలికి ఆరబెట్టి, మెత్తగా నూరి శనగగింజలంత మాత్రలు చేసి, గాలికి ఎండబెట్టి నిలువ చేయాలి. రెండుపూటలా, పూటకు మూడు మాత్రలు నీటితోవేసుకొని వెంటనే నాటు ఆవుపాలు కండచక్కెర కలిపి తాగాలి.
నలభైరోజుల్లో మూత్రములో వీర్యముపోవడం. శీఘ్రస్కలనం, నపుంసకత్వం, అంగబలహీనత హరించి ధాతుపుష్టి కలుగుతుంది.
వేడి, పులుపు, కారం పదార్థాలు నిషేధించి బ్రహ్మచర్యం పాటించాలి.

ఇతరులు మూత్రం పోసిన చోట మరొకరు మూత్రం పోయడం వల్లగానీ, లేక సెగరోగమున్న వారితో సంభోగం జరపడంవల్లగానీ ఎరుపు, తెలుపు, పసుపు సెగ అనే సుఖరోగం కలుగుతుంది. ఈ సమస్యకు అత్తిపత్తి ఆకు, మంచిగంధంపొడి సమంగా తీసుకొని కలబంద గుజ్జుతో మెత్తగా నూరి మాత్రలుకట్టి, నీడలో గాలికి బాగా ఎండబెట్టి నిలువ చేసుకోవాలి. రోజూ రెండుపూటలా, పూటకు ఒకమాత్ర మంచినీటితో వేసుకొంటూవుంటే సెగ రోగం తగ్గిపోవడమేకాక వీర్యవృద్ధి కూడా కలుగుతుంది..

అత్తిపత్తిఆకులు మెత్తగానూరి నారికురుపులపై వేసి కట్టుకడుతూవుంటే అవి నశించిపోతాయి. నారికురుపుల సమస్య ఉన్నవారికి గోంగూర, వంకాయ, మాంసం, చేపలు నిషేధం.

అత్తిపత్తి ఆకుపొడి ఒకభాగము, పటికబెల్లం పొడి రెండుభాగాలు కలిపి పూటకు అరచెంచా పొడి మంచినీటితో సేవిస్తూవుంటే ఆగిన బహిష్టు మరలా వస్తుంది. బహిష్టు రాగానే చూర్ణం వాడటం ఆపాలి. దీనితోపాటు
బెల్లం, నువ్వులు, గంజి, తీపిపదార్ధాలు వాడాలి.

అత్తిపత్తి వేర్లను మేకపాలతోగానీ, గొర్రెపాలతో గానీ, గంధంలాగా నూరి ఆగంధాన్ని పురుషులు తమ అరికాళ్ళకు మర్ధించుకొని, ఆ తరువాత రతిలో పాల్గొంటే చాలాసేపటివరకు వీర్యపతనం కాదు.
దీనితో పాటు తీపి పదార్థాలు బాగా వాడుకోవాలి.

అత్తిపత్తిఆకు 5 గ్రాములు, మిరియాలు 9 ఒకకప్పు వీటితో మెత్తగా నూరి బట్టలో వడపోసి పరగడుపున 40 రోజులపాటు సేవించాలి. దీనితోపాటు అత్తిపత్తిఆకును ముద్దగా నూరి బోదకాలిపైన పట్టులాగా చేసి కట్టుకడుతూవుంటే మంట, పోటు, బాధ తగ్గిపోతాయి…
మాంసం, చేపలు, నంజుపదార్థాలు నిషేధం.

అత్తిపత్తిఆకును తేనెతో మెత్తగానూరి యోనికి పట్టిస్తూవుంటే యోని బిగువుగా మారుతుంది. తీపిపదార్ధాలు మంచిగా సేవించాలి.

అత్తిపత్తి సమూల చూర్ణం, అశ్వగంధ దుంపల చూర్ణం, సమంగా కలిపి వుంచుకొని రాత్రిపూట తగినంత పొడిని నీటితోనూరి స్తనాలపైన పట్టించి ఉదయం కడుగుతువుంటే జారిన స్తనాలు బిగువుగా మారతాయి. దీనితో పాటు, పాలు, నెయ్యి, పండ్లు, తీపి తినాలి.

