Most powerful Mantras : అతిశక్తివంతమైన శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర మంత్రము
Most Powerful Govinda Mantra: అతిశక్తివంతమైన శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర మాలా మంత్రమును ఈ క్రింద చెప్పిన విధముగ ఉపాసన చేయండి . నిత్యము 5 సార్లుగాని లేక 9 లేక 11 సార్లుగాని జపం చేసి ధ్యానిస్తున్న యెడల స్వామి వారు ఆయుః ఆరోగ్య విద్యా ఉద్యోగ ఐశ్వర్యాభివృద్ధిని కలుగజేస్తారు. సర్వారిష్టాలను నాశనము చేస్తారు 41 రోజుల సాధన లో స్వప్న దర్శనం కలుగుతుంది . అలాగే ప్రత్యేక కోరికతో శ్రీ వేంకటేశ్వరుని ఉపాసించే పనైతే రోజు 108 సార్లు 41 రోజులు నిష్ఠ తో చేసినా యెడల అద్బుత ఫలితాలు వస్తాయి
వివిధ మంత్రశాస్త్ర గ్రంథాలలో వివరించిన ప్రకారంగా ఏ మంత్రానికైనా
1) ఒక లక్ష సార్లు అనగా (108 సంఖ్య గల మాలతో 1000 మాలలు) మూల మంత్రాన్ని జపం చేయాలి.
2) అందులో పదో వంతు అనగా 10 వేల సార్లు ఆ మూలమంత్రంతో హెూమం చేయాలి.
3) హెూమ సంఖ్యలో పదోవంతు అనగా ఒక వెయ్యి సార్లు ఆ మూలమంత్రంతో తర్పణ చెయ్యాలి.
4) తర్పణ సంఖ్యలో పదోవంతు. 100 సార్లు మూలమంత్రంతో మార్జన లేదా అభిషేకం చెయ్యాలి.
5) అందులో పదో వంతు. 10 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి.
ఈ ఐదు పనులతో మంత్ర పురశ్చరణ పూర్తవుతుంది. శాస్త్రంలో బ్రాహ్మణ భోజనం అని వున్నప్పటికీ ఏ పదిమందికైనా భోజనం పెట్టవచ్చు
స్వామి పై అచంచలమైన భక్తి విశ్వాసాలు కలిగి వుండి పురశ్చరణ విధానాన్ని అనుసరించలేని వారికి కూడా ఒక మార్గం శాస్త్రంలో చెప్పబడింది.
తగినంత శక్తి లేక పంచాంగ పూర్వకంగా పురశ్చరణ చేయలేని వారు అచంచలమైన భక్తితో స్వామిని మనసులో “స్వామి నేను పురశ్చర్యను శాస్త్రోక్త పద్ధతిలో ఆచరించటానికి అశక్తుడను, దయచేసి నాకు మంత్ర జపంతోనే మంత్రసిద్ధిని ప్రసాదించు” అని వేడుకుని జపాన్ని చేస్తే కేవలం జపంతోనే పూర్తి పురశ్చరణ ఫలం లభిస్తుంది. గుర్తుంచుకోండి ఇది కేవలం శక్తిలేని వారికి మాత్రమే. అవకాశం వుండీ, శక్తివున్న సాధకులు పంచాంగ పూర్వకంగానే పురశ్చరణ చేయాలి. తన మంత్రము యొక్క అధిష్టాన దేవత సాక్షాత్కరించి కోరినకోర్కె వరంగా ఇవ్వటము పూర్ణసిద్ధి. ఒక మంత్రము యొక్క పురశ్చరణ పూర్తి చేస్తే మంత్రాధికారం వస్తుంది.
పురశ్చరణ నియమాలు :
1) ఏక భుక్తము- ఒంటిపూట భోజనం చేయాలి.
2) భూశయనం – నేల పై పడుకోవాలి.
3 బ్రహ్మచర్యము – రతిక్రీడ, శృంగారభాషణలు కామ వ్యవహారములు పనికిరావు.
4) నఖకేశ ఖండనము – గోళ్ళు కత్తిరించుట, క్షవరము, చేయరాదు. గడ్డము గీయరాదు.
5) దీక్షాభంగకరమైన పనులేవీ తలపెట్టరాదు.
