భక్తి & ఆధ్యాత్మికం
దేవునికి సమర్పించే నైవేద్యం – సిద్ధించే ఫలితం
Offering Fruits to God: పెద్దలను, వృద్ధులను, స్వాములను, గురువులను, నూతన శిశువులను, కొత్త దంపతులను, గర్భిణులను పలకరించడానికి వెళ్లేటప్పుడు; పిల్లలున్న ఇంటికి, దేవాలయాలకు వట్టి చేతులతో వెళ్లకూడదంటారు. ఆయా చోట్లకు వెళ్లేటప్పుడు తమ స్తోమతకు తగ్గట్టుగా ఏదో ఒక పువ్వులో, పండ్లో తీసుకెళ్లాలన్నది నియమం. దేవాలయంలోకి ఖాళీ చేతులతో వెళ్లినట్టయితే మన పనులుకూడా అసంతృప్తిగానే ఉంటాయి. అంటే, పనులేవీ పూర్తి కావు. అందుకే పండు, కొబ్బరికాయ, పూలు తదితర పూజా సామగ్రిని తీసుకెళ్లి పూజ చేయిస్తే మన మనస్సుకుకూడా సంతోషం కలుగుతుంది. ఏ పండును తీసుకుని వెళ్లి నైవేద్యం చేయిస్తే, ఏ ఫలితం ఉంటుందో చూద్దాం.
- అరటి పండు : ఇష్ట కార్య సిద్ధి
- చిన్న అరటి : నిలిచిపోయిన పనులు ముందుకు సాగుతాయి, త్వరగా పనులు పూర్తవుతాయి.
- అరటి గుజ్జు : ఋణ విముక్తి. రావలసిన సొమ్ము, నష్టపోయిన డబ్బు తిరిగి వస్తాయి. ప్రభుత్వానికి అధికంగా కట్టిన పన్ను డబ్బుసైతం తిరిగి వస్తుంది. పెళ్లి తదితర శుభకార్యాలకు సకాలంలో నగదు అందుతుంది. హఠాత్తుగా నగదు మంజూరవుతుంది.
- కొబ్బరి కాయ : పనులు సులభసాధ్యం. అనుకున్న రీతిలోనే పనులు నెరవేరతాయి. పై అధికారుల నుంచి ఎటువంటి ‘సమస్యలు రావు. స్నేహపూర్వకంగానే పనులు జరిగిపోతాయి.
సపోటా పండు: వివాహాది శుభకార్యాల విషయంలో ఎదురయ్యే చికాకులు తొలగిపోతాయి. సంబంధాలు ఖాయమవుతాయి. - కమలా ఫలం : చిరకాలంగా నిలిచిన పనులు నెరవేరతాయి. నమ్మకమైన వ్యక్తులు సాయపడతారు.
- మామిడి పండు: ప్రభుత్వం నుంచి రావలసిన నగదు ఎటువంటి సమస్యలు లేకుండా వస్తుంది.
- గణపతికి మామిడిపండు సమర్పిస్తే గృహ నిర్మాణ సమస్యలు తీరిపోతాయి. బకాయిలు చెల్లించడానికి కావలసిన సొమ్ము సకాలంలో వచ్చి చేరుతుంది.
- గణపతి హోమం చేయించి మామిడి పండును పూర్ణాహుతి చేస్తే చిట్టీల వ్యవహారాలు చక్కబడతాయి.
- ఇష్టదైవానికి తేనె, మామిడి రసాలతో నైవేద్యం సమర్పించి దానిని అందరికీ పంచి, మీరుకూడా సేవించినట్టయితే మిమ్మల్ని ఎవరూ మోసం చేయలేరు.
- ఇష్ట దైవానికి మామిడి పండు, అంజూర పండ్లను నైవేద్యం సమర్పించి, దానిని రజస్వలకాని ఆడపిల్లలకు తినిపించినట్టయితే, త్వరగా రజస్వల అవుతారు, సమస్యలు రావు.
- నేరేడు పండు : నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే నీరసం, నిస్సత్తువ తగ్గుముఖం పడతాయి.
- శనీశ్వరుడి ప్రసాదంగా స్వీకరిస్తే వెన్ను నొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు నయం అవుతాయి.
- బిచ్చగాళ్లకు దానం చేస్తే దరిద్రం దరిచేరదు. పనులు నిరాటంకంగా సాగుతాయి.
- భోజనంతోపాటు నేరేడు పండును వడ్డిస్తే అన్నపానీయాలకు లోటు ఉండదు.
- రోజూ నేరేడు పండును తింటే ఆరోగ్య సమస్యలుండవు.
- పనస పండు : శత్రు జయం కలుగుతుంది. రోగ నివారణతోపాటు కష్టాలు కూడా తొలగిపోతాయి.
- యాపిల్ పండు : సకల రోగాలు,కష్టాలు,దారిద్య్ర బాధలు తొలగిపోతాయి. సంఘంలో గౌరవం లభిస్తుంది
- అంజూర పండు : అనారోగ్య సమస్యలు తీరతాయి. స్వల్ప రక్తపోటు ఉన్నవారికి మంచిది. కాళ్ల నొప్పులు తగ్గుతాయి. రోగ నివారక సంకల్పాన్ని చెప్పుకొని సుమంగళిలకు తాంబూలంలో అంజూర పండు ఇస్తే మరీ మంచిది. సంకల్పం ఎవరి పేరున చెబుతామో వారు తినకూడదు. గణపతికి నైవేద్యంగా పెడితే మరింత మంచి ఆరోగ్య ఫలితాలు పొందగలరు.
- జామ పండు : సమాజంలో పలుకుబడి పెరుగుతుంది.
- గణపతికి నైవేద్యంగా పెడితే గ్యాస్టిక్, ఉదర సంబంధిత వ్యాధులు నయం అవుతాయి.
- దేవీ నైవేద్యంగా పంచితే చక్కెర వ్యాధినుంచి ఉపశమనం, సంతాన ప్రాప్తి. దాంపత్య కలహాలు తొలగుతాయి.
- పెళ్లికాని యువతులతో ముత్తయిదువలకు పంచితే వివాహ ఆటంకాలు సమసిపోతాయి.
- జామ పండ్లు, కమలా పండ్ల రసంతో రుద్రాభిషేకం చేస్తే పనులు చురుగ్గా సాగుతాయి.
- గణపతికి పంచామృత అభిషేకం చేసి, జామపండ్లను నైవేద్యంగా పెడితే వ్యాపారం లాభసాటిగా సాగుతుంది.
- ద్రాక్ష పండు: దానం చేస్తే పక్షవాత రోగాలు త్వరగా నయమవుతాయి, దేవుని ప్రసాదంగా పంచితే సుఖ సంతోషాలు కలుగుతాయి.