ఆహారం

Akkala karra Benefits: ఆయుర్వేద ఔషధాలకు జీవగడ్డ అక్కలకర్ర….

Akkala Karaa: Nutrients, Benefits & Uses

కొండలపైన గుట్టలపైన దొరికే, అపురూపమైన అనంతకోటి శక్తులు కలిగిన ఈ అక్కలకర్ర మొక్క దాదాపుగా అందరికి తెలియదనే చెప్పవచ్చు. ఇది బంగారంలాగా ఎంతో విలువైనమొక్క. దీని వేర్లకు ప్రపంచ మార్కెట్లో విపరీతమైన గిరాకీ వుంది. వెంపలిచెట్టులాగా పెరిగే ఈ మొక్కలు అనేకచోట్ల కొండగుట్టలపైన, మెట్టప్రాంతాలలో కనిపిస్తూ ఉంటాయి. దీని సర్వాంగాలు సర్వోన్నతమైన శక్తికలిగినవే. ఈ అక్కలకర్ర గురించి, దీనితో మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, ఏ వ్యాధికి ఎలా వాడుకోవాలి, అనే పూర్తి వివరాలను ఈ తెలుసుకుందాం..

అక్కల కర్రను సంస్కృతంలో అకారకరభ అని, హిందీలో అకర్ కరా అని, తెలుగులో అక్కలకర్ర అని, ఆంగ్లంలో Pellitory root అని అంటారు.

అక్కలకర్ర వేరు కారంగా వుండి నాలుకపై కొద్దిగా వేసుకుంటే చిమచిమలాడుతుంది. ఉష్ణ స్వభావంతో వాత, పిత్త, కఫ సంబంధమైన సమస్త దోషాలను హరించివేస్తుంది. నరాలకు బలం కలిగించి , గుండె జబ్బులను, పక్షవాతాన్ని, తల నొప్పిని, మూర్ఛను హరించివేసి బుద్ధికి కూడా బలమిస్తుంది. సమస్త వాత, మేహనొప్పులను పోగొడుతుంది. శరీరంలోని చెడుపదార్థాలను కరిగించి బయటకు తోసివేస్తుంది. దీని ఉపయోగాలు కోకొల్లలుగా వున్నాయి.

బాలపాపచిన్నెలు- హరించుటకు
అక్కలకర్రవేరును దారంతో చుట్టి పిల్లల మెడలో వేస్తే పిల్లలకు చంటిబిడ్డ గుణాలు, బాల పాపచిన్నెలు మొదలైనవి అంటుకోవు.

అనేకనొప్పులకు – అక్కలకర్ర
అక్కలకర్రవేరును దంచిపొడిచేసుకొని నిలువ వుంచుకోవాలి. రెండుమూడుచిటికెలు మోతాదుగా ఒకచెంచా తేనెతో కలిపి కొద్దికొద్దిగా నిదానముగా చప్పరించి తింటుంటే వెన్నునొప్పి, పిరుదులనొప్పి, పాదాలనొప్పులు, మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పులు తగ్గిపోతాయి.

నత్తి తగ్గుటకు అక్కలకర్ర
రోజూ అక్కలకర్రవేరు ముక్కను కొద్దిగా గంధం తీసి నాలుకపైన కొద్దిగా మాత్రమే రాస్తుంటే నత్తి తగ్గిపోతుంది. ఎక్కువ రాస్తే పుండుపడుతుంది, కనుక జాగ్రత్త వహించాలి.

కంఠరోగాలు దంతరోగాలు
అక్కలకర్ర, దుంపరాష్ట్రం, సొంఠి ఒక్కొక్కటి ఒక్క గ్రాముచొప్పున ఒక గ్లాసు నీటిలో వేసి ఒక కప్పు కషాయం మిగిలేవరకు చిన్నమంటపైన మరిగించి దించి వడపోసి గోరువెచ్చగా నోటిలో పోసుకొని గొంతువరకు తగిలేటట్లు అయిదు నిమిషాలపాటు పుక్కిలించి వూసివేస్తుంటే కంఠరోగాలు, దంత రోగాలు మాటుమాయమైపోతాయి.

జగమొండి-శిరోరోగములకు
అక్కలకర్ర, మిరియాలు, సొంటి ఒక్కొక్కటి 5 గ్రాముల మోతాదుగా తీసుకొని మంచినీటితో మెత్తగానూరి తలకు పట్టువేస్తుంటే దీర్ఘకాలికమైన తలనొప్పులు తగ్గిపోతాయి.

