ఆహారం

Banyan Tree Benefits – మరణంలేని చెట్టు: మర్రిచెట్టుతో ఎటువంటి రోగాలను, ఎలా తగ్గించుకోవాలి..

Banyan Tree : Nutrients, Benefits & Uses

మర్రిచెట్టుకు మరణం లేదనే విషయం చాలామందికి తెలియదు. ఈ భూమి ఎంతకాలం వుంటుందో అంతకాలం మర్రిచెట్టు బ్రతికే వుంటుంది. మర్రిచెట్టులోని ఆకులు, కాయలు, ఊడలు, మానుబెరడు వేరుబెరడు అన్నిభాగాలలో ఔషధశక్తి అద్భుతంగా వుంది. ఈ ఒక్క చెట్టు ఉపయోగాలు తెలుసుకుంటే, ఊరుఊరంతా శారీరకంగా,మానసికంగా,ఆర్థికంగా సుసంపన్నం ఉండవచ్చు. ఈసృష్టిలోని చిరంజీవులైన అమృతవృక్షాలలో మర్రిచెట్టు ఒకటి. ఈ భూమి ఉన్నంతకాలం మర్రిచెట్టు మనుగడ సాగిస్తుంది. మర్రిచెట్టును సరిగ్గా ఉపయోగించుకున్నవారు, అనంతమైన దీర్ఘాయువును పొందవచ్చని మహర్షులు నిరూపించారు. మర్రిచెట్టు గురించి తెలుసుకోవడానికి మన జీవితంమొత్తం ప్రయత్నించినా తెలుసుకోవలసిన విషయాలు, ఇంకా ఎన్నోమిగిలిపోతాయి.. మర్రిచెట్టులో ఉండే ఔష‌ధ గుణాలు ఏమిటి, మర్రిచెట్టుతో ఎటువంటి రోగాలను, ఎలా తగ్గించుకోవాలి అనే విషయాలను తెలుసుకుందాం..

మర్రిచెట్టును సంస్కృతంలో వట, న్యగ్రోధ, క్షీరి అని, హిందీలో బద్, బూహద్ అని, తమిళ, మళయాళాలలో వృక్షవాదం అని, తెలుగులో మర్రిచెట్టు అని, ఇంగ్లీషులో Banian Tree అని అంటారు..

దంతాలలో చీము, నెత్తురు కారితే మర్రిపుల్లను నమిలి రెండుపూటలా పళ్ళు తోముతుంటే దంతవ్రణాలు, చిగురువ్రణాలు, దంతకదలిక మొదలైన సమస్యలన్నీ మటుమాయమై నోరు సుగంధంగా మారి దంతాలు దృఢంగా తయారవుతాయి.

అతిమూత్రరోగికి – అద్భుతయోగం:
మర్రిబెరడు బెత్తెడు ముక్కని నలగ్గొట్టి పెద్ద గ్లాసు నీటిలోవేసి, ఒకరాత్రి అంతా నానబెట్టి ఉదయం సగానికి మరగబెట్టి, వడపోసి చల్లార్చి తాగుతూవుంటే అతి మూత్రం అంతులేకుండా పోతుంది.

నయంకాని నడుమునొప్పికి:
పలుచని నూలుబట్టను మర్రిపాలతో తడిపి, వెంటనే రోగినడుముకు అంటించాలి. అది బాగా అతుక్కు పోతుంది. ఈవిధంగా రెండుమూడు పట్టీలువేస్తే ఎంత బాధకరమైన నడుమునొప్పి అయినా తగ్గిపోతుంది.

ఆగని రక్తవాంతులకు మర్రిలేత చిగుర్లు నీటితో మెత్తగా పానీయంలాగా నూరి, కొద్దిగా కండచక్కెర కలిపి మూడుపూటలా తాగుతూవుంటే రక్తవాంతులు తగ్గుతాయి.

నెత్తురుబంక విరేచనములకు
మర్రి ఊడలనుగానీ, బెరడునుగానీ కడిగి నీడలో గాలికి ఆరబెట్టి దంచి, జల్లెడపట్టి పూటకు 3 గ్రాముల చొప్పున మూడుపూటలా బియ్యం కడిగిన నీటిలో కలిపి తాగుతుంటే నెత్తురు, బంక విరేచనాలు తగ్గిపోతాయి..
అజీర్ణపదార్థాలు, మాంసాహారం నిషేధం…

మధుమేహమునకు:
మట్టిచెట్టు వేరుపైభాగమున వుండే బెరడును తీసుకొచ్చి కడిగి నీడలో ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి. ఆ పొడిని పలుచని బట్టతో జల్లెడ పట్టి, రోగుల పరిస్థితిని బట్టి ఒకపూటగానీ, రెండుపూటలాగానీ, ఒక టీస్పూన్ మోతాదుగా ఒక గ్లాసు మంచినీటిలో కలిపి తాగుతూవుంటే క్రమంగా షుగర్ రోగము నివారణ అవ్వడమే కాకుండా, షుగర్ రోగం వలన కోల్పోయిన బలముకూడా తిరిగి సంక్రమిస్తుంది.

