ఆహారం

Bay Leaf Benefits – బిర్యాని ఆకు ఆరోగ్య రహస్యాలు

Bay Leaf: Nutrients, Benefits & Uses

ఆకుపత్రి అంటే మన వాడుకభాషలో బిర్యాని ఆకు అంటారు. ఇది మామిడి ఆకులాగా వుండి సువాసనగా వుంటుంది. వీటిని బిర్యాని లేక పలావ్ వండేటప్పుడు అన్నంలో వేసి ఉడికిస్తారు. ఆహారపదార్ధంగా మాత్రమే దీనిగురించి తెలిసినప్పటికీ , దీని గురించిన మరిన్ని ఆరోగ్య రహస్యాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆకుపత్రి- పేర్లు: ఆకుపత్రిని సంస్కృతంలో తేజవత, పాకరంజన అని, హిందీలో తేత్పత్తా అని, తెలుగులో ఆకుపత్రి, ముద్ద దాల్చిన చెట్టు ఆకు అని అంటారు.

ఆకుపత్రి – రూప గుణ ధర్మాలు: వీటి చూర్ణం లేక కషాయం వగరుగా, తీపిగా, సువాసనగావుండి వేడిచేసి చల్లారుస్తుంది. వాత, పిత్త, కఫ సంబంధమైన సర్వరోగాలను అణచివేస్తుంది.

నత్తికి ఆకుపత్రి: మాటలు తడబడేవారు మాట్లాడేటప్పుడు గొంతు పట్టుకుపోయేవారు నంగినంగిగా నత్తిగా ఆగిఆగి లేక దీర్ఘాలు తీసి మాట్లాడేవారు ఈ ఆకు పత్రిని చిన్నచిన్న ముక్కలుగా చేసి జేబులో వుంచు కొని ఎల్లప్పుడు నోటిలో చిన్నముక్క వుంచుకొని ఆ రసాన్ని మింగుతూవుంటే క్రమంగా సమస్యలు నివారించబడతాయి .
బట్టలకు – పురుగులు పట్టకుండా బట్టలపెట్టెలో ఈ ఆకుపత్రి వేసి నిలువ వుంచుతూ వుంటే, దీని వాసనకు చెదపురుగులు ఆ పెట్టెలోకి రాలేవు.

గర్భశయరోగాలకు ఆకుపత్రి : ఒక గ్లాసునీటిలో ఆకుపత్రి 10 గ్రాములు వేసి ఒక కప్పు కషాయానికి మరిగించాలి, తరువాత వడపోసి తాగుతూవుంటే గర్భదోషాలు హరించి ఋతువు క్రమబద్ధమౌతుంది.
పొత్తికడుపు రోగాలకు – ఆకుపత్రి : ఆకుపత్రిని ఆరబెట్టి దంచి జల్లించి నిలువ చేసు కోవాలి. రెండుపూటలా 2 గ్రాములు మోతాదుగా చప్పరించి తింటుంటే పొత్తికడుపునొప్పి, బిగుసుకుపోవడం వంటి సమస్యలు హరించుకుపోతాయి.
శరీర సుగంధానికి ఆకుపత్రి : ఆకుపత్రి, వట్టివేర్లు, మరువం, మంచిగంధం, జరామాంసి వీటిని సమంగా మంచినీటిలో నానబెట్టి మెత్తగారుబ్బి, తలకు వంటికి రుద్ది, ఎండిన తరువాత స్నానం చేస్తుంటే, శరీరమంతా సుగంధంతో పరిమళిస్తుంది.
నీరసరోగానికి ఆకుపత్రి : ఆకుపత్రిపొడి 2 గ్రాములు , ఆవునెయ్యి ఒక చెంచా కండచక్కెరపొడి ఒకచెంచా కలిపి రెండుపూటలా ఆహారానికి గంటముందు తింటుంటే నీరసం తగ్గిపోయి శరీరానికి బలం కలుగుతుంది. 40 రోజులు మాత్రమే వాడాలి.

క్షయరోగానికి – అక్షయబలానికి: ఆకుపత్రి, చిన్నఏలకులు, దాల్చినచెక్క, దోరగా వేయించిన పిప్పళ్ళు ఒక్కొక్కటి 5 గ్రాములు తీసు కోవాలి. పటికబెల్లం పొడి 20 గ్రాములు అతిమధురం పొడి 40 గ్రాములు , గింజలు తీసిన ఎండుఖర్జూరం పైబెరడు 40 గ్రాములు , గింజలు తీసిన ఎండుద్రాక్ష 40 గ్రాములు ఇవన్నీ మెత్తగా దంచి కొద్దిగా తేనెకలిపి ముద్దచేసి నిలువచేసు కోవాలి. పూటకు 10 గ్రాములు మోతాదుగా ఆనందంగా తిని ఒకకప్పు మేకపాలు గోరువెచ్చగా తాగుతుంటే క్షయరోగం హరించిపోవడమేకాక ఆ రోగంవల్ల కోల్పోయినబలం కూడా తిరిగివస్తుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button