అత్తిపత్తి ఆకు 30 గ్రాములు మిరియాలు 2 గ్రాములు, ఈ రెంటిని మెత్తగానూరి ఒక గ్రాము బరువుగల మాత్రలు చేసి, గాలికి నీడలో ఎండబెట్టి నిలువచేసుకోవాలి. రెండుపూటలా ఒకమాత్ర గోరువెచ్చని నీటితో సేవిస్తూవుంటే చెల్దికురుపులు, మశూచికం గండమాల హరించిపోతాయి… ఈ చర్మ సమస్యలు ఉన్నవారికి చేపలు, మాంసం, వేడిపదార్థాలు నిషేధం.

అత్తిపత్తి సమూల చూర్ణం 3 నుండి 5 గ్రాములు, పంచదార ఒక చెంచా కలిపి రెండుపూటలా సేవిస్తుంటే అతిసార విరేచనాలు, రక్తమొలలు హరించిపోతాయి. విరేచనకర పదార్థాలు నిషేధం..

సూర్యగ్రహణము లేక చంద్రగ్రహణము రోజున, అత్తిపత్తికి ధూపదీప నైవేద్యాలతో పూజించి వేరుతెచ్చి, కడిగి ఆరబెట్టి దాన్ని రాగి తాయెత్తులో పెట్టి మొలకు గానీ, చేతికిగానీ కట్టివుంచితే.. అంతకుముందువరకు
సిగ్గులేకుండా బరితెగించి ప్రవర్తించే స్త్రీ, పురుషులు క్రమంగా తమతప్పును తామే తెలుసుకొని సిగ్గుపడతారు.
చేపలు,మాంసం, మత్తుపదార్థాలు నిషేధం.

పచ్చని పూలుపూలు అత్తిపత్తిచెట్టుకాడలను, తాటి కలకండను సమంగా కలిపి మెత్తగానూరి, కుంకుడు గింజలంత మాత్రలు చేసి గాలిలో నీడకు బాగా ఆరబెట్టి రెండుపూటలా మర్రిచెక్క కషాయంతో ఒక మాత్ర సేవిస్తూవుంటే అతిమూత్రం హరిస్తుంది.

అత్తిపత్తి ఆకులు ముద్దగా నూరి అందులో కొంచెం పసుపు కలిపి నూరి కురుపులపైన, పుండ్లపైన వేసి కట్టుకడుతూవుంటే క్రమంగా వ్రణాలు మాడిపోతాయి..

పచ్చని పూలుపూసే అత్తిపత్తిచెట్టుకాడలను, తాటి కలకండను సమంగా కలిపి మెత్తగానూరి, కుంకుడు గింజలంత మాత్రలు చేసి గాలిలో నీడకు బాగా ఆరబెట్టి రెండుపూటలా మర్రిచెక్క కషాయంతో ఒక మాత్ర సేవిస్తూవుంటే అతిమూత్రం హరిస్తుంది.

అత్తిపత్తి ఆకులు ముద్దగా నూరి అందులో కొంచెం పసుపు కలిపి నూరి కురుపులపైన, పుండ్లపైన వేసి కట్టుకడుతూవుంటే క్రమంగా వ్రణాలు మాడిపోతాయి..
అత్తిపత్తిచెట్టును సమూలంగా ఒకకేజీతెచ్చి కడిగి నలగ్గొట్టి అందులో 4 కేజీల నీళ్ళుపోసి, ఒకరాత్రినాన బెట్టి ఉదయం పొయ్యిమీద పెట్టి ఒక కేజీ కషాయం మిగిలేవరకు, మరిగించి వడపోసి ఆకషాయంలో ఒక కేజీ నువ్వుల నూనెపోసి, తైలం మిగిలేవరకు మళ్ళీ మరగపెట్టాలి.
తరువాత ఆనూనెతో దీపం వెలిగించి పైన మంటతగిలేలా మట్టిమూకుడుగానీ, రాగి పళ్ళెం కాని పెట్టి మసిపారించాలి. తరువాత ఆమసిని తీసి తగినంత ఆవునెయ్యి కలిపితే కాటుక అవుతుంది . రోజురాత్రి కళ్ళకు పెట్టుకొంటుంటే పొరలు, పూతలు మసకలు పూర్తిగా తగ్గిపోతాయి..

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button