Banana Plant: అరటిచెట్టు ఔషధగుణాల గురించి ఎప్పుడైనా విన్నారా
Banana Plant: Nutrients, Benefits & Uses
అరటిచెట్టు ఔషధగుణాల గురించి ఎప్పుడైనా విన్నారా? దాదాపుగా అందరికి అరటిపండు తినడం తెలుసుగానీ, మిగిలిన అరటిచెట్టులోని ఏ ఏ భాగాలను, ఏఏవ్యాధులకు అద్భుత ఔషధాలుగా పనిచేస్తాయో తెలియదు. పూర్వకాలంలో పచ్చి అరటికాయలతోపాటు అరటిపువ్వు, అరటిమొవ్వ, అరటిదుంప, అరటిఊచ వీటినికూడా వివిధరకాల కూరలుగా వండుకొని తింటూ, అనేకరోగాలను అరికట్టే అద్భుత సంప్రదాయం మనకుండేది. ప్రస్తుత కంప్యూటర్ యుగంలో, వీధుల్లో హోటళ్లలో దొరికే అనారోగ్యకర పదార్థాల గురించే తెలుసుగానీ, పరిసరాలలోని ఆహార ఔషధాలగురించి ఏమాత్రం తెలియదు. అరటిచెట్టు ఔషధగుణాల గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం..
అరటిచెట్టురసం తీపి, వగరు, రుచులు కలిగి వుంటుంది. చలువచేస్తుంది. వాతాన్ని పెంచి వీర్యపుష్టిచేస్తుంది. మూత్రపిండాలలో రాళ్ళను, ఉదరంలోని క్రిములను, సెగరోగములను, రక్తపైత్యాన్ని పోగొడుతుంది.
ఇంటిలో అరటిచెట్టు పెంచవచ్చా అని చాలామంది ఆలోచిస్తుంటారు.. ఇండ్లలో ఒకచెట్టు పెంచడం ఉత్తమమని రెండు చెట్లు పెంచడం మధ్యమమని, మూడుచెట్లు పెంచడం వ్యాధికారకమని, నాలుగుచెట్లు పెంచడం నాశన కరమని పెద్దలమాట. కాబట్టి ఒకచెట్టునే ఇంట్లో పెంచుకోండి.
అరటిపూవు తో చేసిన వడియాలు రుచికరంగా వుండి దగ్గు, ఆయాసం మొదలైన శ్వాసరోగాలను పోగొట్టి బలం కలిగిస్తాయి.
అరటిఆకు లో భోజనం, మనసుకు ఇంపుగా వుంటుంది. జ్వరం, క్షయ, కఫవాతం, దగ్గు, ఉబ్బసం మొదలైన వ్యాధులను అణచివేచి జఠరాగ్నిని వీర్యబలాన్ని ఆయువును పెంచుతుంది. విషప్రభావాన్ని హరించివేస్తుంది.
స్త్రీల – అతిఋతురక్త స్రావానికి, బాగా మగ్గిన అరటిపండు ఒకటి, నాటు ఆవునెయ్యి లేదా నాటు గేదెనెయ్యి 50 గ్రా॥ కలిపి తినాలి. ఇలా రోజుకు మూడుపూటలా, మూడుసార్లు తింటూవుంటే బహిష్టులో ఆగకుండా ప్రవాహంలాగా స్రవించే అతి ఋతువు సమస్య ఆగిపోతుంది.
స్త్రీలలో గర్భాశయరోగాలు ముదిరిపోయి చివరికి సోమరోగంగా మారి యోనిగుండా తెల్లని నీరు నిరంతరం స్రవిస్తూవుంటుంది. దీనిని వెంటనే ఆపక పోతే ధాతువులు శోషించి ప్రాణాలకే ప్రమాదం.
పచ్చిఉసిరికాయలరసంలోగానీ, ఉసిరికాయలతో కాచిన కషాయంలోగానీ, అరటిపండ్లను కలిపి కొంచెంతేనె, పటికబెల్లం కూడా చేర్చి రెండుపూటలా సేవిస్తూవుంటే స్త్రీల సోమరోగం హరించిపోతుంది.
బాగాపండిన అరటిపండును మెత్తగా పిసికి కాలిన గాయాలపైన వెంటనే లేపనంచేస్తే మంట, పోటు తగ్గి గాయాలు త్వరగా మానిపోతాయి..
