వినోదం

Jailer Movie Review : రజినీకాంత్ ‘జైలర్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Jailer Movie Review : జైలర్ మూవీ రివ్యూ .. జైలర్ సినిమా టాక్ గురించి సోషల్ మీడియాలో విపరీతంగా బజ్ ఏర్పడింది. నిజానికి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ లో రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలతో ఈ సినిమా గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రస్థాయిలో చర్చకు దారి తీసింది. అర్థమైందా రాజా అంటూ రజినీకాంత్ వేసిన డైలాగ్స్ తో సినిమాకు కావాల్సినంత ప్రమోషన్ లభించింది. సినిమా విపరీతంగా హైప్ వచ్చేసింది. అందుకే ఈ సినిమా రిలీజ్ రజినీ అభిమానులు తెగ ఎదురు చూశారు. ఆగస్టు 10న ఈ సినిమా విడుదల అవుయింది. కానీ ఇప్పటికే బెనిఫిట్ షోలు, యూఎస్ లో ప్రీమియర్ షోలు పడ్డాయి. అందుకే ఈ సినిమా కథ ఇదే అంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సినిమా విడుదల అయి మొదటి ఆట పడకముందే సినిమా రివ్యూను సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు నెటిజన్లు.

రజినీకాంత్ సినిమాల నుంచి చాలా మంది ఎంతో ఎక్స్ పెక్ట్ చేస్తారు. కానీ ఈ మధ్య రజినీకాంత్ సినిమాలు ఏవీ బాక్సాఫీసు వద్ద సరిగ్గా ఆడటం లేదు. కబాలి దగ్గర్నుంచి ఆయన సినిమాలు తన అభిమానులను నిరాశపరుస్తూనే ఉన్నాయి. కానీ.. జైలర్ సినిమా మాత్రం అలా కాదని.. రజినీకాంత్ అభిమానులకు పండగే అని అంటున్నారు. రజినీ ఈజ్ బ్యాక్ అని అసలు సినిమాలో ఉన్న విజువల్స్ చూస్తే అదిరిపోవాల్సిందే అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ సినిమా పేరు చూస్తే జైలర్ అని ఉంది కానీ.. సినిమాలో కామెడీకి కూడా కొదవలేదని చెబుతున్నారు.

rajinikanth jailer movie review and rating in telugu

Jailer Movie Review: సినిమా నటీనటులు వీళ్లే

తారాగణం: రజినీకాంత్, రమ్యకృష్ణ, తమన్నా, జాకీ ష్రాఫ్, సునీల్, మిర్నా మేన్, వసంత్ రవి, యోగి బాబు, మోహన్ లాల్

డైరెక్టర్ : నెల్సన్ దిలీప్ కుమార్

మ్యూజిక్ డైరెక్టర్ : అనిరుథ్

నిర్మాణ సంస్థ: సన్ పిక్చర్స్

విడుదల తేదీ : 10 ఆగస్టు 2023

Jailer Movie Review : సినిమా కథ ఇదే

ఈ సినిమాలో రజినీకాంత్ పేరు టైగర్ ముత్తువేల్ పాండియన్. ఆయన జైలర్. చాలా కఠినమైన జైలర్ అని చెప్పుకోవాలి. ఖైదీలను క్రమశిక్షణలో ఉంచడం కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటారు ఆయన. కట్ చేస్తే పాండియన్ ఫ్యామిలీ గురించి చెప్పుకోవాలి. బాధ్యత ఉన్న తండ్రిగా రజినీకాంత్ నటించారు. అలాగే.. బాధ్యతగా ఉన్న భర్తగా, ఫ్యామిలీకి అండగా ఉంటారు. ఆయన జైలర్ గా ఉన్నప్పుడు ఓ గ్యాంగ్ స్టర్ తప్పించుకోబోతుండగా అడ్డుకుంటాడు. దీంతో పాండియన్ మీద పగ పెంచుకుంటాడు ఆ గ్యాంగ్ స్టర్. జైలర్ గా రిటైర్ అయి తన కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా జీవనం సాగిస్తుంటాడు పాండియన్. కానీ.. కొన్ని రోజులకు పాండియన్ కొడుకును ఆ రౌడీకి సంబంధించిన వాళ్లు చంపేస్తారు. దీంతో పాండియన్ లో మరో కోణం బయటపడుతుంది. తన కొడుకును చంపారనే కోపంతో క్రూరుడిగా మారుతాడు పాండియన్. సాధారణ జైలర్ అయి ఉండి అంత క్రూరుడిగా ఎలా మారుతాడు. ఇంకా ఆయన్ను ఆ వైపు నడిపించిన దారులు ఏంటి.. అనేవి తెలియాలంటే సినిమాను వెండి తెర మీద చూడాల్సిందే.

