అతిశక్తివంతమైన దుర్గా వజ్రపంజర కవచం
శత్రు భయ నివారణ – సర్వత్ర విజయము – సకల మనోవాంఛితములని నెరవేర్చే అతిశక్తివంతమైన సాధన:
రోజు కనీసం 3 సార్లు శుక్రవారం 9 సార్లు ఇలా 6 నెలలు చేయగా చేయగా సాధన లో అద్బుతమైన ఫలితాలు వస్తాయి. ఈ సాధన చేసిన అన్ని రోజులు సాత్విక ఆహారం తీసుకోండి . ఈ సాధనను ఒక
దీక్షగా చేయవలెను. అంటే 41 రోజులు చేయండి. ఇలాంటి సాధన చేసిన వారు చాలా మంది సాధనలో మంచి మంచి అనుభవాలు తెలుపుతున్నారు, కొందరికి మొదలు పెట్టిన కొద్దివారాలకి చాలా మంచి అనుభవాలు వస్తున్నాయి. కొందరికి నెలలు చేసిన రావటం లేదు కారణం చెడు కర్మ, ముందు ఆ కర్మని మీ సాధనతో ప్రక్షాళన చేసుకుంటే త్వరగా ఫలితాలు వస్తాయి. సాధన చేయగా చేయగా, విశ్వ శక్తి చైతన్యతత్వంతో అనుసంధానం ఏర్పడుతుంది.
దుర్గాదేవి వజ్రపంజర కవచం ఎవరైతే 108 మార్లు పారాయణ చేసినచో 6 నెలల్లో సమస్త కష్ట నష్టములు, దారిద్ర్యము తొలగిపోవును. స్త్రీలు ఈ కవచ పారాయణ వలన సంతానం కల్గును. సకల ఆపదలు,కష్టములు ప్రమాదములు తొలగును.
ఏ మంత్ర సాధన అయిన మీ ఆలోచన లో శ్రేష్ఠతని పెంచి ఉన్నత ఆలోచన సరళిని కలిగిస్తుంది, ప్రకృతి మీకు కావలసిన కామ్యము ను నెరవేర్చుకోడానికి కావలసిన వాతావరణం కల్పిస్తుంది.
అతిశక్తివంతమైన దుర్గా వజ్ర పంజర కవచం:
అస్య శ్రీ దుర్గా వజ్రపంజర కవచస్య నారద ఋషిః | అనుష్టుప్ ఛంద:
దుర్గా దేవతా | చతుర్ వర్గ సిద్ధ్యర్థే వినియోగః
ఓంకారో మే శిరః పాతు హ్రీంకారః పాతు భాలకం |
దూంపాతు వదనం దుర్గా జేయుతా పాతు చక్షుషీ ||
నాసికాం మే నమః పాతు కర్ణావష్టాక్టరీ సదా |
ప్రణవో మే గళం పాతు కేశాన్ శ్రీ బీజమంతతః ||
లజ్జా దంతాన్ సమారక్షేత్ జిహ్వాం దుర్గా సదావతు |
ఐం నమః: పాతు వజ్రాంతా ఓష్టా గండౌ నవాక్షరీ ||
ఏకాక్షరీ మహావిద్యా వక్షో రక్షతు సర్వదా |
కూర్చాద్యా వివిధా విద్యా బాహూమే పరిరక్షతు |
ఓం దుర్గే పాతు జంఘేద్వే దుర్గే రక్షతు జానునీ ||
ద్వా వూరూపాతు యుగళం రక్షిణి స్వాహ యాన్వితా|
జయదుర్గా సదా పాతు గుల్చే ద్వే చండికావతు||
కటిం జాయా సదా పాతు నాభిం మే విజయావతు |
ఉదరం పాతు మే కీర్తి: పృష్టం ప్రీతి: సదావతు ||
ప్రభా పాదాంగుళీన్ పాతు శ్రద్ధా స్కంధౌ సదా వతు |
మేధా కరాంగుళీన్ సర్వాన్ నఖరాన్ శుచిరేవచ ||
శంభో గుహ్యంతు మే పాయాత్ చక్రం లింగం సదావతు|
సర్వాంగం మే సదా పాతు ఖడ్గఒ రక్షతు సర్వతః ||
పాశౌమే విదిశః పాతు దిశః పాశాంకుశా మమ |
చాపోదారాన్ శరః పుత్రాన్ బంధూంశ్చాపి సదావతు ||
ఇంద్రాద్యాః పాతుమే చిత్రం వజ్రాద్యాస్తు కుటుంబకాన్ |
దుర్గా మాం పాతు సర్వత్ర జయదుర్గా చ ద్వారకాన్ ||
యద్య దంగం మహేశాని వర్ణితం కవచేషు చ |
తత్ సర్వం రక్ష మే దేవి పతిపుత్రాన్వితా సతీ ||