రక్తమొలలకు: మర్రికట్టెలను ఎండబెట్టి కాల్చి బూడిదచేసి, మెత్తగానూరి జల్లెడ పట్టి నిలువ వుంచుకోవాలి. రోజూ రెండుపూటలా రెండుగ్రాముల మోతాదుగా ఒకకప్పు మంచినీటిలో కలిపి సేవిస్తూవుంటే కొద్ది రోజులలోనే రక్తంస్రవించే మొలలు తగ్గిపోతాయి . అదేవిధంగా, నూట ఒక్కసార్లు నీటిలో కడిగిన వెన్నను సమభాగంగా, కట్టెల బూడిదతో కలిపి పేస్ట్ లాగా తయారుచేసి రోజూ రెండుసార్లు పెరిగిన మొలలపైన లేపనము చేస్తూ వుంటే కూడా మొలలు ఇంకా త్వరగా హరించిపోతాయి.

బుద్ధిబలము – అద్భుతముగా పెరుగుటకు మర్రిచెట్టు బెరడును తెచ్చి కడిగి ముక్కలు చేసి, రెండు మూడురోజులు ఎండలో బెట్టి ఆ తరువాత నీడలో గాలి తగిలేచోట బాగా ఎండబెట్టి దంచి పొడిచేసుకోవాలి. పలుచనిబట్టతో జల్లెడ పట్టి ఆ పొడికి రెండురెట్లు కండచెక్కెర కలిపి నిలువ వుంచుకోవాలి. రోజూ రెండుపూటలా పిల్లలకు పావు చెంచా మోతాదు, పెద్దలకు ఒక చెంచా మోతాదుగా సేవిస్తూవుంటే బుద్ధి మాంధ్యము తగ్గిపోయి, బుద్దిబలము, జ్ఞాపకశక్తి, ప్రజ్ఞ, ధారణ అనూహ్యంగా పెరుగుతాయి .అయితే, ఈ పొడిని వాడే రోజులలో మంచిఫలితం త్వరగా కలగాలంటే, పులుపు రుచిని పూర్తిగా నిషేధించాలి.

గుండెదడకు గురియైనయోగం:
లేత మర్రిఆకులు 10 గ్రాములు, 150 మిల్లీలీటర్ల మంచి నీటితో మెత్తగానూరి పలుచని బట్టలో వడకట్టి కొద్దిగా కండచక్కెర కలిపి, ఆ రసాన్ని ఆహారానికి గంటముందు, రెండు పూటలా తాగుతుంటే గుండెదడ తగ్గిపోతుంది.

చెవిలో – పురుగులు దూరితే ముందుగా మేకపాలు అయిదారుచుక్కలు చెవిలో వేసి తరువాత మర్రిపాలు నాలుగు చుక్కలువేస్తే చెవిలోని పురుగులు చచ్చి బయటకువస్తాయి.

దగ్గు మొదలైన ఊపిరితిత్తుల సమస్యలకు:
మర్రిబెరడు చూర్ణము పావు టీస్పూన్ మోతాదుగా తీసుకొని పావులీటరు మంచినీటిలో వేసి సగము కషాయము మిగిలేవరకు చిన్నమంటపైన మురగబెట్టి దించి పడకట్టి. అది గోరువెచ్చగా అయినతరువాత అందులో కొద్దిగా ఉప్పు గానీ, కండ చక్కెర గానీ కలిపి రెండుపూటలా సేవిస్తూవుంటే దగ్గు, జలుబు, కఫభారము, దగ్గితే నోటినుండి రక్తం పడటం, గొంతువుండు కాపడం, మొదలైన సమస్యలు తగ్గిపోతాయి .

