Athibala Plant Benefits – అతిబల మొక్క : అనేక రోగాలకు ఇది బ్రహ్మాస్త్రం..
Banyan Tree : Nutrients, Benefits & Uses
మన ఊర్లలో దాదాపుగా అన్నిగ్రామాలలో కనిపించే చెట్టు అతిబల. దాదాపుగా ఇది తెలియని గ్రామీణులు వుండరు. అమితమైన బలాన్ని అందించే శక్తి ఇందులో వుంది కాబట్టే దీనికి అతిబల అని పేరువచ్చింది. ప్రాచీనకాలంలో కూడా రామాయణంలోను, భారతంలోను ఆ తరువాత కాలాలలోకూడా ఈ అతిబల మొక్క ప్రశంస చాలాచోట్ల కనిపిస్తుంది. దీని ఆకులు, పూలు, గింజలు, వేర్లు సర్వాంగాలు శక్తివంతమైనవి. అతిబల మొక్క ప్రాముఖ్యత, ఈ మొక్క తో ఎటువంటి రోగాలు తగ్గుతాయి, ఎలా వాడుకోవాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం…
అతిబల మొక్క, అసాధారణమైన శక్తిగల ఔషధ మొక్క, గ్రామ గ్రామాన వుండి కూడా వాటి గురించి తెలుసుకోలేక, మనం ఉపయోగించుకోలేక, మనం బలహీనమైపోతున్నామంటే ఇది ఎంత దురదృష్టమో, మీరే ఆలోచించండి. ఇప్పటికైనా ఈ మొక్క గురించిన వాస్తవాలు మీరు తెలుసుకుని, మీకు కావాల్సిన వారికీ తెలియజేసి, అందరిని శక్తివంతులుగా మార్చడానికి ప్రయత్నించవలసిందిగా కోరుతున్నాము.
అతిబలను సంస్కృతంలో అతిబల అని, హిందీలో కంగి అని, తెలుగులో ముద్రబెండ, తుత్తురుబెండ, దువ్వెనకాయల చెట్టు, అతిబల అని, ఆంగ్లంలో Mallow Tree అంటారు.
అతిబల ఆకులు మృదువుగా జిగట కలిగి, మేహశాంతిని కలుగజేస్తాయి. శరీరంలోని సకల మలినాలను బయటికి పంపి శరీరాన్ని శుద్ధిచేస్తాయి. గడ్డలను, వ్రణాలను మెత్తపడేలా చేసి, మానేలా చేస్తాయి.
మూత్రంలోమంట, రాళ్ళు వుంటే:
అతిబల ఆకులు నాలుగైదు నలిపి పావు లీటరు నీటిలో వేసి, సగానికి మరగబెట్టి వడపోసి చల్లార్చి ఒకచెంచా కండచక్కెర కలిపి, మూడు పూటలా తాగుతుంటే మూత్రంలో మంట తగ్గిపోయి, రాళ్ళు కరిగి మూత్రంద్వారా పడిపోతాయి.
నేత్రదోషాలకు – ఆకుకషాయం
అతిబల ఆకులు నాలుగైదు నలిపి పావు లీటరు నీటిలో వేసి, సగానికి మరగబెట్టి వడపోసి చల్లార్చి ఆ కషాయాన్ని, మూసినకండ్లపైన కడుగుతూవుంటే, కంటి దోషాలు తగ్గిపోయి కంటిచూపు పెరుగుతుంది.
జ్వరతీవ్రతలో – అతిబల:
అతిబల ఆకులను నీటిలో నానబెట్టి వడపోసి, అందులో కొద్దిగా కండ చక్కెర కలిపి, కొద్ది కొద్దిగా తాగుతూవుంటే వేడితగ్గి జ్వరం శాంతిస్తుంది. ఇదేనీరు మూడుపూటలా సేవిస్తుంటే మూత్రంలోమంట, చురుకు, మూత్రాశయంలో వాపు, దీర్ఘకాలిక దగ్గులు కూడా హరించిపోతాయి.
అతిబల పిచ్చికుక్క కరిచిన వెంటనే అతిబల ఆకులరసం 70 గ్రాములు మోతాదుగా తాగించాలి. ఆకుముద్దను కాటుపైన వేసి కట్టుకట్టాలి. ఇలాచేస్తుంటే విషం విరిగి పోతుంది.
శీఘ్రస్కలనానికి – అతిబల
అతిబల ఆకుల గింజలు 50గ్రాములు, శతావరి వేర్ల పొడి 100గ్రాములు, ఆ రెండింటికి సమంగా పటిక బెల్లంపొడి కలిపి నిలువవుంచుకోవాలి. రోజు రెండుపూటలా ఒకచెంచా పొడి చప్పరించి తిని, ఒక కప్పుపాలు తాగుతూవుంటే శీఘ్రస్కలనం మాయమైపోయి వీర్యం గట్టిపడి యౌవనం పెరుగుతుంది.
