ఆహారం

Health Benefits of Millets : ఒక్కొక్క సిరిధాన్యం యొక్క లక్షణం, ఏ ధాన్యం ఏ ఏ రోగాలను తగ్గిస్తాయి..

Millets: Nutrients, Benefits & Uses

దేశీయ ఆహారం అయిన సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం ఎలా పొందాలి. ఒక్కో సిరి ధాన్యం కి ఉన్న ప్రాముఖ్యత, ఏ సిరి ధాన్యాలతో ఎటువంటి రోగాలు నయం ఔతాయి అనే విషయాలను తెలుసుకుందాం…
సిరిధాన్యాలంటే, కొర్రలు, అరికలు, సామలు, ఊదలు, అండుకొర్రలు. ప్రకృతి ప్రసాదించిన వరాలు ఇవి. ఔషధ గుణాల సమ్మిళితమైన ఆరోగ్యగుళికలు. వీటిని తింటూ 6 నెలల నుంచి 2 సంవత్సరాలలో ఎవరైనా వారి పూర్తిగా వ్యాధులను నిర్మూలించుకోవచ్చు. సిరిధాన్యాలు పోషకాలను అందించటమేకాకుండా, రోగ కారకాలను శరీరం నుంచి తొలగించి, దేహాన్ని శుద్ధిచేస్తాయి. మనిషికిఆరోగ్యం అందిస్తాయి…


సిరిధాన్యాలు ఎందుకు తినాలి అని మనలో చాలామందికి అనుకుంటూ ఉంటారు.. మనం తినేఆహారంలో పీచుపదార్థం ఎక్కువగా ఉంటేతిన్న ఆహారం నుంచి తయారైన గ్లూకోజు రక్తంలో చేరటానికిఎక్కువ సమయం పడుతుంది. అదే పీచు పదార్థం తక్కువగా ఉంటే గ్లూకోజు రక్తంలో చాలా వేగంగా చేరుతుంది. పీచు పదార్థం మరియు పిండిపదార్థాల నిష్పత్తి 10 కంటేతక్కువగా ఉండాలి. సిరిధాన్యాలైన కొర్రలు, అరికెలు, సామలు, ఊదలు, అండుకొర్రలను ఆహారంగా తీసుకుంటే వీటన్నింటిలో ప్రతి 100 గ్రాములకి 8 నుంచి 12.5 గ్రాముల వరకు పీచుపదార్థం, 60 నుంచి 69 గ్రాముల వరకు పిండిపదార్థం ఉంటుంది. అదేబియ్యాన్ని తీసికొంటే100 గ్రాముల బియ్యానికి 0.2 గ్రాముల పీచుపదార్థం, 79 గ్రాముల పిండిపదార్థం ఉంటుంది. పీచు పదార్థం మరియు పిండిపదార్థాల నిష్పత్తి సిరిధాన్యాలలో 1:8 లోపు, బియ్యంలో అయితే 1:395, గోధుమలలో 1:63 ఉంటుంది. ఈ నిష్పత్తి 10 లోపు ఉంటేనే అదిసరైన ఆహారం. ఈ నిష్పత్తి ఎంత ఎక్కువగా ఉంటేఅంత వేగంగా గ్లూ కోజు రక్తంలో కలుస్తుంది. ఈ నిష్పత్తి ఎంత తక్కువగా ఉంటే అంత నిదానంగా గ్లూకోజు రక్తంలో కలుస్తుంది. బియ్యం, గోధుమలలో ఈ నిష్పత్తి ఎక్కువగా ఉంది, కాబట్టి వాటిని ఆహారంగా తీసుకోవడం వలన చక్కెర వ్యాధివస్తుంది. దీనికి పరిష్కార మార్గం సిరిధాన్యాలను ఆహారంగా తీసుకోవాలి. ఈ నేపథ్యంలో చింతలేని ఆరోగ్యకర జీవితానికి సిరిధాన్యాలే సరైన ఆహారం ఆహార, ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. పీచు పదార్థం, పిండి పదార్థం, ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు తగుపాళ్ళలో కలిగిన కొర్రలు, అండుకొర్రలు, అరికలు, సామలు, ఊదలు వంటి చిరు ధాన్యాలు మానవాళికి సంపూర్ణఆరోగ్యాన్ని పస్రాదించే అసలైన అద్భుత ‘సిరిధాన్యాలు’ అని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారురు. ఈ దేశీయ ఆహారం అయిన సిరిధాన్యాలు, మధుమేహం, హృద్రోగాలు, విషజ్వరాలు, కాన్సర్ తదితర రోగాల నియంతణ్ర మరియు నిర్మూలనకు సహాయపడతాయి. సిరిధాన్యాలను ఆహారంగా తింటూ కొన్ని సూచనలు పాటించి మొండివ్యాధుల నుండి బయటపడి సంపూర్ణంగా ఆరోగ్యవంతులవుతున్న వారెందరో ఉన్నారు..