వివిధ రకాల నోటి వ్యాధులకు:
మట్టిచెట్టు బెరడు బెత్తడు ముక్కను తీసుకొని కడిగి నలుగగొట్టి ఒకపెద్ద గ్లాసు నీటిలోనేనీ నగానికి మరిగించి వడపోసి గోరువెచ్చగా అయిన తరువాత కషాయాన్ని నోటిలో పోసుకొని పుక్కిలించి వూసి వేస్తూవుంటే చిగుళ్లవాపు నోటిలో పుండ్లు నాలుక పూత మొదలైనవన్నీ క్రమంగా తగ్గిపోయి చిగుర్లు దంతాలు గట్టిపడతాయి .
చిన్నపిల్లల నోటిలో వచ్చిన పుండ్లకు ఈచెక్క గంధాన్నిగానీ, ఈ కషాయాన్ని గానీ దూదితో పిల్లల నోటిలో అద్దుతూ వుంటే నోటి సమస్యలు కూడా తగ్గిపోతాయి .

గనేరియా రోగమునకు: మర్రిచెట్టు బెరడు 10 గ్రాములు తీసుకొని ఒకలీటరు నీటిలో పోసి నాలుగవ వంతు కషాయము మిగిలేవరకు మరగబెట్టి, వడకట్టి గోరువెచ్చగా అయిన తరవాత దానిలో ఒక చెంచా కండ చక్కెర కలిపి రెండుపూటలా సేవిస్తూవుంటే గనేరియా అదృశ్యమైపోతుంది.

మంచివెంట్రుకలకు – మర్రి తైలం:
మర్రి చెట్టునుండి లేతగావుండే చిగుర్లు కావలసినన్ని తీసుకొచ్చి తగినన్ని నీరు కలిపి మెత్తగానూరి బట్టలో వడకట్టి రసం తీసుకోవాలి. ఈరసంతో సమానభాగం నువ్వులనూనె కలిపి, కళాయిలో పోసి చిన్నమంటపైన రసమంతా ఇగిరిపోయి, నూనె మిగిలేవరకు మరిగించి వడపోసి గాజుసీసాలో నిలువ వుంచుకోవాలి. ఇదే మర్రి తైలం. ఈ తైలాన్ని తలకు రుద్దుతూవుంటే వెంట్రుకలు రాలడం ఆగిపోయి, వెంట్రుకల కుదుళ్ళకు గట్టితనం కలుగుతుంది. అంతేగాక, ఈ తైలాన్ని నడుము నొప్పికి, కీళ్ళ నొప్పులకు కూడా మర్దనచేసి, పైన మర్రి ఆకులు వేసి కట్టుకడుతూవుంటే నొప్పులు తగ్గిపోతాయి. అంతేగాక, ఈ తైలాన్ని దూదితో తడిపి లూటీ పుండ్లు కి రాస్తుంటే త్వరగా మానిపోతాయి.

మర్రిచెక్క గంధంతో – మహా ఆయువు:
ఆదివారము అమావాస్య కలసివచ్చిన రోజున గానీ, లేక ఏదైనా ఆదివారము నాడు గానీ మర్రిచెట్టును విధిప్రకారముగా పూజించి, నైవేద్యము పెట్టి మనసులోని కోరికను తెలిపి, ఆ చెట్టుయొక్క తూర్పు లేక ఉత్తరమువైపు మానుమీది బెరడును కత్తితో చెక్కి ఒకకేజీ ప్రమాణముగా తీసుకోవాలి. మానుపైన బెరడు తీసిన చోట చెట్టుకు గాయం అవుతుంది కాబట్టి, ఆగాయానికి ఆవుపేడను వెంటనే దట్టంగా పూయాలి. ఈవిధంగా తెచ్చుకున్న మర్రిచెక్కను శుభ్రంగా కడిగి బెత్తడు సైజు ముక్కలుగా కొట్టి, ఎండబెట్టి నిలువచేసుకోవాలి. రోజూ ఉదయంపూట ఒకముక్కను సానరాయి మీద కొంచెం నీళ్ళుపోసి అరగదీసి గంధం తీసి, ఒకచెంచా మోతాదుగా సేవించాలి. ఈ విధంగా నియమబద్ధంగా ఒక సంవత్సరం పాటు సేవింస్తే, శరీరమంతా దృఢంగా తయారవుతుంది. శిధిలమైన వృద్ధ శరీరంలోకూడా తిరిగి నవయవ్వనం వస్తుంది. జారిపోయిన శరీరాంగాలు తిరిగి పటుత్వంగా తయారవుతాయి. అంతేగాకుండా, అతిమూత్రము, మధుమేహము వంటి సమస్యలు కూడా పూర్తిగా అదుపులోకి వస్తాయి..

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button