ఆహారం

Linseed plant Benefits: – ‘అడ్డసరం’.. ఆరోగ్యప్రయోజనాలు తెలుసా..

Linseed plant : Nutrients, Benefits & Uses

అవిసె చెట్టు.. ఈ చెట్టును మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. త‌మ‌ల‌పాకు తోట‌ల్లో త‌మ‌ల‌పాకు తీగ‌ను అల్లించ‌డానికి ఈ చెట్టును ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. దీనిని అవిశె చెట్టు అని కూడా అంటారు. ఈ అవిసె చెట్టు చూడ‌డానికి మామూలుగా ఉన్నా ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. దీనిని ఔష‌ధంగా ఉప‌యోగించి మ‌నం అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదంలో కూడా ఈ చెట్టును ఉప‌యోగించి అనేక జ‌బ్బుల‌ను న‌యం చేస్తున్నారు. అవిసె చెట్టులో ఉండే ఔష‌ధ గుణాలు ఏమిటి.. ఈ చెట్టు వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటి, అనే విషయాల గురించి తెలుసుకుందాం….

సంస్కృతంలో ఉమా, అతనే, అగస్త్యవృక్షం అని, హిందీలో అగస్తియా, మసినా అని, తెలుగులో అవిసె చెట్టు. అగిసెచెట్టు అని, ఇంగ్లీషులో Linseed plant అని అంటారు.

ఈ అవిసెలో తెల్లపూలు పూసేవి. అలాగే ఎర్రపూలు, నల్లపూలు, పసుపురంగు పూలు పూసేవి నాలుగురకాలున్నాయి. దీనిచెట్టుబెరడు, ఆకు, పువ్వు చేదుగావుంటాయి . వీటిరసం వేడి చేస్తుంది. అయితే, దీని మహాశక్తివలన కఫ రోగాలు, క్రిమి రోగాలు, పైత్యజ్వరాలు, రక్తపైత్యం, సర్ప విషం హరించి పోతాయి, అతికొవ్వును తగ్గించి శరీరాన్ని నాజుకుగా చేస్తుంది.


గవద బిళ్ళలు తగ్గడానికి :
ఆవిశాకు, కొద్దిగా గుల్లసున్నం కలిపినూరి, చెంపలపైన పట్టించి దూదితో అంటిస్తూవుంటే గవదబిళ్ళలు తగ్గి పోతాయి. లేక ఒట్టి ఆకురసమైనా పైనపూస్తుంటే ఆ బిళ్ళలు కరిగిపోతాయి.

సుఖవిరేచనానికి – స్థాల్యహారానికి
అవిశాకుతో ఆకుకూరవండి తింటుంటే సుఖ విరేచనం కావడమేకాక పాట్ట మొదలైనచోట్ల అతిగా పెరిగిన కొవ్వుమొత్తం కరిగిపోయి నడుము సన్నగా తయారౌతుంది.

అనాదినుండి మనదేశంలో ముఖ్యంగా పశువులకు అవిశాకును తినిపించడం, ఈనాటికి కూడా కొన్నిప్రాంతాల్లో ఆచారంగా వుంది. ముఖ్యంగా ఎద్దులకు, కోడెలకు ఈ ఆకును తినిపిస్తారు. ఎందుకంటే శరీరాన్ని దృఢంగా వుంచుతూ అతికొవ్వు లేకుండా ఆరోగ్యంగా వుండడంకోసం ఈ ఆకును తినిపిస్తారు.

కంటిరోగాలకు – కమ్మనిమార్గం:
అవిశాకునుకడిగి చేతితోనలిపి రసంతీసి వడపోసి, ఒకచుక్క కంటిలో వేసుకుంటుంటే కంటి మసకలు తగ్గిపోయి, చూపు నిర్మలమౌతుంది,రేచీకటి కూడా తగ్గిపోతుంది.

పార్శ్వపు తలనొప్పి – పారిపోవుటకు
అవిసెగింజలు 5గ్రాములు , అవాలు 5గ్రాములు కలిపి మంచినీటితో మెత్తగానూరి ఆమిశ్రమాన్ని తల కణతలపైన మాత్రమే పట్టులాగా వేసి పైన కాగితం అంటించాలి. తరువాత, ఇటుకపోడిని వేయించి
బట్టలో మూటకట్టి దానితో కాపడం పెడుతూవుంటే అప్పటికప్పుడే పార్శ్వపునొప్పి తగ్గిపోతుంది.

