ఆహారం

Garlic Benefits: వెల్లుల్లి- ఏ ఏ వ్యాధులను, తగ్గిస్తుందో తెలుసా..??

Garlic: Nutrients, Benefits & Uses

గుండె జబ్బులకు, కుష్టుతో సహా చర్మ వ్యాధులన్నింటికీ, పక్షవాతం నుండి నరాల జబ్బులన్నింటికీ, ఎముకలతోసహా సమస్తమైన ఎముకల వ్యాధులకి నిండు ఔషధంగా నిలబడుతుందో.. మన వంటిట్లో ఉండే ఆ మహా ఔషధే, వెల్లుల్లి… కానీ, ఇన్ని మంచి గుణాలున్నా, మనలో చాలామంది వెల్లుల్లిని మాములుగా కూరలలో వాడుకునే పదార్ధంగానే, చిన్నచూపు చూస్తారు. దానికున్న వైద్య విలువల్ని పట్టించుకోరు. బహుశా, దాని రుచి, దాని వాసనలే, దానికా చిన్న చూపుకి కారణం అవుతున్నాయి. అది దాని దురదృష్టం కాదు. వెల్లుల్లిని సద్వినియోగం చేసుకోలేకపోవడం మనిషి చేసుకున్న దురదృష్టమే!!, వెల్లుల్లిని ఏ ఏ వ్యాధులలో ఎలా వాడాలి.. ఎప్పుడు వాడాలి అనే పూర్తి వివరాలను తెలుసుకుందాం..

వెల్లుల్లిని వాడి నంతానవంతులు కండి
ఒక నియమం ప్రకారం, స్త్రీలు వెల్లుల్లి ని తింటుంటే, లైంగిక కార్యంలో అలసటరాదు. నడుము, పొట్ట, ఇతర అవయవాలలో జబ్బులురావు, వంధత్వం కలగదు. చక్కటి రూపవర్చస్సుతో చూడచక్కగా ఉంటారు. దీన్ని పురుషులు సేవిస్తే ధృఢంగా, మేధావులుగా, దీర్ఘాయువులుగా ఎదుగుతారు. సంతానయోగ్యులు అవుతారు. లైంగిక శక్తి వీరిలో అసమానంగా వుంటుంది…

క్షయవ్యాధికి వెల్లుల్లి మందు
శరీరంలో విష లక్షణాలు పోగొట్టి, రక్తాన్ని శుద్ధి చేసి, రక్తాన్ని, నాడీ వ్యవస్థని ఉత్తేజితం చేస్తుంది. పేగులోపని పొరల్ని సరిచేయడం ద్వారా జీర్ణశక్తిని పెంచి పేగుపూత, విరేచనాలు, టైఫాయిడ్, అమీబియాసిస్ వంటి వ్యాధుల్లో పేగులు చెడి పోకుండా కాపాడుతుంది.

ఊపిరితిత్తుల్లో నెమ్ముని కరిగించి క్షయ, న్యుమోనియా వ్యాధులు, త్వరగా తగ్గడానికి ఉపకరిస్తుంది. కీళ్ళ నొప్పులు, పక్షవాతంతో సహా సమస్త వాతవ్యాధుల్నీ ఇది ఒక దారిన పెట్టగలిగే సమర్ధత వెల్లుల్లి కి ఉంది.

జ్వరం : మలేరియా, టైఫాయిడ్, ఫ్లూ, ఒళ్ళంతా పచ్చబడిపోయే జ్వరం, (హెపటైటిస్), కీళ్ళవాతం వలన వచ్చే జ్వరం, టీ.బీ, న్యుమోనియాలలో వచ్చే జ్వరం, మూత్రంలో చీముదోషం వలన వచ్చే జ్వరం…. వీటన్నింటిలోనూ అయా జ్వరాలకు చేసే చికిత్సతో పాటుగా వెల్లుల్లిని కూడా తీసుకుంటే చికిత్స త్వరగా ఫలితాలనిస్తుంది.

జీర్ణాశయం : వెల్లుల్లి జీర్ణశక్తిని రెట్టింపు చేయగలుగుతుంది. ఒంట్లో వాతాన్ని పోగొడుతుంది. చక్కగా విరేచనం అయ్యేలా చేస్తుంది. సరిగ్గా అరగని ఆహారపదార్థాలను తీసుకునేప్పుడు, వెల్లుల్లిని కలిపి తీసుకుంటే తేలిగ్గా అరుగుతాయి. కడుపులో పాముల్ని చంపుతుంది.