పైత్యపు గుండెదడకు:
అతిబల ఆకులు ఏడు తీసుకొని మంచినీటితో నూరి బట్టలో వడపోసి, ఆ రసంలో చక్కెర కలిపి తాగుతూవుంటే, అధికవేడివల్ల కలిగిన గుండెదడ శీఘ్రంగా హరించిపోతుంది.
నడుమునొప్పికి – నాణ్యమైన మార్గం:
అతిబల ఆకులతో కాచిన కషాయం రెండుపూటలా తాగుతూ, ఆకులను నలగ్గొట్టి వేడిచేసి నొప్పులపైన వేసి కట్టుకడుతూ వుంటే కేవలం నడుమునొప్పే కాకుండా, ఎక్కడి నొప్పులైనా తగ్గిపోతాయి .
మొలలకు – అతిబల ఆకుకూర:
అతిబల ఆకులను కూరలాగా వండి రెండు పూటలా తింటుంటే మొలలనుండి కారేరక్తం ఆగిపోతుంది.
స్త్రీల – స్తనాలవాపుకు:
అతిబలవేరును నిలువచేసుకొని రోజూ రెండు పూటలా కొంచెం నీటితో సానరాయిపైన ఆవేరును అరగదీసి, ఆ గంధాన్ని వాపులపైన పట్టిస్తూవుంటే రొమ్ములవాపు తగ్గిపోతుంది.
అలాగే కండరాల వాపుపైన కూడా పట్టిస్తూవుంటే ఆవాపు తగ్గుతుంది.
దగ్గు, ఉబ్బసం హరించిపోవుటకు:
బాగా ముదిరిన అతిబలచెట్టును సమూలంగా పెకలించి తెచ్చి, ముక్కలుగా చేసి కడిగి ఎండలో ఎండబెట్టాలి. తరువాత దాన్ని కాల్చి బూడిదగా చేయాలి. ఆ బూడిదను ఒకకుండలో పోసి నిండా నీరుపోసి మూడురోజులపాటు వుంచాలి. రోజుకు ఒకసారి కర్రతో కలుపుతూవుండాలి. నాలుగవ రోజున పైకితేలిన నీటిని మాత్రమే ఉంచుకొని చిన్నమంటపైన మరిగిస్తే, అంతా తెల్లటి క్షారంగా మిగులుతుంది. దాన్ని మెత్తగానూరి నిలువ చేసుకోవాలి.
ఈక్షారం రెండుమూడు చిటికెల మోతాదుగా ఒకచెంచా తేనెతో కలిపి సేవిస్తువుంటే దగ్గు, ఉబ్బసం తగ్గిపోతాయి.
మూత్రపిండాల – నొప్పితగ్గుటకు:
అతిబల ఆకులను 50గ్రాములు తీసుకొని మెత్తగా నూరి, చిన్నచిన్న బిళ్ళలుగా తయారుచేయాలి. తరువాత 50గ్రాముల ఆవునెయ్యి పాత్రలో పోసి, పొయ్యి మీదపెట్టి నెయ్యి మరుగుతుండగా ఈ బిళ్ళలను అందులోవేయాలి. బిళ్ళలన్నీ వేగేవరకు వుంచి, దించి
వడపోసి వాటిని నిలువచేసుకోవాలి. రోజూ రెండుపూటలా ఒకటి లేక రెండుచెంచాల మోతాదుగా వాటిని సేవిస్తుంటే మూత్రపిండాలనొప్పి తగ్గిపోతుంది.
నులిపురుగులు హరించుటకు అతిబలగింజలను నిప్పులపైనవేసి పిల్లల మల ద్వారానికి తగిలేటట్లుగా చేస్తే దాని ప్రభావానికి లోపలి నులిపురుగులు హరించి పోతాయి.
మొలలకు – అతిబలగోలీలు
అతిబల ఆకులు ఇరవైఒకటి, అలాగే మిరియాలు ఇరవై ఒకటి తీసుకొని మొత్తం మెత్తగా నూరి ఏడు గోలీలు చేయాలి. రోజు ఒక గోలీ చొప్పున ఏడు రోజులు పరగడుపున ఒకగోలీని మంచినీటితో సేవిస్తుంటే వాతదోషంవలన కలిగిన మొలలు తగ్గిపోతాయి.
గుండెబలానికి- ముఖకాంతికి:
అతిబలవేర్లను దంచి పొడిచేసి జల్లించి నిలువ వుంచుకోవాలి. ఈ పొడిని మూడునాలుగు చిటికెల మోతాదుగా ఆవునెయ్యితో కలిపి, రెండుపూటలా ఆహారానికి గంటముందు సేవిస్తుంటే, గుండెకు బలం కలగడమేకాక ముఖంకూడా కాంతివంతంగా మారుతుంది.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.