సిరిధాన్యాలు ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఒక్క అండుకొర్రలను మాత్రం కనీసం 4 గంటలు నానబెట్టిన తరువాతే వండుకోవాలి. మిగతా సిరిధాన్యాలను కనీసం రెండు గంటలు నానబెట్టిన తరువాత వండుకోవచ్చు. సమయాభావం ఉంటేముందురోజు రాత్రేనానబెట్టుకోవచ్చు. సిరిధాన్యాలను కలగలిపి వాడొద్దు. దేనికి అది విడివిడిగా వండుకోవాలి. కలగలిపి వండుకుని తినటం ద్వారా ఎటువంటి లాభం ఉండదు. ఎటువంటిఆరోగ్య సమస్యలు లేనివారు రెండు రోజులు ఒక రకం సిరిధాన్యాన్నే వాడాలి. తరువాత రెండు రోజులు వేరొక సిరిధాన్యం వాడాలి. అలాగ ఈ ఐదు రకాల సిరిధాన్యాలు ఒకదాని తరువాత ఒకటి చొప్పున తీసుకోవాలి. పదకొండవ రోజు తిరిగి, మొదటి సిరిధాన్యంతో ప్రారంభించాలి. వీటితోపాటు కషాయాలు కూడా తీసుకోగల్గితే మంచిది. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, సమస్యను బట్టి సిరిధాన్యాలలో కొన్నిటిని ఎక్కువ రోజులు వాడాల్సి రావొచ్చు. వరిబియ్యం, గోధుమ, మైదా, పాలు, పంచదార, కాఫీ, టీ, అయెడైజ్డ్ సాల్ట్, మాంసాహారం, రిఫైన్డ్ ఆయిల్స్ తప్పనిసరిగా మానివేయాలి. పెరుగు, మజ్జిగ వాడుకోవచ్చు. సముదప్రు ఉప్పు, గానుగ నూనెను వాడుకోవాలి.