ఊపిరితిత్తులు : ఇది కంఠస్వరాన్ని బాగుచేస్తుంది. గ్లాసు పాలలో నాలుగైదు వెల్లుల్లి గర్భాల్ని వేసి ఉడికించి రోజూ రాత్రిపూట తాగితే ఆస్తమా తీవ్రత తగ్గుతుంది. క్షయవ్యాధిలోనూ, న్యుమోనియాలోనూ కఫాన్ని కరిగించి శ్వాస ఆడడానికి దోహదపడ్తుంది. వీటి రసాన్ని వేడినీళ్ళతో తాగిస్తే ఉబ్బసం దగ్గు, ఆయాసం తగ్గుతాయి. జలుబు అధికంగా వుండి సైనసైటిస్ బాధలు వచ్చినప్పుడు నుదురు, కణతల పైన వెల్లుల్లిని నూరి, పట్టు వేస్తే నొప్పి తగ్గుతుంది. అయితే సున్నితమైన ప్రాంతాలలో వెల్లుల్లి పట్టు వేసినప్పుడు ఎక్కువ సేపు ఉంచడం మంచిది కాదు. కోరింత దగ్గులో దీన్ని తినిపించడమే కాకుండా, వీటిని దండగా గుచ్చి మెడలో వేస్తారు.
రక్తస్రావం : ఇది రక్తాన్ని శుద్ధి చేయడంలో అద్భుతమైన ఔషధం. ముఖం మీద మొటిమల వ్యాధితో బాధపడేవారు. తప్పని సరిగా వెల్లుల్లిని నేరుగాగాని, పాలలో ఉడికించిగాని తీసుకోవాలి. రక్తపోటును తగ్గించి, గుండె జబ్బు, పక్షవాతం రాకుండా కాపాడడం దీని కర్తవ్యం, వేగంగా కొట్టుకొంటున్న నాడినీ, గుండెదడనీ తగ్గిస్తుంది. రోజూ నియమబద్ధంగా పూటకు 1-2 వెల్లుల్లి గర్భాల చొప్పున మూడు పూటలూ తీసుకొంటే మంచి ఫలితం కన్పిస్తుంది.

మూత్రాశయంలో దోషాల్ని తొలగిస్తుంది. మూత్రాన్ని చక్కగా జారీ చేస్తుంది. మూత్రంలో ఏర్పడే రాళ్ళని కరిగిస్తుంది. వెల్లుల్లి కల్కాన్ని పొత్తికడుపు పైన, కొద్దిసేపు పట్టువేస్తే మూత్రం జారీ అవుతుంది. వెల్లుల్లిలో వుండే ఘాటైన గంధక పదార్ధం మూత్రం, చర్మం, ఊపిరితిత్తుల ద్వారా బైటకు విసర్జించబడ్తుంది కాబట్టి, ఈ మూడు అవయవాలలో వచ్చే సమస్తవ్యాధుల్నీ ఇది సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది…

చర్మానికి మృదుత్వాన్ని కల్గించి, సుకుమార్యాన్ని పెంచుతుంది. చెమటను శుభ్రపరుస్తుంది. ఆలివ్ నూనెలో వేయించి, ఆ నూనెని ఒంటికి రాసుకుంటే చర్మానికి మంచిరంగు వస్తుంది. ఆవ నూనెలో వేయించి రాస్తే గజ్జి, చిడుము తగ్గి కురుపులు మాడతాయి. కురుపుల పైన వెల్లుల్లిని నూరి కట్టుగడితే పుండు త్వరగా తగ్గుతుందని జపాన్ లో జరిగిన పరిశోధనలు నిరూపించాయి. వీటికి హీలింగ్ యాక్షన్ ఎక్కువ గోరుచుట్టు మీద వెల్లుల్లి పట్టు వేస్తే మంచిది. గడ్డలు కూడా త్వరగా పక్వానికి వస్తాయి. కుష్టు, బొల్లి, సారియాసిస్ వంటి భయంకర వ్యాధులతో బాధపడేవారు తప్పనిసరిగా వెల్లుల్లిని తీసుకోవాలి.