గర్భంరాకుండా రక్షణమార్గం
మిరియాలు, అక్కలకర్ర సమంగా పొడిచేసి నిలువ వుంచుకోవాలి. సంభోగం చేసేముందు కొద్దిగా పొడిని తేనెతో మెత్తగానూరి పురుషుడు తన అంగానికి లేపనం చేసుకొని ఆ తరువాత సంభోగంలో పాల్గొంటే ఆస్రీకి గర్భంరాదు.

మూతి వంకరపోయే-ముఖపక్షవాతం
అక్కలకర్ర, నేలతాడి దుంపలు, బూరుగు వేర్లు, లవంగాలు, దాల్చినచెక్క, చలువ మిరియాలు, పిప్పళ్ళు, అశ్వగంధ గడ్డలు, జాజికాయలు, బాదం పప్పు, పిస్తాపప్పు, గసగసాలు, జాపత్రి, నల్ల జీలకర్ర వీటిని ఒక్కొక్కటి పదిగ్రాముల మోతాదుగా తీసుకొని. తగినంత తేనెతో కలిపి మెత్తగా ముద్దలాగా నూరాలి. ఆ ముద్దను రేగిపండంత గోలీలుగాచేసి ఆరబెట్టి నిలువవుంచుకోవాలి. రోజూ పూటకు ఒక మాత్ర చొప్పున రెండు పూటలా తేనెకలిపిన నీటితో సేవిస్తువుండాలి. ఇలా చేస్తుంటే కొద్దిరోజుల్లోనే మూతివంకర తగ్గి ముఖం సక్రమంగ వస్తుంది.

బాలింతల వాతరోగములకు
అక్కలకర్ర, మిరియాలు, గ్రామాల్లో దొరికే తెల్ల ఉప్పిచెట్టు చిగుర్లు సమంగా తీసుకొని మంచి నీటితో మెత్తగానూరి శనగగింజలంత గోలీలు చేసి నీడలో గాలికి బాగా ఆరబెట్టి నిలువ చేసుకోవాలి.
రోజూ పూటకు రెండు గోలీలు చొప్పున, రెండు పూటలా మంచినీటితో వేసుకొంటూవుంటే బాలింతల వాతం హరించిపోతుంది.
పథ్యం : వేయించిన ఉప్పు, కాల్చిన మిరిపకాయలు, పొంగునీళ్ళ అన్నం మాత్రమే ఆహారంగా తీసుకోవాలి…

దగ్గు, రొమ్ము, పడిశం
అక్కలకర్రవేర్లను దంచి జల్లించి నిలువ వుంచుకోవాలి. ఒకటి లేదా రెండుచిటికెల పొడిని ఒకచెంచా తేనెతో కలిపి, రెండుపూటలా ఆహారానికి గంటముందు సేవిస్తుంటే కఠినమైన దగ్గులు, గడ్డకట్టుకుపోయిన రొమ్ముపడిశం హరించి పోతాయి.

ఫిట్స్, మూర్ఛలు హరించుటకు అక్కలకర్ర వేర్లపొడిని, వెనిగర్ మెత్తగా నూరి, దానికి మూడురెట్లు తేనెకలిపి, ఆ మిశ్రమాన్ని గాజు సీసాలో నిలువ పెట్టుకోవాలి. రోజు పరగడుపున మూడుగ్రాముల మోతాదుగా చప్పరించి తింటుంటే పిట్స్, మూర్ఛలు తగ్గిపోతాయి.

పక్షవాతానికి – పసందైనమార్గం
అక్కలకర్ర వేర్ల పొడి, దోరగా వేయించిన సొంటి పొడి, దోరగా వేయించిన నల్ల జీలకర పొడి, దోరగా వేయించిన సన్నరాష్ట్రంపొడి, సమంగా కలిపి నిలువవుంచుకోవాలి. రోజూ రెండుపూటలా రెండు లేక మూడు గ్రాముల మోతాదుగా ఈ పొడిని, తగినంత తేనెతో కలిపి సేవిస్తుంటే క్రమంగా పక్షవాతం తగ్గిపోతుంది.

చిలుకచేత మాట్లాడించుటకు
అక్కలకర్రను దంచి పొడిచేసి ఆహార పదార్థాలలో కొద్ది కొద్దిగా కలిపి రోజు తినిపిస్తుంటే చిలుకకు మాటలు వచ్చి మనిషిలాగా మాట్లాడగలుగు తుంది. పూర్వం ఈ ప్రయోగంద్వారానే మైనా పక్షులకు చిలుకలకు మాటలు నేర్పేవారు.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button