ఇక జపము భోజనానంతరము మూడు గంటలు విడిచిపెట్టి ఎప్పుడైనా చేయవచ్చు. పగలు, రాత్రి అనే నిబంధన లేదు. భోజనము చేయక అల్పాహారము మాత్రమే తీసుకొనే వారికి సమయ నియమము లేదు. ఈ విధంగా దీక్ష చేసిన సాధకునకు మంత్రాధికారం వస్తుంది.
మంత్ర జపం చేసుకునేటప్పడు ఇలా సంకల్పం చెప్పుకోండి
మమోపాత్త దురితక్షయద్వారా శ్రీపరమేశ్వర ప్రీత్యర్ధే శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణో రాజ్ఞయా, ప్రవర్తమానస్య, ఆద్యబ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే ప్రథమపాదే జంబూ ద్వీపే భరతవర్షే భరతఖండే, మేరోర్దక్షిణ దిగ్భాగే, శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశ్, కృష్ణా గోదావరి మధ్యప్రదేశ్, శోభనగృహే, సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర సన్నిధౌ, అస్మిన్ వర్తమాన వ్యవహారికచాంద్రమానేన, శుభసంవత్సరే, దక్షిణాయి (లేక ఉత్తరాయణే) శుభఋతౌ శుభనక్షత్రే, శుభయోగే శుభకరణే, ఏవంగుణ విశేషణ విశిష్టా యాం శుభతిధౌ శుభమాసే మీ గోత్రం పేరు పేరు చెప్పి నామధేయస్య ధర్మపత్నీ సహిత సహ కుటుంబానాం క్షేమస్థైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య విద్యా ఉద్యోగ ఐశ్వర్యాభి వృద్ధ్యర్థం, ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థసిద్ధ్యర్థం పుత్ర పౌత్రాభి వృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం, సమస్త సన్మంగళ ఫలవ్యాప్తర్థం, యధాజ్ఞానం యదామిలితోప చారై దైవకృత భూతకృత బంధుకృత మిత్రకృత శతృకృత ఆపాదిత అముకనామధేయ ప్రయోగతంతుగ్రహ జ్వరరోగాది సర్వబాధా నివృత్యర్థం, నాగదోష నాగపాశ శృంఖలా బంధ విమోచనార్థం, కారాగృహ బంధన, రాజదండనాది సర్వభయ నివృత్యర్థం, నాగపాశ అనంత వాసుకి తక్షక కర్కోటక కాళీయ రాత్రించర ఖైదివాచరాది సర్వవిష సర్పబాధా నివృత్యర్థం, భూత ప్రేత పిశాచ శాకినీ ఢాకినీ కామినీ మోహినీ నాగినీ బ్రహ్మరాక్షసాది సర్వదుష్టగ్రహ బాధా నివృత్యర్థం, సర్వదుష్ట స్త్రీ పురుష జనముఖ స్తంభన, పరమంత్ర పరయంత్ర పరతంత్ర పరకట్టు పరవాటు పరవేటుపరజప హోమాది సర్వబాధా నివృత్యర్థం, మమ శతృసంహారణార్ధం, శతృవశీకరనార్థం, జన్మరాశి వశాత్ నామరాశి వశాత్ శరీరే వర్తమాన వర్తిష్యమాణ నవానాం గ్రహాణాం, మధ్యయే యేగ్రహాం, అరిష్టస్థానేషు స్థితాః తేషాం గ్రహాణాం అత్యంత అనుకూల ఫల సిద్ధ్యర్ధం, యేయే గ్రహాధి శుభస్థానేషు స్థితాః తేషాం గ్రహాణాం అత్యంత శుభ ఫలా వ్యాప్త్యర్థం అపమృత్యుపరిహార ద్వారా ఆయుష్యాభివృద్ధ్యర్థం, ఆదిత్యాది నవగ్రహ దేవతా ప్రీత్యర్థం, సర్వదేవతా ముద్దిస్య దేవతా ప్రీత్యర్థం…(ఏ దేవత జపం చేసిన ఆ దేవత పేరు) మంత్రజపే వినియోగః
సర్వశక్తిమంత సర్వాభీష్ట సిద్ధికర శ్రీలక్ష్మీ వేంకటేశ్వర మాలా మంత్రము:
ఓం హ్రీం హ్రీం శ్రీం శ్రీం క్లీం క్లీం ఓం నమోభగవతే శ్రీలక్ష్మీవేంకటేశాయ.
