ఆహారం

Mustard Benefits – సమస్త రోగాల నుండి ఆవాలు కాపాడుతుంది

Mustard : Nutrients, Benefits & Uses

మన వంట ఇంటిలో పోపులడబ్బాలో వున్న ఆవాలు నిన్ను, నీ కుటుంబాన్ని ఎన్నిరకాల అనారోగ్య సమస్యల నుండి తప్పించగలవో నీకు తెలుసా! చూడటానికి అతిసూక్ష్మమైనవిగా కనిపించే ఈ ఆవాలగింజలలో భగవంతుడు ఎంతో అత్యున్నతమైన శక్తిని నింపాడు. ఈ శక్తితో అనేక వికృత, కఠిన, దీర్ఘ రోగాలను నాశనంచేయమని వాటిని ఆజ్ఞాపించి మన వద్దకు చేర్చాడు. మనమంతా అంధులమైపోయి ఎదుటవున్న ఆహారఔషధాన్ని తెలుసుకోలేక ప్రతిచిన్న అనారోగ్య సమస్యకు ఆసుపత్రులకు పరుగులుతీస్తున్నాము. ఈ పరుగుల పందెంలో డబ్బుపోయి రోగాలు తగ్గక, మరికొన్ని కొత్తరోగాలను కొనితెచ్చుకొని కుమిలిపోతూ జీవశ్చవాళ్ల బ్రతుకుతున్నాం. వంట ఇంటిలోని వజ్రాయుధం వంటి ఈ ఆవాల గురించి తెలుసుకుని మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి .

ఆవాలు పేర్లు:
సంస్కృతంలో సక్షప అని, హిందీలో సరసో,రాయి అని, తెలుగులో ఆవాలు అని, ఆంగ్లంలో Indian Mustard అంటారు. ఆవాలు ఎరుపు, నలుపు, తెలుపు అనే రంగుల బేధాలతో దొరుకుతాయి. ఇవి కారపురుచితో చాలా వగరుగా ఉంటాయి. అధికమైనవేడిని పుట్టిస్తాయి. కఫం, వాతం, అజీర్ణం, దురదలు, మెదడులోని క్రిములు, తలలోని చెడునీరు, కుష్టు, పక్షవాతం వంటి అనేకరోగాలను సమర్ధవంతంగా అణచివేస్తాయి.

ఆవాల ఔషధగుణాలను తెలుసుకున్న ఆయుర్వేద మహర్షులు వీటిని ప్రతిరోజూ ఆహారపదార్థాలలో అతికొద్దిగా వాడుతూవుంటే అనేకరోగాలను మానవులకు కలుగకుండా చేస్తాయని తమ ప్రయోగాల ద్వారా నిరూపించి వీటిని మన వంటింటి పోపుల డబ్బాలోకి చేర్చారు.

ఒక్కనిమిషంలో – తేలు విషం విరుగుడు ఆవాలు, పత్తిఆకులు కలిపి నలగ్గొట్టి తేలుకుట్టిన చోట పట్టిస్తే ఒక్కనిమిషంలో విషం విరిగిపోతుంది.

మూర్ఛ వెంటనే తగ్గుటకు – కొంచెం ఆవాలను మంచినీటితో మెత్తగా నూరి ఆముద్దను ముక్కుదగ్గర వాసన తగిలేటట్లుగా పెడితే మరుక్షణంలోనే ఫిట్స్ వల్ల అపస్మారంవల్ల మూర్ఛవల్ల తెలివితప్పిన రోగి వెంటనే మేల్కొంటాడు.

నీళ్ళవిరేచనాలకు ఆవాలు – కొంచెందోరగావేయించిన ఆవాలు, బెల్లం సమంగా కలిపి అతిమెత్తగా దంచి బఠాణి గింజంత మాత్రలుచేసి నిలువచేసుకోవాలి. నీళ్ళవిరేచనాలతో బాధపడేవారు పూటకు ఒక గోలీ చొప్పున రెండు లేక మూడుపూటలా మంచి నీటితో సేవిస్తూవుంటే నీళ్ళ విరేచనాలు ఆగిపోతాయి.

వరిబీజరోగానికి ఆవనూనె వృషణాలలో వాయువుచేరి నరాలు కిందికిలాగి వాపుపుట్టి వృషణం క్రిందికిజారిన స్థితిలో రోజూ రాత్రిపూట ఆవాల నూనెను అవృషణంపైన సున్నితంగా మర్దనచేయాలి. ఆహారంలో నెయ్యికి బదులు గాను, కూరల తాలింపులోను ఆవనూనెను వాడుతూ తింటుంటే వరిబీజం హరించిపోతుంది.

మూత్రం బట్టలోపడే – పెద్దల సమస్యకు: కొంచెం దోరగా వేయించిన ఆవాలను దంచి పొడిచేసి ఒకటి లేక రెండుచిటికెల మోతాదుగా ఆవాల పొడిని రాత్రి ఆహారంలో మొదటిముద్దలో కలుపుకొని ప్రతిరోజూ తింటుంటే బట్టలో మూత్రం పడటం ఆగిపోతుంది.