నాడీ వ్యవస్థకు సంబంధించిన అన్ని వ్యాధులపైనా దీని ప్రభావం ఉంది. చేతులు కాళ్ళు వణికే రోగాన్ని పోగొడుతుంది. ఉన్మాదం, మూర్ఛలు, మైగ్రెయిన్ తలనొప్పి, పక్షవాతం, న్యూరాల్జియా, అరికాళ్ళు అరిచేతుల మంటలు, తిమ్మిర్లు, మధుమేహవ్యాధిలో వచ్చే నరాల జబ్బులన్నింటిలోనూ వెల్లుల్లి అద్భుతంగా పనిచేస్తుంది. వెల్లుల్లి, పసుపు కలిపి నూరి పక్షవాతం వచ్చిన భాగానికి పట్టించాలి. చలికాలంలో వీటిని తింటే, వాతపు నొప్పులు తగ్గుతాయి. వాత వ్యాధులన్నింటిలోనూ కనీసం కూరల్లోనయినా వెల్లుల్లిని అధికంగా వాడడం మంచిది.

వెల్లుల్లి ఉన్న చోటుకి పాములూ, తేళ్ళూ రావని ప్రతీతి. పాము, తేలు, ఇతర కీటకాలు, పిచ్చికుక్క కాటుకి ఇది విరుగుడు. విషాన్ని పీల్చి వేయడంలో ఉత్తమైనది అని చెప్తారు . ఇవి కరిచిన చోట వెల్లుల్లిని చీల్చి కట్టుకట్టాలి. ఇది ప్రధమచికిత్సగా, వైద్యుడు అందుబాటులోకి వచ్చే వరకూ ఎవరైనా చేయగల చికిత్స.

జుట్టును మెత్తగా, నల్లగా వుండేలా వెల్లుల్లి చూస్తుంది. వెల్లుల్లిని రోజూ నియమానుసారం తినేవారికి వెంట్రుకలు నల్లబడతాయి. జుట్టు రాలిపోవడం తగ్గుతుంది.
ఎముకలు : ఎముకలు విరిగిన వ్యక్తులు తప్పనిసరిగా వెల్లుల్లిని తినాలి. వెల్లుల్లి రసాన్ని ఎముక విరిగిన చోట పట్టిస్తే త్వరగా అతుక్కుంటాయి. మడమశూలలో వెల్లుల్లిని నూరి కట్టుకట్టాలి. దెబ్బలు, బొప్పి వాపు, గాయాలు కూడా ఇలానే తగ్గుతాయి. కీళ్ళవాతం (రుమాటిజం), సయాటికా నడుమునొప్పి, మెడనరాలు పట్టేయడం (సర్వైకల్ స్పాండిలైటిస్), ఆఖరికి పోలియో వ్యాధిలో కూడా దీని ప్రభావం కనిపిస్తుంది. ఈ సమస్యలకు వెల్లుల్లి ని, పై పూతగాను, లోపలికి కూడా వాడాలి.

హార్ట్ ఎటాక్, రక్తపోటును తగ్గించడం, రక్తనాళంలో పేరుకుపోయే కొవ్వును కరిగించడం, హృదయ కండరాలను ఉత్తేజితం చేయడం… ఈ మూడు లక్షణాలూ, వెల్లుల్లికి ఉన్నాయి కాబట్టి, హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలను ఇది తగ్గిస్తుంది. ఒకసారి వచ్చిన వారికి తిరిగి రాకుండా కాపాడుతుంది. హృదయవ్యాధులకు విలువైన వైద్యం వెల్లుల్లి!

కేన్సర్ గడ్డల పెరుగుదలని నిరోధించడం ద్వారా, వెల్లుల్లి కేన్సర్ జబ్బు ముదరకుండా చూస్తుంది అని ఇటీవలి పరిశోధనలు పేర్కొంటున్నాయి.

శరీరంలో అన్ని అవయవాలపైనా దీని ప్రభావం వుంది. పేగుల కదలిక ని ఇది నియంత్రిస్తుంది. దీని Soothing Effect వలన పేగు లోపల… పొర నిర్మించబడి, అతిసార వ్యాధి, అమీబియాసిస్ వ్యాధిలో పేగుల్ని సంరక్షిస్తుంది. శరీరంలో ముఖ్యంగా కడుపులో చెడు బాక్టీరియాని నిర్మూలిస్తుంది. మంచి బాక్టీరియాని శరీరానికి వినియోకాపాడేలా చేస్తుంది.