మహావిష్ణవే పద్మావతీ సమేతాయ సర్వారిష్ట నివారణాయ
సర్వాభీష్ట సిద్ధిదాయ సర్వా ధారాయ సర్వశక్తియుతాయుతే మమాభీష్టం కురు కురు |
శరణాగతవత్సల వివిధ దారిద్య్ర నిర్మూలనాయ సర్వైశ్వర్య ప్రదాయ సకలదురితార్తి భంజనాయ |
మమ ధన కనక వస్తు వాహనాద్యఖిల ఐశ్వర్యం దాపయ దాపయ |
సర్వకార్యాణి సాధయ సాధయ సుఖమారోగ్యం విజయం దేహి దేహి హ్రీం హుం ఫట్స్వాహా||
ఓంనమో భగవతే శ్రీలక్ష్మీ వేంకటేశాయ పరమంత్ర పరయంత్ర పరతంత్ర పరకట్టు
పరవాటు పరవేటు పరజప పరతప పరహోమ ఔషదాస్త్ర శస్త్రాణి సంహర సంహర మృత్యోర్ మోచయ మోచయ |
ఓం నమో భగవతే లక్ష్మీ వేంకటేశాయ నిత్యముక్తి ప్రదాయ ఏకాహిక ద్వ్యాహిక త్యాహిక
చాతుర్ధిక జ్వర పక్షజ్వర మాసజ్వర త్రైమాసికజ్వరాదిగ సర్వ జ్వరాన్ సర్వవ్యాధీన్ న్నాశయ న్నాశయ సర్వరోగాన్ నాశయనాశయ వాత రోగ ప్రణరోగ కాసరోగ పైత్యరోగ శ్లేష్మరోగాది సర్వరోగాన్ హర హర |
నానావిధ సర్పవృశ్చిక స్థావర విష కృత్రిమవిష దేహజాతవిష సర్వవిషాన్ హర హర శమయ శమయ
ప్రారబ్ధ సంచిత క్రియాన్ నాశయ నాశయ ||
ఓం నమోభగవతే శ్రీలక్ష్మీ వేంకటేశాయ ఏహ్యేహి |
ఆగచ్ఛ ఆగచ్ఛ | మమ హృదయకమలే ఆవాహితోభవ| స్థాపితోభవ| సుముఖోభవ |
సుస్థిరోభవ సర్వతోముఖ శ్రీలక్ష్మీ వేంకటేశాయ హుం ఫట్ స్వాహా|
ఓం నమోభగవతే శ్రీలక్ష్మీ వేంకటేశాయ వరదోభవ క్షిప్ర ప్రసన్నోభవ చింతిత
ఫలప్రదోభవ సర్వదా సర్వ మంగళ ప్రదోభవ|
మమ కాయక వాచిక మానసిక సిద్ధిం దేహి దేహి హుం హుం హుం ఆం హ్రీం వం ఊం క్రోం
అమృత లక్ష్మీ వేంకటేశాయ అమృతశరీరాయ అమృతం కురుకురు |
అత్యంత లక్ష్మీ సారస్వత నిదానం కురు కురు మమ కరస్పర్శాత్
నానారోగ భూత ప్రేత పిశాచ శాకినీ ఢాకినీ కామినీ మోహినీ నాగినీ బ్రహ్మరాక్షస క్షుద్ర పిశాచాద్యనేక భూతపలాయనం కురు కురు |
స్మరణమాత్రేణ సకలవిధ దారిద్ర్య విద్రావణం కురు కురు చతుష్షష్టి కళావిద్యా ప్రవీణం కురు కురు | హృదయ చింతిత మనోరధ సిద్ధిం కురు కురు ॥
ఆం హ్రీం ఐం గ్లాం సౌః క్లీం శ్రీం హ్రీం క్రోం సద్యస్సకల విద్యాప్రద శ్రీలక్ష్మీ వేంకటేశాయ హుంఫట్ స్వాహా|