ఆరోగ్యం

కాళ్ళ పగుళ్లు పోవాలంటే.. To get rid of cracked legs

To get rid of cracked legs: కాళ్ళు అందంగా ఉండాలని అందరికీ ఉన్నా, అది కొందరికే సాధ్యపడుతుంది. కాళ్ళు నున్నగా, అందంగా రావడానికి, ఎన్నో రకాల పూతలను పూస్తుంటారు. శరీరంలో అన్నిటికంటే పాదాలు చివరగా ఉండడం వలన రక్తప్రసరణ సరిగ్గా జరగక, ఆ పాదాల చర్మం గట్టిగా అవుతుంది. లావుగా ఉన్నవారికి, రక్త ప్రసరణ సరిగ్గా లేనివారికి ఈ సమస్య ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా పాదాలను సరిగ్గా తోముకోనందువలన పగుళ్లు వస్తాయి. పగుళ్ల మధ్య మట్టి పేరుకుపోయి, ఆ భాగంలో కొత్త చర్మం పుట్టక, ఉన్న చర్మం మందపడి పగిలిపోతూ ఉంటుంది. ఈ చిట్కాలను అనుసరించి మీ కాళ్ళను మృదువుగా, అందంగా చేసుకోవచ్చు

కొబ్బరి నూనె :

పాదాలకు కొబ్బరి నూనె గాని, ఆముదం గాని రాసి వాటిని వేడి నీటిలో పెట్టి అలానే 20-25 నిమిషాలు ఉంచాలి. చేయడం వలన మొద్దుబారిన చర్మం మెత్తపడి, అక్కడ ఉన్న కరిగిపోతుంది. పాదాలను తీసి బట్టలు ఉతికే బ్రష్ తో పగిలిన భాగంపై రుద్దితే, మొద్దుబారిన చర్మం మెత్తపడి ఊడిపోతుంది. ఇలా అక్కడ ఉన్న మృత చర్మాన్ని తీసివేయడం వలన అక్కడ కొత్త చర్మాన్ని మన శరీరం తయారు చేస్తుంది. తరువాత పాదాలను శుభ్రంగా తుడుచుకోవాలి. వాటికీ మరల కొద్దిగా కొబ్బరి నూనె ను రాయండి. ఇలా రాయడం వలన ఆ చర్మం మెత్తగా అయి, రోజంతా గట్టిపడకుండా ఉంటుంది.

సాక్స్, షూస్ వాడడం:

అవకాశం ఉన్నవారు సాక్స్, షూస్ వాడడం వలన కాళ్ళు మెత్తగా ఉంది పగుళ్లు రాకుండా ఉంటాయి.

పగుళ్లు రాకుండా ఉండాలంటే:

పగుళ్లు లేని వారు పగుళ్లు రాకుండా ఉండాలంటే వారానికి రెండు సార్లు స్నానానికి వెళ్లేముందు కొబ్బరి నూనె రాసుకుని వెళ్లి, స్నానం చేసేప్పుడు పాదాలకు బ్రష్ పెట్టి రుద్దితే ఆ భాగంలో మట్టిపోయి శుభ్రంగా ఉంటాయి. స్నానం చేసాక పాదాలకు కొంచెం కొబ్బరి నూనె రాసుకుంటే , పాదాలు మెత్తగా ఉంటాయి.

ముఖ్య గమనిక : ఈ వివరాలు ఆరోగ్య నిపుణులు మరియు పరిశోధనల నుండి అందించబడ్డాయి. మేము అందించే ఈ సమాచారం ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా చిన్న సమస్య వచ్చిన వైద్యుని నుండి సలహా తీసుకోవడం ఉత్తమం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button