భక్తి & ఆధ్యాత్మికం

మీరు ఈ నియమాలు పాటిస్తున్నారా ??

Things every Hindu should follow | హిందువు గా పుట్టిన ప్రతి ఒక్కరు పాటించాల్సిన నియమాలు – Part01

  • తల్లిదండ్రులను పూజించాలి. ఏ స్థితిలోనూ దూషించరాదు.
  • భోజనం తూర్పు, ఉత్తర దిక్కులవైపు కూర్చొని చేయాలి.
  • బట్టలు ధరించకుండా నదులలో స్నానం చేయరాదు.
  • మలమూత్ర విసర్జన ఉత్తర, దక్షిణ దిశలుగా మాత్రమే చేయాలి.
  • నడుస్తూ కాని, నిలబడి కాని మలమూత్రాదులు విడువరాదు.
  • దేవాలయాల్లోనూ, గోశాలలోను మలమూత్రాదులు విడువరాదు.
  • మంత్రోపదేశం చేసినవారు మాత్రమే గురువు. (తక్కిన విద్యలు నేర్పినవారు అధ్యాపకులు మాత్రమే) అట్టి గురువును ఏ పరిస్థితిలోనూ నిందించరాదు. ఆయన ఎదురుగా కాళ్ళుచూపి కూర్చోరాదు.
  • ఇంటికి గురువు వస్తే టక్కున లేచి నిలబడి ఎదురుగావెళ్ళి లోపలికి గౌరవంగా తీసుకొని వచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టకుండా మాట్లాడరాదు. సాగనంపేటపుడు బయటకు వచ్చి గురువుని కొంచెం దూరం అనుసరించాలి.
  • భుజాలమీదుగా వస్త్రం లేకుండా దైవపూజ చేయరాదు, భోజనం చేయకూడదు.
  • గురుపాపం ఎవరికీ చెప్పరాదు. గురువునకు కోపం వస్తే తక్షణం ప్రసన్నం చేసుకోవాలి.
  • గురువు కోరితే ఏదైనా ఇమ్మని శాస్త్ర వచనం. అటువంటి గురువును ఏ పరిస్థితిలోను అసహ్యించుకొనరాదు. 10వేల యజ్ఞాల ఫలితం కూడా ఈ ఒక్క కార్యంతో నశించిపోతుంది. కనుక గురుధిక్కారం పనికిరాదు.
  • చతుర్దశి, అష్టమి దినాలలో తలంటు పనికిరాదు. స్త్రీ సంగమం పనికిరాదు.
  • రెండు చేతులతో ఎప్పుడూ తల గోక్కోరాదు.
  • ఇతరుల చెప్పులు, వస్త్రాలు ధరించకూడదు.
  • పిసినిగొట్టుతో, శత్రువుతో, అసత్యం పలికే వాడితో భర్తను తిట్టే స్త్రీతో కలిసి భోజనం చేయటం మహాపాపం.
  • నోటితో అగ్నిని ఆర్పరాదు, ఊదరాదు.
  • సంధ్యా సమయంలో నిద్ర, తిండి, మైధునం పనికిరాదు.  
  • ప్రయాణం మధ్యలో భోజనాదులకు నియమంలేదు.
  • స్నానం చేయకుండా అన్నం వండరాదు. ఆ అన్నం తినరాదు.
  • తడిసిన బట్టల నీళ్ళు ఇతరులపై పడేట్లు విదిలించరాదు.
  • పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు. అటువంటి వారిని నిందించరాదు.
  • తూర్పు, దక్షిణ దిక్కుల తల పెట్టి నిద్రపోవాలి, ఉత్తర, పశ్చిమాల వైపు తల పెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలౌతారని మార్కండేయ పురాణం చెబుతుంది.
  • అన్నము తిన్నాక కంచంలో చేయి కడుక్కోరాదు. చేయి కడిగిన తరువాత ఆ చేతిని విదల్చరాదు.
  • పుణ్య కార్యాల్లో చోళ్ళు, జొన్నలు, వెల్లుల్లి, ఉల్లి, చద్ది పదార్థాలు తినరాదు, ఉపయోగించరాదు.
  • తెలిసినవారి మరణ వార్త విన్న వెంటనే గాని, పురిటి వార్త విన్న వెంటనే గాని కట్టుబట్టలతో స్నానం చేయాలి.
  • నిలబడికాని, అటూఇటూ తిరుగుతూ కాని అన్నం తినటం వల్ల క్రమంగా దరిద్రుడౌతాడు. రాబోయే జన్మలో బిచ్చగాడు అవుతాడు.
  • ఎట్టి పరిస్థితులలోను ఆత్మహత్య చేసుకోరాదు. అలా చేసుకున్నవారు కొన్ని వేల జన్మలు పిశాచ జన్మలెత్తి వికలాంగులై పుడతారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button