మూత్రంలో మంట తగ్గుటకు, బాగా మెత్తగావున్న పసుపుపచ్చని చిన్న అరటిపండు తింటూవుంటే మూత్రంలో మంట తగ్గడమేకాక ఆమాశయం కూడా పరిశుభ్రమౌతుంది.
తెల్లబొల్లి మచ్చలు తగ్గుటకు అరటిచెట్టుదూట రసంతీసి తగినంత పసుపు కలిపి పైన లేపనం చేస్తూవుంటే తెల్లబొల్లి త్వరగా నివారించబడుతుంది.
అరటిచెట్టు వేరును మెత్తగానూరి రసంతీసి, రెండు మూడుచెంచాల రసం ఒకకప్పు నీటిలో కలిపి తాగుతూ వుంటే అతివేడి, అతిపైత్యం రెండుమూడురోజుల్లో తగ్గిపోతుంది.
అన్నిరకాల – కడుపునొప్పులకు అరటిచెట్టును ఎండబెట్టి కాల్చి బూడిదచేసి జల్లించి పెట్టుకోవాలి. ఈ బూడిదను 1లేక2 గ్రాముల మోతాదుగా ఒకకప్పు నీటిలో కలిపి రోజూ మూడు పూటలా తాగుతూవుంటే ఉదరరోగాలు తగ్గిపోతాయి.
మూత్రం ఆగితే రప్పించడానికి అరటిదుంపను మెత్తగా తొక్కి పొత్తికడుపు పైనవేసి బట్టతో కట్టుకడితే మూత్రం అతిత్వరగా సహజంగా బయటకు వస్తుంది.
ఉబ్బసరోగం – తగ్గుటకు రోజూ ఉదయం పరగడుపున ఒక చక్కెరకేళీ అరటి పండును తగినంత గోమూత్రంలో కలిపి మెత్తగా పిసికి ఈ మిశ్రమాన్ని సేవిస్తుంటే అతిదారుణమైన ఉబ్బస రోగం అతిత్వరగా తగ్గిపోతుంది.
వివిధ కారణాలవల్ల కొందరు స్త్రీలకుయోని బయటకు జారిపోతుంది. అలాంటివారు, పచ్చి అరటికాయలను ముక్కలుగా తరిగి ఎండబెట్టి దంచి జల్లించి నిలువ వుంచుకోవాలి. ఈ చూర్ణాన్ని పూటకు మూడునుండి అయిదు గ్రాముల మోతాదుగా మంచి నీటితో రెండుపూటలా సేవిస్తూవుంటే యోనికంద రోగం హరించిపోతుంది.
అరటిపండును తొక్కతీసి ఆపండుమధ్యలో చిటికెన వెలు పెట్టి పొడిచి గుంటలాగాచేసి ఆ గుంటలో ఒకగ్రాము మిరియాలపొడి వేసి ఆపండును ఒక మోతాదుగా రోజూ రెండుపూటలా తింటూవుంటే చాలాకాలంనుంచి వేధించే దగ్గు తగ్గిపోతుంది.
పెద్దపెద్ద పుండ్లు తగ్గిపోవుటకు, మెత్తటి అరటిపండ్లు వేడి అన్నం, గేదెపేడ సమంగా కలిపి మెత్తగా పిసికి పైన వేసి కట్టుకడుతూవుంటే క్రమంగా ఆపుండ్లు మానిపోతాయి.
పులిత్రేన్పులు త్వరగా తగ్గుటకు అరటిఆకులను బాగా ఎండబెట్టి, కాల్చి జల్లించి నిలువవుంచుకోవాలి. ఆ బూడిదను ఒకటి లేక రెండు చిటికెలు మోతాదుగా, ఒకచెంచా తేనెతో కలిపి రెండు పూటలా తింటూవుంటే త్రేన్పులు తగ్గిపోతాయి.
స్త్రీలు – సుఖంగా ప్రసవించుటకు అరటిచెట్టువేరును స్త్రీ నడుముకు కట్టివుంచితే అతిసులువుగా కష్టంలేకుండా ప్రసవిస్తుంది.
ఆగిన బహిష్టు మరలా వచ్చుటకు, అరటిఊచరసం పరగడుపున అరకప్పు మోతాదుగా సేవిస్తుంటే, ఆగిపోయిన బహిష్టు మరలా వస్తుంది.
అరటిదుంపరసం 20 గ్రాములు, పటికబెల్లంపొడి 20 గ్రాములు కలిపి రెండుపూటలా సేవిస్తూవుంటే తెల్లతెగ, ఎర్రశెగ, పచ్చశెగ రోగములుతగ్గిపోతాయి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.