భక్తి & ఆధ్యాత్మికం

మీ కోరికలు నెరవేరడానికి, ప్రతి రోజు 3 సార్లు ఈ మంత్రాన్ని జపించండి:

సర్వ కార్యసిద్ది కోసం, ఒక వ్యక్తి మంచివాడా, చెడ్డవాడా అని తెలుసుకోవడం కోసం ఈ వారాహి దేవి మంత్రం జపం చేయండి :

స్వప్న వారాహి మంత్రం:

“ఓం హ్రీం నమో వారాహి ఘోరే స్వప్నం ఠ: ఠ: స్వాహా”

వారాహీ దేవి కాశీ క్షేత్రపు గ్రామ దేవత అమ్మవారు. పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుడ్ని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి.ఆ వరాహమూర్తి స్త్రీతత్వమే వారాహీదేవీ. వారాహీ రూపం వరాహమూర్తిని పోలివుంటుంది.నల్లని మేఘవర్ణ శరీర ఛాయ. వరాహ ముఖం తో ఎనిమిది చేతులతో అభయ వరద హస్తాలతో శంఖం చక్రం పాశం హలం వంటి ఆయుధాలు ధరించి ఉంటుంది.గుర్రం సింహం పాము దున్నపోతు వంటి వివిధ వాహనాలమీద సంచరిస్తుంది.తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహీ మాత. అందుకే ఈ శక్తిమాతను రాత్రివేళల్లో పూజిస్తుంటారు.

వారాహి జయంతి మాఘమాస శుక్లపక్ష ద్వాదశి తిథి. యజ్ఞవరాహ రూపంగా భూమిని ఉద్ధరించిన దైవీ శక్తికి ప్రతీక గనుక భూమినే ఆధారం చేసుకుని జీవిస్తున్న వారందరికీ ఆరాధ్యమైన దేవత శ్రీ వారాహీ దేవి. ఇచ్చాశక్తి.. జ్ఞానశక్తి .. క్రియాశక్తిని అనుగ్రహించే పరమోతృష్ట దైవం. ఈ శక్తికి సంబంధించిన మంత్రాల‌కు గురూపదేశం ఉండాలి. స్వప్న వారాహి దేవి మంత్రం సాధకుని ప్రశ్నలకు జవాబులు కోసం ఈ మంత్రాన్ని జపిస్తే ఏ మంత్రమైనా తొందరగా సిద్ధిస్తుంది.

అలాగే స్వప్న వారాహి మంత్రం చేస్తే కలలో దేవి కనిపించి సాధకుని ప్రశ్నలకు జవాబిస్తుంది. భవిష్యత్తును గూర్చి చెపుతుంది. సమస్య ఏదైనా దాని పరిష్కారం స్వప్నంలో పొందుతారు. చిన్న పిల్లలకు ఈ మంత్రం తో విబూది పెడితే పీడ కలలు రావు. ఈ మంత్రాన్ని 108 నుండి 1008 సార్లు పఠిస్తే అనుకొన్న కార్యం ఫలిస్తుంది. ఉపాసన చేసేవారు మాత్రం కోటి జపాన్ని 6 మాసాలలో చేయగలిగితే సాధకునికి అమ్మవారు ప్రత్యక్షం అవుతారు.

ఉపదేశం లేని వారు ఒక కాగితం మీద వారాహి మంత్రాన్ని వ్రాసుకుని దేవత ఫోటో ఫ్రేమ్ ముందు పెట్టి అమ్మవారిని గురువుగా భావించి మంత్ర జపం చేసుకోండి. కాల ప్రభావం చేత సద్గురువును పొందడం ఈ రోజుల్లో అందరికి సాధ్యం అయ్యే పనికాదు. సాధకులకు సహాయం చేసేవారికంటే..భయ బ్రాంతులకు గురిచేసే అజ్ఞాన గురువులే సమాజంలో ఉన్నారు. జన్మ జన్మల తపశ్శక్తి ఉంటేనే సద్గురువును ఈ జన్మలో పొందగలం.

నియమాలు: సాయంత్రం సంధ్యా కాలం తర్వాత కానీ చీకటి అయ్యాక కానీ స్నానం చేసి వినాయకుడికి నమస్కారం చేసి మీకు ఉన్న సమస్య ఏంటో వారాహి మాతను తలుచుకుని సంకల్పమ్ చెప్పుకుని జపం మొదలు పెట్టాలి.. వీలైతే దానిమ్మ గింజలు,బెల్లం పానకం, పులిహోర నివేదన చేయండి. పూజ గది లోనే కాదు మీరు శుభ్రంగా ఉండి శుభ్రంగా ఉన్న ప్రాంతంలో ఎక్కడైనా కూర్చుని చేయవచ్చు నిద్ర పోయే పడకల పైన కూర్చుని చేయకూడదు.

శ్రీ వారాహి దేవి మూల మంత్రం

ఓం ఐం హ్రీమ్ శ్రీమ్
ఐం గ్లౌం ఐం
నమో భగవతీ
వార్తాళి వార్తాళి
వారాహి వారాహి
వరాహముఖి వరాహముఖి
అన్ధే అన్ధిని నమః
రున్ధే రున్ధిని నమః
జమ్భే జమ్భిని నమః
మోహే మోహిని నమః
స్తంభే స్తంబిని నమః
సర్వదుష్ట ప్రదుష్టానాం సర్వేశామ్
సర్వ వాక్ సిద్ధ సక్చుర్
ముఖగతి జిహ్వా
స్తంభనం కురు కురు
శీఘ్రం వశ్యం కురు కురు
ఐం గ్లౌం
ఠః ఠః ఠః ఠః
హుం అస్త్రాయ ఫట్ స్వాహా ||

ఇతి శ్రీ వారాహి దేవి మూల మంత్రం ||

వారాహి మూల మంత్రం ప్రతి రోజు 3 లేక 21 లేక 108 సార్లు, 48 రోజుల పటు జపించినచో మీ జాతకం లోని కాలసర్ప దోషం లేక ఎలాంటి దోషాలైనా దూరమవుతాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button