కొద్దిగా వేడిచేసే గుణం దీనికుంది. కఫం, శ్లేష్మం, వాతం ఎక్కువగా వున్న వ్యాధుల్లో దీని ఉపయోగం ఎక్కువ. మనిషి Faint అయి పడిపోయి, ఒళ్ళంతా చల్లబడి పోయినప్పుడు దీన్ని నూరి, పసుపుతో కలిపి అరికాళ్ళకు, అరిచేతులకూ రాయడం, దీని రసాన్ని ముక్కల్లో చుక్కలుగా వేయడం వంటివి చేస్తారు.

తెలకపిండి, బొప్పాస వంటి కూరల్లో వేసుకుని తింటే బాలింతలకు పాలు పడతాయి. మేకపాలతో పండి, నేతితో దోరగా వేయించి లేహ్యంగా చేసుకొని తింటే, ధాతుపుష్టి లైంగికశక్తి పెరుగుతాయి. వేడి వేడి బూడిదలో వెలుల్లిని కాల్చుకుని తింటే మొలలు తగ్గుతాయి. గర్భాశయ వ్యాధులన్నింటిలోనూ మంచిది. నేత్రవ్యాధులు, చెవులకు సంబంధించిన వ్యాధుల్లో కూడా ఇది హితకరంగా పనిచేస్తుంది. వెల్లులి నూనె చెవిపోటును, తల తిరుగుడు వ్యాధిని తగ్గిస్తుంది.

ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదా, అని మోతాదుకి మించి తినకండి…..
వెల్లుల్లిని అతిగా తింటే, కళ్ళకూ, SPLEEN అనే అవయవానికీ హాని చేస్తుంది. అతిగా రక్తవిరేచనాలు, రక్తస్రావం, రక్తంతో కూడిన వాంతులు దగ్గు వస్తున్నప్పుడు, తీవ్రంగా ఆయాసం ఉన్నప్పుడు దీన్ని తీసుకొనే సాహసం చేయకూడదు. రక్తప్రవాహవేగం పెరుగుతుంది. కాబట్టి ఇలాంటప్పుడు జాగ్రత్తగా వుండాలి. వేడి చేసే శరీర తత్త్వం ఉన్నవారు దీన్ని అతిగా తింటే ఊరికే చిక్కిపోతారు.

పొరపాటున ఎక్కువ తిన్నట్లైతే, దీనికి విరుగుడుగా. వెయ్యి, దానిమ్మపళ్ళరసం, పులుసు, పాలు, బాదం నూనె ఉప్పునీళ్ళు పనిచేస్తాయి.

వెల్లుల్లి, దాల్చిన చెక్క, బిరియానీ ఆకు, శొంఠి, మిరియాలు, చిన్నఏలకులు, జాజికాయ, పచ్చకర్పూరం, సైంధవలవణం- వీటన్నింటినీ దేనికదే చూర్ణించి సమాన భాగాలు తీసుకుని ఈవీడియోలో చెప్పిన విధంగా, జీర్ణశక్తిని బట్టి, వ్యాధిని బట్టి వాడుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరం కాంతివంతమౌతుంది.

వెల్లుల్లిని తీసుకున్న తర్వాత వేడినీళ్ళుగానీ, మద్యంగానీ, కాచిన పాలుగానీ తాగితే మంచిది.
వెల్లుల్లి, దానిమ్మగింజల్ని కలిపి తింటే బాగాపని చేస్తుంది. నూరిన వెల్లుల్లి ఒక భాగం, నెయ్యి 2 భాగాలు, తేనె 4 భాగాలు కలిపి లేహ్యంగా చేసుకుని తింటే అన్ని వ్యాధుల్ని జయించి మనిషి నూరేళ్ళు బతుకుతాడని శాస్త్రం చెబుతుంది…

వెల్లుల్లిని సద్వినియోగం చేసుకోకపోవడం మనలోపమే. ప్రకృతి సిద్ధంగా అందుబాటులో ఉన్న ఈ మహాఔషధిని. కేవలం మషాలా ద్రవ్యంగా భావించుకోవడం మహాపచారం!!

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button