భక్తి & ఆధ్యాత్మికం

అలయంలో చేయకుడని పనులు ఏమిటో తెలుసా..???

ఆలయంలో ఏం చేయకూడదు?

Temple Rules : మనలో దాదాపు అందరం ఏదో సందర్భంగా ఆలయానికి వెళతాం. దైవానికి నమస్కరిస్తాం. తోచిన రీతిలో పూజలు చేస్తాం. నిజానికి ఆలయంలో అడుగుపెట్టిన క్షణం నుంచీ మన మనసులో అనేక సందేహాలు మొదలవుతాయి. ఆలయంలో ఎలా మసలుకోవాలి. ఆ పరమాత్మను ఎలా పూజించాలి. ప్రదక్షిణ ఎలా చేయాలి….. ఇలాంటి ఆలోచనలు మనల్ని చుట్టు ముడతాయి. ఈ సందేహాలకు | వరాహపురాణంలో పరిష్కారం సూచించారు. ఆ పురాణం ఆధారంగా దేవాలయంలో చేయకూడని పనులు ఏమిటో చూద్దాం. • గుడిలోకి వెళ్లేటప్పుడు చెప్పులను వేసుకోవడం.

• ఒక చేతితో నమస్కరించడం.

• గుడిలోకి వెళ్ళి దైవ దర్శనం చేసుకున్నాక భగవంతునికి వందనం చేయకుండా ఉండడం.

• దైవ దర్శనం అయినాక కాసేపు గుడిలో కూర్చుంటాం. అలా కూర్చునేటప్పుడు భగవంతునికి ఎదురుగా కాళ్ళు చాపడం, వీపును భగవంతుని వైపు పెట్టడం.

ఆలయంలో నిద్ర చేయాల్సి వస్తే భగవంతునికి ఎదురుగా పడుకోవడం. ఆలయ మంటపంలో భోజనం చేయడం.

• ఆలయంలోను, ఆలయప్రాంగణంలోను గట్టిగా మాట్లాడడం, అరవడం. ఆలయ ప్రాంగణంలో ఏడ్వడం, దెబ్బలాడడం

• ఉపకారం చేస్తానని ప్రతిజ్ఞ చేయడం.

• నిన్నేం చేస్తానో చూడు అని బెదిరించడం.

• స్త్రీలతో పరిహాసంగా మాట్లాడడం.

• కంబళి, శాలువ లాంటి వాటితో శరీరమంతా కప్పు కొని దైవ దర్శనానికి వెళ్లడం.

• ఇతరులను నిందించడం, ఎవరినైనా పొగడడం.

• ఆరగింపు కాని పదార్థాలను ఆలయంలో తినడం.

• తోటలోనైనా, ఇంట్లోనైనా పండిన పండ్లను, పూచిన పూలను, కూరలను భగవంతునికి సమర్పించంకుడా ముందుగా తాను ఉపయోగించడం.

• ఉపయోగించిన పుష్పాలను దైవానికి సమర్పించడం.

• భగవంతుని వైపు వీపు ఉంచి కూర్చోవడం.

• ఆలయ ప్రాంగణంలోనైతే ఫరవాలేదు. కానీ దైవం ముందు ఇతరులకు నమస్కరించుట.

• ఆలయంలో తనను తాను పొగడుకోవడం.

• భగవంతుని నిందించుట.

• గట్టిగా గంట మోగించడం.

• దేవాలయాలలోకి ప్రవేశించే ముందు ఎల్లప్పుడూ స్నానం చేయండి.

• సంభోగం తర్వాత స్నానం చేయకుండా దేవాలయాలలోకి ప్రవేశించవద్దు

• రుతుక్రమం సమయాల్లో మనం దేవాలయాల్లోకి ప్రవేశించవద్దు.

ఆలయంలో ఇలాంటి పనులు చేస్తే భగవంతుని సేవించిన పుణ్యం దక్కకపోవడమే కాదు. మిక్కిలి పాపం చేసినట్లు అవుతుందని వరాహపురాణం చెబుతున్నది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button