Dry Ginger Benefits – సర్వ రోగాలను హరించే శొంఠి..
Dry Ginger : Nutrients, Benefits & Uses
సర్వ రోగాలను హరించే శొంఠి గురించి తెలుసుకుందాం..
శొంఠిని సంస్కృతంలో మహాఓషధి అని, విశ్వభేషణం అని కూడా అంటారు. ఈ భూమిమీద ఉన్న అనేక రోగాలను ధ్వంసం చేయగల మహామహా మూలికలలో ఈ శొంఠి కూడా ఒకటి.
ప్రతి ఇల్లాలు శొంఠిలోని గుణాలను తెలుసుకుంటే, తన కుటుంబ సభ్యులకు వచ్చే అనేకరకాల చిన్నచిన్న అనారోగ్య సమస్యలను తానే పరిష్కరించవచ్చు. అల్లం దుంపలను పై తోలును గీకివేసి సున్నపు తేటలో ముంచి ఎండబెడితే అది శొంఠిగా మారుతుంది.
సొంఠి గుణదోషాలు- ప్రభావాలు : ఆయుర్వేద శాస్త్రప్రకారంగా సొంఠి రుచి కారకమైంది. వాతాన్ని నాశనం చేస్తుంది. కడుపు ఉబ్బరాన్ని, గ్యాస్ ను తగ్గిస్తుంది. పురుషులకు వీర్యవృద్ధి చేస్తుంది. శ్వాసరోగాలను, దగ్గులను, హృదయ రోగములను, బోదకాలును, కఫ రోగములను, వాతరోగములను తగ్గిస్తుంది. అధిక పైత్యాన్ని కూడా నశింపచేస్తుంది. మూత్రపిండ రోగాలను తగ్గిస్తుంది. మనలో వ్యాధినిరోధకశక్తిని వృద్ధిచేస్తుంది.
v ఉదరములో గ్యాస్ ఎక్కువైనప్పుడు గుండెలోనొప్పి వస్తుంది. అలాంటి పరిస్థితిలో పావుచెంచా
శొంఠి పొడిని, ఒకచెంచా తేనెతో కలిపి సేవిస్తూవుంటే గ్యాస్ తొలగిపోయి గుండెనొప్పి తగ్గిపోతుంది.
v దోరగా వేయించిన శొంఠి పొడి ఒక గ్రామ మోతాదుగా ఒక కప్పు వేడిగా వున్న మేకపాలలో కలిపి సేవిస్తూవుంటే గర్భవతులకుగానీ , మిగిలినవారికి వచ్చిన విషజ్వరాలు తగ్గిపోతాయి.
v శొంఠిపొడిని నీటితో కలిపి బాగా మెత్తగా నూరి నుదిటిపైన పట్టు వేస్తే అరతలనొప్పి
తగ్గిపోతుంది. దోరగా వేయించిన శొంఠి పొడి ఒక చిటికెడు తీసుకొని ఒకచెంచా మేకపాలలో కలిపి, బట్టలో వడపోసి రెండు ముక్కులలో రెండు రెండు చుక్కలు వేస్తే తలనొప్పి వెంటనే తగ్గిపోతుంది.
మేకపాలకు బదులు బెల్లపు పానకాన్ని కూడా ఉపయోగించవచ్చు.
v వాత రోగుల బాధలు వర్ణనాతీతం. శరీరములోని జాయింట్లలో వాపు వచ్చి విపరీతమైన బాధ కలుగుతూ
వుంటుంది. అలాంటి వారు దోరగా వేయించిన శొంఠి పొడి అరచెంచా మోతాదుగా తీసుకుని ,
అరగ్లాసు చెరుకురసంలో కలిపి సేవిస్తూవుంటే వాత బాధలు అతిత్వరగా తగ్గుతాయి.
అదేవిధంగా శొంఠి పొడిని, తిప్పతీగ చెట్టు సమూలరసం పావుకప్పులో కలిపి సేవిస్తూవుంటే, దీర్ఘకాలిక వాతరోగము తగ్గుతుంది.
v దోరగా వేయించిన శొంఠి పొడి 50 గ్రాములు, పాత బెల్లం 100 గ్రాములు కలిపి మెత్తగా దంచి నిలువవుంచుకొని రోజూ రెండుపూటలా 5 గ్రాముల మోతాదుగా సేవిస్తూవుంటే మందాన్ని హరించిపోయి మంచిగా ఆకలి పుడుతుంది.
v శొంఠి పొడి పావుచెంచా, కరక్కాయపాడి పావుచెంచా, ఈ రెండింటిని ఒకకప్పు వేడినీటిలో కలిపి రెండుపూటలా సేవిస్తూవుంటే దగ్గు, దమ్ము, ఎక్కిళ్ళు తగ్గిపోతాయి.
v శొంఠిని సానరాయి మీద నీటితో అరగదీసిన గంధము 10 గ్రాములు తీసుకొని, దానిని 50 గ్రాముల
ఆవునెయ్యిలో వేసి నెయ్యిని కరగబెట్టి దించి ఆ నేతిని రోజు ఆహారంలో వాడుతూవుంటే
రక్త క్షీణత కలిగించే పాండురోగము తగ్గిపోయి రక్తవృద్ధి కలుగుతుంది.
v దోరగా వేయించిన శొంఠిపొడి 3 గ్రాములు, సైంధవలవణం పొడి ఒక గ్రాము కలిపి, రోజూ
రెండు లేదా మూడుపూటలా గోరువెచ్చని నీటిలో గానీ, తేనెతో గానీ కలిపి ఆహారం తరువాత
సేవిస్తూవుంటే క్రమంగా పక్షవాతం తగ్గుతుంది.
v శొంఠి పొడి 3 గ్రాములు, సైంధవ లవణము 2గ్రాములు తీసుకొని పల్లేరు కాయలతో కాచిన
ఒక కప్పు కషాయంలో కలిపి, రోజూ రెండుపూటలా సేవిస్తూవుంటే మూత్రం ధారాళంగా వస్తుంది.
v రోజు రాత్రి నిద్రపోయేముందు 3 గ్రాముల శొంఠిని ఒక చెంచా వంటాముదంలో కలిపి తాగుతూవుంటే నడుమునొప్పి, పక్కటెముకల నొప్పి, ఉదరశూల తగ్గిపోతాయి.
v ఏడు సార్లు వడపోసిన నాటు ఆవుమూత్రం అరకప్పు తీసుకొని, దానిలో దోరగా వేయించిన శొంఠి పొడి 3
గ్రాములు, కలిపి ఉదయం పరగడుపున రోజూ సేవిస్తూవుంటే క్రమంగా బోదకాలు తగ్గుతుంది.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.