భక్తి & ఆధ్యాత్మికం
మీరు ఈ తప్పులు చేస్తున్నారా???
Things every Hindu should follow | హిందువు గా పుట్టిన ప్రతి ఒక్కరు పాటించాల్సిన నియమాలు – Part04
- భోజనానికి ముందు, అనంతరం కూడా కాళ్ళు కడుక్కోవాలి.
- గృహప్రవేశ కాలంలో గాని, ఏడాదిలోపు గాని ఆ ఇంట మణిద్వీప పరాయణం చేయడం మంచిది. ఇది వాస్తుదోషాలను పరిహరిస్తుంది.
- సకల పురాణేతిహాస కోవిదుడు కాని వాని వద్ద మంత్రోపదేశం పొందరాదు.
- ఎక్కువ వేడిగా, ఎక్కువ చల్లగా ఉండే పదార్థాలు స్వీకరించరాదు.
- భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరవేయకుండా వాటితో దైవపూజ చేయరాదు.
- దీపారాధనకు అగ్గిపెట్టె వాడకూడదని ఏ శాస్త్రాలు చెప్పలేదు. కనుక అగ్గిపెట్టెతో దీపం వెలిగించుకోవచ్చు.
- పుట్టిన రోజునాడు దీపాలు కానీ, కొవ్వొత్తులు కానీ ఆర్పరాదు. నోటితో అగ్నిని ఊదుట ఘోరపాపం. అటువంటివారు గ్రహణపు మొర్రితో మళ్ళీ జన్మమెత్తి దుఃఖాలు పొందుతారు.
- దిగంబరంగా నిద్రపోరాదు.
- విజయదశమి, శివరాత్రి దినాలలో మాంసాహారం, ఉల్లి పనికిరాదు.
- క్రూరుడు, దుష్టుడు కాని మగనితో తాళికట్టించుకొన్న భార్య, కాపురం చేయక ఏడిపించటం, చెప్పిన మాట వినకపోవటం, తాళి తీసి భర్త చేతిలో పెట్టడం చేయరాదు. ఇలా చేసిన స్త్రీలకి వంద జన్మలలో వైధవ్యం కానీ, అసలు పెళ్లి కాకపోవడం జరుగుతుంది.
- శుక్ర, శనివారం వంటి వార నియమాలు పెట్టుకున్నవారు హోటలు టిఫిన్లు తినుటగానీ, ఆనాటి అల్పహారాదులలో ఉల్లి వాడుట కాని నిషేదము. ఇది ప్రయాణ మధ్యంలో ఉన్న వారికి వర్తించదు.
- దీపాలు పెట్టేవేళ తలదువ్వుకోరాదు. ఇలా చేసిన స్త్రీలకి వందల జన్మలలో వైధవ్యం కాని, అసలు పెళ్లి జరగకపోవడం వంటివి జరుగుతాయి.
- దీపారాధనకు ఒక కుంది మాత్రమే వాడినపుడు మూడు వత్తులు వేయాలి.
- తలకి నూనె రాసుకొని ఆ చేతులతో పాదాలకు ఆ నూనెజిడ్డు పులమరాదు.
- కలియుగంలో ఆలయంలో జంతువధ నిషేధం.
- మాడిన అన్నం, అడుగంటిన పాయసం, కంపు వచ్చే నేయి ఇటువంటివి నైవేద్యానికి పనికిరావు.
- కొబ్బరికాయ కొట్టాక వెనుకవైపు పీచు తీయాలనే నియమం కూడా తప్పనిసరి కాదు. శుభ్రత కోసం పీచు తీయవచ్చు, తీయకపోతే దోషం లేదు.
- శవాన్ని స్మశానం దాకా మోసినా, శవాన్ని ఇంటి దగ్గర ఉండటానికి అనుమతినిచ్చినా నరకానికి పోకుండా స్వర్గానికి పోతాము.
- ఆలయ ప్రాంగణంలో అర్చకునిపై కేకలు వేయరాదు. అర్చకునిలో దోషం ఉంటే బయటకు పిలిచి మందలించాలి, లేదా మరింత దుష్టుడైన అర్చకునినైతే మూడు మాసాల జీతమిచ్చి ఆ పదవినుంచి తొలగించి వేయాలి.
- చీటికి, మాటికి యజ్ఞోపవీతం తీసి పక్కనపెట్టడం, తాళి తీసేస్తుండటం రెండూ భయంకర దోషాలే..