ఏ సిరిధాన్యం ఏయే వ్యాధులను తగ్గిస్తుంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
సహజ పీచు పదార్థం కల్గి ఉండటమే సిరిధాన్యాల ప్రత్యేకత. సాధారణంగా ప్రతి మానవుడికిరోజుకు 38 గ్రాముల పీచుపదార్థం కావాల్సి ఉంటుంది. మనం, సిరి ధాన్యాలు మూడు పూటలా తిన్నప్పుడు, ఆ రోజుకు అవసరమైన 25-30 గ్రాముల పీచుపదార్థం ధాన్యాల నుండే లభిస్తుంది. తక్కిన 10 గ్రాములూ కూరగాయల నుండి, ఆకు కూరలు పొందవచ్చు. ఒక్కొక్క సిరిధాన్యమూ కొన్ని రకాల దేహపు అవసరాలనూ, ప్రత్యేకమైన రోగనిర్మూలన శక్తినీ కలిగిఉన్నాయి. వరి, గోధుమలలో పీచు పదార్థం 0.2 నుండి 1.2 వరకూ ఉన్నప్పటికీ, అది ధాన్యపు పైపొరలలోనే ఉండబట్టి పాలిష్ చేస్తేపోతోంది. కానీ, సిరిధాన్యాలలో పీచు పదార్థం గింజ మొత్తం పిండిపదార్థంలో పొరలు పొరలుగా అంతర్లీనమై ఉండటం వల్ల ఆరోగ్యం చేకూర్చటంలో పూర్తిగా ఉపయోగపడుతుంది. అందువల్లనే ఇవి సిరిధాన్యాలయ్యాయని గుర్తించాలి.
కొర్రబియ్యం – సమతుల్యమైన ఆహారం. 8 శాతం పీచుపదార్థంతో పాటు, 12 శాతం ప్రోటీను కూడా కలిగిఉంది. గర్భిణీస్త్రీలకి మంచి ఆహారమని చెప్పవచ్చు. కడుపులో శిశువు పెరుగుతున్నప్పుడు సహజంగా స్త్రీలలో వచ్చే మలబద్ధకాన్ని కూడా పోగొట్టేసరైన ధాన్యమిది. పిల్లల్లో ఎక్కువ జ్వరం వచ్చినపుడు మూర్ఛలు వస్తాయి. కొన్నేళ్లు అవి శాశ్వతంగా నిలుస్తూ ఉంటాయి. నరాల సంబంధమైన బలహీనతలకు సరైన ఆహారం కొర్రబియ్యం. కొన్ని రకాల చర్మ రోగాలను పారదోలేందుకు, నోటిక్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, ఉదర క్యాన్సర్, పార్కిన్సన్ రోగం, ఆస్తమా సమస్యలను, నివారించడంలో కూడా కొర్రబియ్యం ఉపయోగపడుతుంది.

అరికలు : రక్త శుద్ధికీ, ఎముకల గుజ్జు సమర్ధవంతంగా పనిచేసేలా చూసేందుకూ, అస్తమా వ్యాధి, మూత్ర పిండాలు, ప్రోస్టేటు, రక్త క్యాన్సర్, ప్రేగులు, థైరాయిడ్, గొంతు, క్లోమ గ్రంధులు, కాలేయపు క్యాన్సర్ల ను తగ్గించుకోవడానికి, అధికంగా చక్కెర వ్యాధి కలిగి కాలికి దెబ్బ తాకి, గాంగ్రీను వైపు వెళ్లిన వారికి కూడా అరికలు మేలు చేస్తాయి. డెంగ్యు, టైఫాయిడ్, వైరస్ జ్వరాలతో నీరసించిన వారి రక్తం శుద్ధి చేసి అరికలు చైతన్య వంతుల్ని చేస్తాయి.

సామలు – మగ, ఆడ వారి పునరుత్పత్తి మండలంలోని వ్యాధులను బాగు చేస్తాయి. ఆడవారిలో పిసిఓడి ని తగ్గించుకోవచ్చు. మగ వారిలో వీర్యకణాల సంఖ్య పెరుగుతుంది. ఇవికాక మానవుడి లింఫు నాడీ వ్యవస్థ శుద్ధికి, మెదడు, గొంతు, రక్తక్యాన్సర్, థైరాయిడ్, క్లోమ గ్రంథుల క్యాన్సర్ల నియంత్రణకు సామలు వాడకం వల్ల ప్రయోజనం ఉంటుంది.

ఊదలు : థైరాయిడ్, క్లోమ గ్రంథులకు మంచివి. చక్కెర వ్యాధిని పారదోలుతాయి. కాలేయం, మూత్రాశయం, గాల్ బ్లాడర్ శుద్ధికి పనిచేస్తాయి. కామెర్లను తగ్గించడానికి, వచ్చి తగ్గాక కూడా కాలేయానికి పుష్టి చేకూరుస్తాయి. కాలేయపు, గర్భాశయపు క్యాన్సర్లను తగ్గించడానికి ఊదబియ్యం పనికి వస్తాయి.

అండుకొర్రలు – మొలలు, భగన్దరం, మూలశంక, ఫిషర్స్, అల్సర్లు, మెదడు, రక్తం, స్తనాలు, ఎముకల, ఉదర, ప్రేగుల, చర్మ సంబంధ క్యాన్సర్ చికిత్సకు బాగా ఉపయోగపడతాయి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button