Jailer Movie Review : విశ్లేషణ

నిజానికి రజినీకాంత్, నెల్సన్ కాంబోలో వచ్చిన తొలి మూవీ ఇది. నెల్సన్ బీస్ట్ అనే సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అంతకు ముందు కొలిమావు కోకిల, వరుణ్ డాక్టర్ లాంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు. బీస్ట్ అంతగా సూపర్ సక్సెస్ కానప్పటికీ రజినీకాంత్ తన సినిమాకు దర్శకత్వం వహించే బాధ్యతను నెల్సన్ కు అందించారు. ఇక.. ఈ సినిమాలో రజినీకాంత్ సరసన రమ్యకృష్ణ నటించింది. అందుకే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఒకప్పుడు వీళ్ల కాంబోలో వచ్చిన నరసింహ సినిమా తెలుసు కదా. ఆ సినిమా వచ్చి 24 ఏళ్లు అయింది.

rajinikanth jailer movie review and rating in telugu
rajinikanth jailer movie review and rating in telugu

ఆ తర్వాత ఇద్దరూ కలిసి మళ్లీ నటించిన సినిమా ఇది. ఈ సినిమాలో మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించారు. అలాగే.. కన్నడ హీరో శివరాజ్ కుమార్ నటించారు. బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ కూడా నటించారు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తోనే తెరకెక్కించారు. దాదాపు రూ.200 కోట్లతో ఈ సినిమాను నిర్మించారు.

జైలర్ పేరు చూసి ఈ సినిమా సీరియస్ సినిమా అని అందరూ అనుకుంటారు. కానీ.. ఇది పక్కాగా కామెడీ మూవీ. ముఖ్యంగా రజినీకాంత్, యోగి బాబు మధ్య వచ్చే సీన్స్ అయితే కడుపుబ్బా నవ్విస్తాయి. ఒకప్పుడు అంటే 20 ఏళ్ల కింద రజినీకాంత్ సినిమాలకు ఎంత క్రేజ్ ఉండేది. సూపర్ స్టార్ అంటే ఎంత అభిమానం ఉండేదో ఈ సినిమాతో అది మరోసారి నిరూపితం అయింది. అందుకే చాలా ఏళ్ల తర్వాత రజినీ ఈజ్ బ్యాక్ అంటూ ఆయన అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఇది మామూలు సినిమా కాదని.. రూ.1000 కోట్ల కలెక్షన్లు పక్కా అని రజినీ అభిమానులు చెబుతున్నారు. టీజర్, ట్రైలర్ లో చూసినట్టుగా ఈ సినిమాలో కొత్త రజినీని చూశామని.. రజినీ వేట మొదలు పెడితే రికార్డులు బద్దలు కావాల్సిందే అని మరోసారి నిరూపితం అయిందని అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

ప్లస్ పాయింట్స్

రజినీకాంత్ స్టయిల్ అండ్ వింటేజ్ లుక్

డార్క్ కామెడీ

రజినీకాంత్, యోగి బాబు మధ్య వచ్చే సన్నివేశాలు

మాస్ ఎలివేషన్స్

క్లైమాక్స్ ట్విస్ట్

మైనస్ పాయింట్స్

పిల్లి, టైగర్ కాన్సెప్ట్

సెకండ్ హాఫ్

దితెలుగున్యూస్ రేటింగ్ : 3.5/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button