- ఆహారం తినే ముందు దైవానికి నివేదన చేయాలి! కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి రాకూడదు.
- మలవిసర్జన, మూత్రవిసర్జన తరువాత కాళ్ళు చేతులు ముఖం శుబ్రంగా కడుక్కొని, ఓం నారాయణాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం మాధవాయ నమః అంటూ తలపై 3సార్లు నీళ్ళు చల్లుకొని ఇంట్లోకి రావాలి.
- కొబ్బరికాయను నీళ్ళతో కడిగి కొట్టడం చాలా తప్పు, కొబ్బరికాయను పీచు ఒలిచివేశాక నీళ్ళతో కడగరాదు.
- ఆచమనం చేసిన నీటిని దైవనివేదనలకు, అర్చనలకు వాడరాదు, కనుక వేరొక పాత్రలో శుద్ధ జలాన్ని ఈ కార్యాలకు వినియోగించుకోడానికి తెచ్చుకోవాలి.
- కాలకృత్యముల తరువాత స్నానం చేయకుండా వంట చేయకూడదు.
- దైవానికి నివేదన చేయకుండా ఆహారం తీసుకోకూడదు. నిలబడి భోజనం చేయకూడదు. వంటి మీద చొక్కా వేసుకుని భోజనం చేయకూడదు.
- భుజం మీద తువాలు లేకుండా ఆహారం తీసుకోకూడదు. పూజ చేయకూడదు. కనీసం జేబు రుమాలు అయినా భుజం మీద వేసుకుని చేయాలి. ఎవరైనా ఇంటికి వస్తే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి. లేదా పంపులు ఉంటాయి కదా కనీసం చూపించండి. కడుక్కొని లోపలికి వస్తారు. రాగానే నీళ్ళు తాగుతారా అని పొరపాటున కూడా అడగకూడదు. రాగానే మంచి నీళ్ళు తీసుకెళ్ళి ఇవ్వాలి. భోజన సమయానికి ఎవరైనా అతిధి వస్తే భోజనం పెట్టాలి. అంతేకాని ఎంగిలి చేతితో మీరే గుమ్మం దగ్గరికి వెళ్లి ఎక్కడ లోపలికి వస్తాడేమో అని అక్కడే మాట్లాడి పంపకూడదు. మనసులో ఒకమాట పైకి ఒకమాట మాట్లాడకూడదు. (భోజనం చేస్తారా అని పైకి మాట్లాడి, లోపల! భోజనాల సమయానికి వచ్చి చచ్చాడు. ఇలా మాట్లాడకూడదు.) ఏది మనసులో వుందో అదే మాట్లాడాలి.
- నిత్య దీపారాధన చేయాలి. ఇలాంటి ఇల్లు లక్ష్మితో కళకళలాడుతుంది.
- మూత్ర విసర్జన నిలబడి చేయకూడదు. ముత్ర విసర్జన తరువాత కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రావాలి.
- త్రిసంధ్యలలో నిద్రించకూడదు. ఆహారం తీసుకోకూడదు. ప్రయాణం చేయకూడదు. (ఉదయం 5:00 నుండి 5:45, మధ్యాహ్నం 12 నుండి 12:45, సాయంత్రం 5 నుండి :5:45 వరకు త్రిసంధ్యలు అంటారు) ఉదయించే సూర్యుడిని దంత ధావనం (పళ్ళు తోమడం) చేయకుండా, చేస్తూ చూడకూడదు.(సూర్యోదయం కాకముందే లేచి దంతధావనం చేయాలి అని అర్ధం) తూర్పు పడమర నిలబడి పళ్ళు దంతధావనం చేయకూడదు. తిట్టుకుంటూ, ఏదో ఆలోచనలు చేస్తూ వంట చేయకూడదు.
- మీరు చేసే ఆలోచనలు అన్ని ఆభోజనంలోకి చేరి ఇంట్లో వారిపై ప్రభావం చూపిస్తాయి. తలపై చేతులు పెట్టకూడదు. తలపై మునివేళ్ళతో గోకకుడదు. రుద్దకూడదు. దీనివలన పతనావస్తకి చేరుకుంటారు. ఎడమ చేతితో పొరబాటున కూడా తినకూడదు, త్రాగ కూడదు.