శరీరానికి తెల్లనికాంతి, అతిసౌందర్యప్రాప్తి
అవిసెపూలు తెచ్చి అరబెట్టి దంచి జల్లించి నిలువ చేసుకోవాలి. రోజూ తగినంత పొడిని గేదె పాలతో కలిపి మెత్తగానూరి, అందులో కొంచెం వెన్న కూడా కలిపి ఈ మిశ్రమాన్ని శరీరానికి నలుగుపిండిలాగా మర్దనచేసి, ఎండిపోయిన తరువాత స్నానంచేస్తుంటే, శరీరంలోని నలుపంతా విరిగిపోయి చర్మమంతా తెల్లగా సౌందర్యవంతంగా తయారౌతుంది.

మూత్రపిండాల పరిరక్షణకు :
అవిసెగింజల్ని దోరగా వేయించి వాటిలో సగం తూకంగా కండచక్కెరపొడి కలిపి రోటిలో వేసి బాగా మెత్తగా అయ్యేంతవరకు దంచాలి. తరువాత అముద్దను 10 గ్రాముల మోతాదుగా లడ్డులాగా తయారుచేసి నిలువవుంచుకోవాలి. మూత్రపిండాలు పాడైనవారు అనేక మూత్ర వ్యాధులతో బాధపడే వారు ఉదయం సాయంత్రం ఆహారానికి గంటముందు ఒక అవిసెలడ్డును తింటూవుంటే అతిత్వరగా ఆసమస్యలన్నీ తీరిపోతాయి.

ఉబ్బసానికి – ఉదృతమైనయోగం
దోరగా వేయించిన అవిసెగింజలు 40గ్రాములు, దోరగా వేయించిన మిరియాలు 10గ్రాములు తీసుకొని, విడివిడిగా దంచి జల్లించి కలిపి వుంచుకోవాలి. రోజూ రెండుపూటలా 3గ్రాముల పొడి ఒకచెంచా తేనెతో కలిపి తింటూవుంటే మూడు, నాలుగు వారాలలో ఉబ్బస వ్యాధి పూర్తిగా హరించిపోతుంది.

సెగగడ్డలు తగ్గిపోవుటకు
అవిసెగింజలు, పసుపుకొమ్ములు సమంగా తీసుకొని మెత్తగానూరి గడ్డలపైన వేసి కట్టుకడుతూ వుంటే మూడురోజులలో గడ్డలు పగిలిపోయి పుండు మాడిపోతుంది.

రేచీకటి తగ్గిపోవుటకు
ప్రతిరోజూ అవిసెపూలనుగానీ, మొగ్గలనుగానీ కూరగా వండుకొని అన్నంలో కలుపుకొని వరుసగా 21రోజులు తింటుంటే రేచీకటి రోగం హరించి పోతుంది.

ముగ్ధమోహన సౌందర్య ప్రాప్తి :
సీమఅవిసెగింజలు, మినపప్పు, గోధుమలు, దోరగా వేయించిన పిప్పళ్ళపొడి సమభాగాలుగా కలిపి నిలువవుంచుకోవాలి. రోజూ స్నానానికి గంటముందు తగినంత పాడిని మంచి నెయ్యితో బాగా కలిపి, ఆముద్దను శరీరమంతా రుద్దుకొని అది బాగా ఆరిపోయిన తరువాత స్నానంచేస్తుంటే మన్మధుని వంటి శరీరకాంతి చేకూరుతుంది.

పెరిగినపొట్టకు:
అవిసెగింజలను, ఆముదంగింజలను సమభాగంగా తీసుకోవాలి. ఆముదపు గింజలను పగులకొట్టి పైపెచ్చులు తీసివేసి లోపలిపప్పుతో పాటు అవిసెగింజలను కూడా కలిపి తగినన్ని నీటితో మెత్తగా ముద్దలాగా కొంచెం పలుచగా వుండేటట్లు నూరాలి. ఈ మిశ్రమపదార్థాన్ని కడుపు పైన పట్టులాగా వేయాలి. ప్లీహము చెడినప్పుడు, కాలేయము మందగించినప్పుడు కడుపు ఎత్తుగా ఉబ్బిపోయి బల్లరోగం వస్తుంది. అలా పెరిగిన పొట్టపైన గానీ, లేక సహ జంగా అతికొవ్వుతో పొట్ట తదితరభాగాలు ఎత్తుగా పెరిగినవారుగానీ, ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ వేస్తుంటే పొట్ట కరిగిపోతుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button