ఆహారం

Galijeru Benefits: – పునర్నవ ఏ ఏ వ్యాధులను, తగ్గిస్తుందో తెలుసా..??

Galijeru/Punarnava: Nutrients, Benefits & Uses

గలిజేరుమొక్కలు లేని గ్రామంగానీ, ఆ మొక్కలు లేని ప్రాంతాలుగానీ భరతభూమి లో ఉండవు… అదేవిధంగా ఆ మొక్కకు లొంగని రోగాలు కూడా ఈ భూమి మీదలేవు. ఈ మొక్క గురించి పరిశోధనలు చేసిన మన ప్రాచీన ఆయుర్వేద శాస్త్రవేత్తలైన మహర్షులు అందరూ ముక్తకంఠంతో ఈ మొక్క ఉపయోగాల గురించి ప్రపంచానికి ఎలుగెత్తి చాటారు. గలిజేరు ప్రాముఖ్యత, ఏ ఏ వ్యాధులలో ఎలా వాడాలి.. ఎప్పుడు వాడాలి అనే పూర్తి వివరాలను తెలుసుకుందాం..

గలిజేరుకు ‘పునర్నవ’ అని పేరు పెట్టడంలోనే ఆ మొక్క యొక్క అపు రూపశక్తిసామర్థ్యాలను మనం అర్థం చేసుకోవచ్చు. ‘పునః’ అంటే మళ్ళీ, ‘నవ’ అంటే కొత్తగా సృష్టిస్తుంది అని అర్థం.
దేనిని సృష్టిస్తుంది ? అని మనం ప్రశ్న వేసుకుంటే, శరీరంలో ఏ భాగం వ్యాధిగ్రస్తమై నాశనమైవుంటుందో, ఆ భాగమును తిరిగి మళ్ళీ కొత్తగా సంపూర్ణ ఆరోగ్యవంతంగా మారుస్తుంది. అనేది ఈ పదంలోని అసలు అర్థం. తెల్లగా ఉండే గలిజేరును తెల్లగలిజేరు అని, ఎర్రగా వుండే గలిజేరును ఎర్రగలిజేరు అని, నల్లగా వుండే గలిజేరును నల్లగలిజేరు అని పిలుస్తారు.

జీర్ణకోశ వ్యాధులకు- గలిజేరు: తెల్లగలిజేరు సమూలం రసం కప్పు మోతాదుగా సేవిస్తున్నా లేక గలిజేరు ఆకును కూరగా వండి తింటున్నా లేక గలిజేరు పాకాన్ని మంచినీటిలో కలుపుకొని తాగుతున్నా లేక గలిజేరు గింజల పొడిని పావు చెంచా మోతాదుగా మంచినీటిలో కలుపుకొని సేవిస్తున్నా కడుపుబ్బరం, కడుపులోని మందాగ్ని, అజీర్ణం, మలబద్ధకం హరించిపోయి, ఆకలి బాగా పెరిగి.. జీర్ణశక్తి కలిగి జీర్ణకోశానికి కూడా బలం వచ్చి సాఫీగా విరేచనం అవుతుంది.

గుండెదడ, బలహీనత తగ్గుటకు – గలిజేరు:తెల్లగలిజేరు సమూలం తీసుకొచ్చి మెత్తగా దంచి రసం తీసి పలుచని బట్టలో వడపోయాలి. ఆ రసం ఎంత తూకంవుంటే అంత తూకంగా కండ చక్కెర పొడిని కలిపి, పాత్రను పొయ్యిమీద పెట్టి చిన్నమంటపైన లేతపాకం వచ్చేవరకు మరిగించి దించుకోవాలి. గుండెదడ సమస్య ఉన్నవారు ఒకగ్లాసు మంచినీటిలో ఈ గలిజేరుపాకాన్ని, రెండుమూడు చెంచాలు కలిపి దానిలో ఒక చెంచా పన్నీరు కలిపి రెండుపూటలా తాగుతుంటే గుండెదడ, బలహీనత క్రమంగా తగ్గిపోతుంది.

మలబద్దకం తగ్గడానికి – గలిజేరు: రోజూ రెండుపూటలా 20గ్రా, గలిజేరు ఆకును అరగ్లాసు మంచి వీటితో కలిపి మెత్తగా దంచి పలుచని బట్టలో రసం పిండి రెండు పూటలా తాగుతుంటే మలబద్దకం హరించిపోయి సుఖవిరేచనం అవు తుంది. దీనితోపాటు బంక విరేచనం కూడా తగ్గిపోతుంది.

వళ్ళంతా నీరునిండి ఉన్న సమస్యకు గలిజేరు: తెల్లగలిజేరు ఆకురసం రెండుపూటలా 10గ్రా, మోతాదుగా సేవిస్తూ ఆహారంలో ఉప్పు, నెయ్యి, నూనె లేకుండా పథ్యం పాటిస్తుంటే శరీరమంతా నిండిన విషపు నీరు హరించిపోతుంది.

కామెర్లు తగ్గడానికి – గలిజేరు : గలిజేరు గింజలు, గులాబిపూలు, కర్బూజగింజల లోపలి పప్పు, దోసగింజల్లోని పప్పు, ఈ నాలుగింటిని ఒక్కొక్కటి 5గ్రా, మోతాదుగా తీసుకొని మంచినీటితో మెత్తగానూరి, పలుచని బట్టలో వడపోసి దానిలో ఒక చెంచా కండచక్కెరపాడి కలిపి రెండుపూటలా సేవిస్తుంటే కామెర్లు క్రమంగా తగ్గిపోతాయి.

దగ్గితే రక్తం పడుతున్న సమస్యకు గలిజేరు: తెల్లగలిజేరు ఆకురసం 240 గ్రాములు, బాదంబంక 20గ్రాములు, తుమ్మ బంక 20గ్రాములు, శ్రీగంధంపాడి 10గ్రాములు, కావిరాయి 10గ్రాములు, తీసుకొని గలిజేరు రసంతో మొత్తం ముద్దలాగా అయ్యేవరకు మెత్తగా నూరి 10గ్రాముల, మోతాదుగా గోలీలు కట్టి తయారుచేసుకొని నీడలో గాలికి ఎండబెట్టి బాగా ఎండిన తరువాత నిలువజేసుకోవాలి. ఈ మాత్రలను ప్రతి రెండుగంటలకు ఒక గోలీ మోతాదుగా బుగ్గన పెట్టుకొని చప్పరిస్తుంటే క్రమంగా దగ్గితే రక్తం పడటం అతి సులువుగా ఆగిపోతుంది.

కలరావ్యాధిలో వచ్చే వాంతులకు – తెల్లగలిజేరు: ఒక గ్లాసు నీటిలో 10 గ్రాముల పరిశుభ్రం చేసిన గలిజేరు ఆకును వేసి, చిన్నమంట పైన సగం కషాయం మిగిలేవరకు మరగబెట్టి దంచి, వడపోసి చల్లార్చి ఒకపూట మోతాదుగా సేవిం చాలి. ఈ విధంగా రోజుకు మూడుపూటలా సేవిస్తుంటే కలరావ్యాధివల్ల కలిగిన వాంతులు, విరేచనాలు తగ్గిపోతాయి.

చెవిలో నొప్పి,వాపు తగ్గడానికి తెల్లగలిజేరు : తెల్లగలిజేరు ఆకురసాన్ని మూడునాలుగు చుక్కల మోతాదుగా రెండు పూటలా చెవుల్లో వేస్తుంటే చెవినొప్పి, చెవి చుట్టూ వచ్చిన వాపు అతిసులువుగా తగ్గిపోతాయి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button