దురదలు, దద్దుర్లు తగ్గుటకు ఆవాల నూనె 50గ్రాములు తీసుకొని గోరువెచ్చగా వేడిచేసి, అందులో అమృతధార 20చుక్కలు కలిపి వుంచాలి. ఈమిశ్రమాన్ని పైన మర్దనచేస్తుంటే దురదలు, దద్దుర్లు ఠపీమని తగ్గిపోతాయి.

సౌందర్యానికి ఆవనూనె – దానిమ్మపండ్ల పైబెరడును తీసుకొచ్చి తగినంత ఆవనూనె కలిపి మెత్తగానూరాలి. ఆముద్దను బట్టలో వేసి పిండగా వచ్చినరసం స్తనాలపైన రాత్రి నిద్రించే ముందు మర్ధనచేసుకొని పైనదూది అంటించి బ్రా వేసుకోవాలి. ఇలా చేస్తూవుంటే స్తనాలు బిగువుగా దృఢంగా మారతాయి.

దగ్గులకు – ఆవనూనె : ఎడతెరిపి లేకుండా దగ్గుతో బాధపడేవారు కొంచెం ఆవనూనెను తమ గుదము (ఆసనం) లోపల, బయట లేపనంచేస్తుంటే దగ్గుతగ్గిపోతుంది.

చెవిచీముకు – ఆవనూనె ఆవనూనె 50గ్రాములు తీసుకొని అందులో నల్లతుమ్మ చెట్టు పూలు 20గ్రాములు వేసి చిన్నమంటపైన ఆ పూలన్నీ నల్లగా మాడిపోయేవరకు మరిగించి దించి వడపోసి నిలువచేసుకోవాలి. ఈనూనెను రోజు రెండుపూటలా, మూడునాలుగు చుక్కలు గోరువెచ్చగా చెవులలో వేస్తుంటే చెవిచీము, చెవిపోటు, చెవిలో దురద తగ్గిపోతాయి.

ముండ్లు, పుండ్లు హరించే మలామ్: ఆవనూనె 50గ్రాములు తీసుకొని పాత్రలోపోసి, పొయ్యిమీద పెట్టి అందులో తేనెమైనం 20 గ్రాములు వేసి చిన్నమంటపైన కరిగించాలి. తరువాత దించి వడ పోసి మళ్ళీ పాత్రలోపోసి అందులో తెల్లగుగ్గిలం పొడి10గ్రాములు, ఆయుర్వేద షాపులో దొరికే రూమిమస్తకి చూర్ణం 15గ్రాములు కలపాలి. ఇది ఆరేటప్పటికి మలాంలాగా తయారౌతుంది. ఈ మలామ్ ని పైన పట్టిస్తూవుంటే ఎంత మొండి పుండ్లు అయినా మాడిపోతాయి. అలాగే శరీరంలో ఎక్కడైనా గుచ్చుకున్నముండ్లు లోపలే విరిగిపోయి రాకుండా వుంటే దానిపైన ఈ మలాము పట్టిస్తే అవి బయటకు వస్తాయి.

నిద్రలో పండ్లుకొరికే పిల్లలకు: కడుపులో క్రిములుంటే పిల్లలు నిద్రలో పండ్లు కొరుకుతారు. అందువల్ల ఆవాలను కొంచెం దోరగా వేయించి దంచి జల్లించి నిలువవుంచుకోవాలి. ఈ పొడి అరగ్రాము మోతాదుగా అరకప్పు పెరుగులో కలిపి ఉదయంపూట తినిపిస్తూవుంటే పిల్లలకడుపులో వుండే క్రిములు మూడురోజుల్లో మలం ద్వారా పడిపోయి పిల్లలు నిద్రలో పండ్లుకొరకడం ఆపివేస్తారు.

కుక్కకాటుకు ఆవాలనూనె : కుక్క కరచినవెంటనే తగినన్ని ఎండుమిరపకా యలు తెచ్చి వాటిల్లో తగినంత ఆవాలనూనె కలిపి మెత్తగా ముద్దలాగా దంచాలి. అముద్దను కుక్కకరచిన చోట పట్టువేసి కదలకుండా గుడ్డతోకట్టుకట్టాలి. నాలుగైదు రోజులవరకు ఈకట్టుమీద పొరపాటుగా నీరు పడకూడదు. అలాచేస్తే కుక్కవిషం విరిగిపోతుంది.

బోదవాపులకు ఆవాలు : ఆవాలు, ఉమ్మెత్తాకులు, ఆముదపుచెట్టు వేర్లు, మునగచెట్టు పై బెరడు, సమభాగాలుగా తీసుకొని తగినన్ని మంచినీరుతో మెత్తగానూరి ఆ ముద్దను బోద వాపులపైన వేసి కట్టుకడుతూవుంటే క్రమంగా బోద హరించిపోతుంది.

పిల్లలకు – నూరేండ్ల దంత సౌందర్యం: పిల్లలకు మూడుసంవత్సరాలు నిండి నాలుగో సంవత్సరం ప్రారంభమైనప్పటినుండి ప్రతిరోజూ ఉప్పు ఆవనూనె కలిపిన మిశ్రమంతో పండ్లుతోమిస్తూ వుంటే వారికి నూరేండ్లువరకు పండ్లు కదలవు, ఊడవు. ఎలాంటి నోటివ్యాధులుకూడా వారి దరిచేరవు.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button